For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లతో ఎలా ప్ర‌యోజ‌నం పొందాలి?

వినియోగదారులు మరింతగా క్రెడిట్‌ కార్డులు ఉపయోగించేందుకు, వారికి ప్రోత్సాహకాలను అందించేందుకే. కంపెనీని బట్టి రివార్డు పాయింట్స్‌ సౌలభ్యాలు మారుతూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలో రివార్డు పాయింట్ల వ‌ల్ల క‌లిగే ప్ర

|

షాపింగ్ సంస్కృతి పెర‌గ‌డంతో పాటు, వివిధ ఉద్యోగాల కార‌ణంగా వ్య‌క్తులు సంపాదించే ఆదాయం పెర‌గ‌డంతో కార్డుల వాడ‌కం బాగా పెరిగింది. క్రెడిట్‌ కార్డుతో షాపింగ్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే విషయం రివార్డు పాయింట్లు. చాలా క్రెడిట్‌ కార్డు కంపెనీలు గొలుసుకట్టు దుకాణాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని రకాల సేవలను ఉపయోగించినప్పుడు, కొన్ని రకాల వస్తువులను కొన్నప్పుడు వినియోగదారుడికి అదనంగా రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. ఇదంతా వినియోగదారులు మరింతగా క్రెడిట్‌ కార్డులు ఉపయోగించేందుకు, వారికి ప్రోత్సాహకాలను అందించేందుకే. కంపెనీని బట్టి రివార్డు పాయింట్స్‌ సౌలభ్యాలు మారుతూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలో రివార్డు పాయింట్ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం, స‌కాలంలో వీటిని ఎలా ఉప‌యోగించాలి, అలా వాడుకోక‌పోతే ఏమ‌వుతోందో తెలుసుకుందాం.

1. రివార్డు పాయింట్ల కోసం క్రెడిట్ కార్డులు కాదు.

1. రివార్డు పాయింట్ల కోసం క్రెడిట్ కార్డులు కాదు.

అయితే రివార్డు పాయింట్స్‌ కోసమే రివార్డ్‌ క్రెడిట్‌ కార్డులను అందించే వాటి కోసం చూడకూడదు. ఎందుకంటే రివార్డు కార్డులకు సాధారణ కార్డుల కన్నా అధిక వడ్డీ వసూలు చేస్తారు. అన్ని కార్డులు, లావాదేవీలకు రివార్డు పాయింట్లు ఒకేలా ఉండవు. సాధారణంగా వినియోగించే ప్రతి 100 నుంచి 150 రూపాయలకు ఒకటి లేదా రెండు పాయింట్లు వస్తాయి. ఇలా ఆర్జించిన రివార్డు పాయింట్లన్నంటినీ ఉపయోగించుకుని కంపెనీ అందించే వివిధ వస్తువులు లేదా సేవలను పొందవచ్చు.

కొన్ని బ్యాంక్‌లు పాయింట్లను రిడీమ్‌ చేసేందుకు సైతం రుసుములను విధిస్తున్నాయి. ఇందుకోసం క్రెడిట్‌ కార్డు నియమనిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏదైనా సందేహం వస్తే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.

2. సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లు ఇలా... :

2. సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లు ఇలా... :

చాలా మంది ఎక్కువ పాయింట్ల కోసం ఎక్కువ కొనాలనుకుంటారు. అలా కాకుండా తెలివిగా కార్డును వాడుకోవడం ద్వారా ఎక్కువ పాయింట్లను సంపాదించవచ్చు.

పండుగల సమయాల్లో బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు కంపెనీలు వివిధ ఆఫర్ల మెయిల్స్‌ పంపుతుంటాయి. వాటన్నింటినీ చూడకుండా అలా వదిలేయకూడదు. అప్పుడప్పుడు అవసరాలకు తగిన వాటిపై ఆఫర్లు ఏమైనా ఉంటే గమనిస్తూ ఉండాలి.

 3. షాపింగ్, ఖ‌ర్చు, క్రెడిట్ కార్డు వినియోగం-రివార్డు పాయింట్లు

3. షాపింగ్, ఖ‌ర్చు, క్రెడిట్ కార్డు వినియోగం-రివార్డు పాయింట్లు

1. క్రెడిట్‌ కార్డు కంపెనీలు ట్రావెల్‌ కంపెనీలతోను, రెస్టారెంట్లతోనూ, వస్త్ర దుకాణాలతో కలిపి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటిస్తాయి

2. కొన్ని కంపెనీలు గిఫ్ట్‌వోచర్లను ప్రకటిస్తాయి. వాటితో ట్రావెల్‌ కంపెనీల టికెట్లను, రెస్టారెంట్లలో డిస్కౌంట్లకు వాడుకోవచ్చు.

3. కొన్ని కార్డులు చమురు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, పెట్రోలు, డీజిల్‌ కొన్న ప్రతిసారీ కొంత శాతం ధర తగ్గించి ఇస్తున్నాయి.

4. తరుచూ విమాన ప్రయాణాలు చేసేవారికి, విమాన ప్రయాణ టికెట్లలో రాయితీలను పొందేందుకు కొన్ని కార్డులు అవకాశం కల్పిస్తున్నాయి.

5. గోల్డ్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారికి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో పాటు రివార్డు పాయింట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

6.కొన్ని కంపెనీలు రివార్డు పాయింట్లను నగదుగా మార్చుకునేందుకు సైతం వీలు కల్పిస్తున్నాయి.

4. పాయింట్ల ద్వారా ప్ర‌యోజ‌నం

4. పాయింట్ల ద్వారా ప్ర‌యోజ‌నం

పాయింట్లను ఎలా రిడీమ్‌ చేసుకోవాలో బ్యాంక్‌ వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు. రిడీమ్‌ చేసుకున్న పాయింట్లతో వచ్చే సదుపాయాలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.

వివిధ పద్ధతులు:

1. రివార్డు పాయింట్లతో ఎంపిక చేసిన వస్త్రదుకాణాలు, గోల్డ్‌ షాప్‌లు, పాదరక్షల కంపెనీలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల కంపెనీలు వంటి వాటిలో ఏవైనా వస్తువులు కొనేందుకు ఉపయోగించవచ్చు.

2. ఫోన్‌చేసి: ఎక్కువ కంపెనీలు కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులకు ఫోన్‌చేసి మీకు వర్తించే ఆఫర్లను తెలుసుకుని వెంటనే ఆర్డర్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

తర్వాత మీరు సూచించిన చిరునామాలో ఆ వస్తువులను పొందవచ్చు.

3. పోస్ట్‌ ద్వారా: కంపెనీ వెబ్‌సైట్లలో రిడెంప్షన్‌ ఫామ్‌ లభిస్తుంది. దాన్ని పూర్తిచేసి అక్కడ తెలియపరిచిన చిరునామాకు దాన్నిపోస్ట్‌చేయాలి.

4. ఆన్‌లైన్‌ రిడెంప్షన్‌: కంపెనీ వెబ్‌సైట్లలో నెట్‌బ్యాంకింగ్‌లో లాగిన్‌ అవ్వాలి. క్రెడిట్‌ కార్డు నెంబరును పొందుపరచాలి. పాయింట్స్‌ రిడీమ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. రిడెంప్షన్‌ను ఎంచుకున్న తర్వాత సబ్‌మిట్‌ నొక్కాలి.

రిడీమ్‌ చేసిన తర్వాత రిడెంప్షన్‌ ఆర్డర్‌ నంబరు వస్తుంది. ఏదైనా సమస్య వస్తే తరచి చూసేందుకు వీలుగా దాన్ని రాసి ఉంచుకోవాలి.

5. కొంత శాతం నగదు చెల్లించడం, మిగిలిన ధరకు రిడీమ్‌ చేసిన పాయింట్లను వాడుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ కొన్ని కంపెనీలు వస్తుసేవలను అందిస్తున్నాయి.

6. సాధారణంగా కంపెనీ వెబ్‌సైట్లో లాగిన్‌ అవ్వగానే రిడీమ్‌ చేసే వస్తువులు, సేవలకు సంబంధించిన కేటలాగ్‌ ఉంటుంది. దాని ఆధారంగా మనకు ఉత్తమమైన దానిని ఎంచుకోవచ్చు. కొన్ని వెబ్‌సైట్లలో రివార్డు పాయింట్ల సంఖ్య, వస్తువుల కేటగిరీలను బట్టి ఆ పరిధిలోకి వచ్చే వస్తువులను అందుబాటులో ఉంచుతాయి. మనకు నచ్చిన దానిని ఎంపిక చేసుకుని ఆర్డర్‌ చేయవచ్చు.

క్రెడిట్ కార్డును జాగ్ర‌త్త‌గా వాడుతూ రివార్డు పాయింట్ల‌ను స‌కాలంలో వినియోగించుకుంటే కార్డు వ‌ల్ల మేలు క‌లుగుతుంది.

Read more about: credit cards shopping
English summary

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లతో ఎలా ప్ర‌యోజ‌నం పొందాలి? | How one can benefit from credit card reward points

It is very important to choose the right credit card or else you might end up losing on a lot of benefits. You must opt for a card after comparing it with the different cards offered in the market. There are many banks in India that offer various types of credit
Story first published: Saturday, January 6, 2018, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X