For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్హాప్యం లో మీకు లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు ఇవే.

పదవీ విరమణ తరువాత ఖర్చులకు పొదుపు చాల అవసరం. అనేక సంవత్సరాల కృషి తరువాత, విరమణ పదం వింటేనే అనేక మంది మూకాల్లో చిరునవ్వు కనిపిస్తుంది.

|

పదవీ విరమణ తరువాత ఖర్చులకు పొదుపు చాల అవసరం. అనేక సంవత్సరాల కృషి తరువాత, విరమణ పదం వింటేనే అనేక మంది మూకాల్లో చిరునవ్వు కనిపిస్తుంది అదేవిదంగా కొంతమంది జీతం లేకుండా జీవితాన్ని ఊహించడం కష్టం గా భావిస్తుంటారు. సంతోషంగా మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా విరమణ తరువాత, మీరు ఆదాయం యొక్క రోజువారీ సంపాదన పొందే అవకాశం ఉంది.

విరమణ తరువాత:

విరమణ తరువాత:

చాల కాలం డబ్బు సంపాదించి, విరమణ తరువాత, డబ్బు మొత్తాన్ని పొందేటప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. అప్పుడు మీ మిగిలిన జీవితాలు సౌకర్యవంతంగా జీవిస్తూ మీ కోరికలను నెరవేర్చుకోగలరు. అందువల్ల మెరుగైన విరమణ ప్రణాళికను నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఏ వయస్సులో విరమణ:

ఏ వయస్సులో విరమణ:

మీరు ఏ వయస్సులో విరమణ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి, రెండవది మీ విరమణ తర్వాత ఎటువంటి జీవనశైలిని కోరుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం, ఈ లక్ష్యాలను పొందడానికి, మీరు పొదుపుగా పెట్టుబడులు పెట్టడానికి ఒక ప్రణాళికను రూపొందించడం చాల ముఖ్యం.

ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా ముఖ్యం:

ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా ముఖ్యం:

విరమణ తరువాత జీవితం సక్రమంగా గడిపేందుకు అలాగే డబ్బు పొదుపు చేసేందుకు మీరు వివిధ పెట్టుబడుల ప్రణాళికలు తెలుసుకోవడం ముఖ్యం. మీరు బంగారం,రియల్ ఎస్టేట్, ఈక్విటీస్ వంటి వాటిలో డబ్బు పెట్టుబడి ఉత్తమం.దీనితో కొంత సమయం తర్వాత మీరు అధిక రాబడిని పొందవచ్చు.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్:

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్:

సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం సీనియర్ పౌరుల కోసం ప్రారంభించిన పథకం. ఈ పథకంలో 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తికి పెట్టుబడికి అర్హత ఉంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేయాలనుకుంటే, అతను కూడా పెట్టుబడికి అర్హుడు. ఒక వ్యక్తి గరిష్టంగా SCSS లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అర్హత ఉంటుంది. ఈ పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంది మరియు మరొక 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు. SCSS 8.5% వడ్డీని ఇస్తుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్:

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్:

పదవీ విరమణ తర్వాత ఆదాయం క్రమానుగత ప్రవాహాన్ని POMIS నిర్ధారిస్తుంది. ఒక వ్యక్తి చేసే కనీస పెట్టుబడి రు. 1,500 మరియు అతను గరిష్టంగా రూ. 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి ఖాతాను ఇద్దరు లేదా ముగ్గురు పెద్దలు కలిసి ప్రారంభించవచ్చు. ప్రతి ఉమ్మడి ఖాతాలో మొత్తం జాయింట్ అకౌంట్ హోల్డర్లకు సమాన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. సింగల్ ఖాతాను ఉమ్మడి మరియు వైస్ వెర్సాగా మార్చుకోవచ్చు. ఉమ్మడి ఖాతాదారులకు గరిష్ట పెట్టుబడుల మొత్తం రు. 9 లక్షలు. ఈ పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ కాలంతో వస్తుంది. POMIS 7.7% వడ్డీ రేటును అందిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్:

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్:

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు బ్యాంకు స్థిర డిపాజిట్లు పోలి ఉంటాయి. కనీస మొత్తం రూ. 200, పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తంలో క్యాప్ ఉండదు. ఈ పథకంలో ఒక వ్యక్తి డిపాజిట్ చేసేందుకు 1 సంవత్సరం, 2-సంవత్సరాల, 3-సంవత్సరాల మరియు 5-సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ కాలాల వడ్డీ రేటు వరుసగా 7%, 7.1%, 7.3%, 7.8%. 5 సంవత్సరాల డిపాజిట్ క్రింద పెట్టుబడి ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద ఒక పన్ను ప్రయోజనం కోసం అర్హత ఉంటుంది.

Read more about: personal finance retirement
English summary

వృద్హాప్యం లో మీకు లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు ఇవే. | Planning For Retirement? 5 Best investment Options

After years of hard work, the word retirement brings cheer on many faces while some also get jittery with the mere thought of life without a salary.
Story first published: Friday, August 31, 2018, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X