For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద‌న‌పు సంపాద‌న‌కు 10 ఉత్త‌మ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు

ఎక్కువ రిస్క్ అవ‌స‌రం లేదు మ‌న పెట్టుబ‌డి భ‌ద్రంగా ఉంటే చాలు, ఒక ర‌క‌మైన రాబ‌డితో స‌రిపెట్టుకుందాం అనే మ‌రో వ‌ర్గం అనుకుంటారు. దీర్ఘ‌కాల ల‌క్ష్యాలు క‌లిగి ఉన్నావారికి దేశంలో ఎన్నో సుర‌క్షిత‌మైన పెట్ట

|

డ‌బ్బే ప్ర‌ధాన ధ్యేయంగా ఉద్యోగాలు చేస్తున్న వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందుకే సంపాద‌న మొద‌లుపెట్టిన స‌మ‌యం నుంచి చాలా మంది పెట్టుబ‌డుల వెంట ప‌డ‌తారు. పెట్టుబ‌డి పెట్టేవారిలో రెండు ర‌కాలు ఉంటారు. ఎక్కువ రిస్క్ తీసుకుని బాగా డ‌బ్బు సంపాదించాల‌ని ఒక వ‌ర్గం అనుకుంటే, ఎక్కువ రిస్క్ అవ‌స‌రం లేదు మ‌న పెట్టుబ‌డి భ‌ద్రంగా ఉంటే చాలు, ఒక ర‌క‌మైన రాబ‌డితో స‌రిపెట్టుకుందాం అనే మ‌రో వ‌ర్గం అనుకుంటారు. దీర్ఘ‌కాల ల‌క్ష్యాలు క‌లిగి ఉన్నావారికి దేశంలో ఎన్నో సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డులు ఉంటాయి. అలాంటి వాటిలో 2018లో ఉత్త‌మ ర‌క్ష‌ణ క‌లిగిన 10 పెట్టుబ‌డి మార్గాల‌ను చూద్దాం.

 1. పీపీఎఫ్‌

1. పీపీఎఫ్‌

వేత‌న జీవులు చాలా మంది ఇష్ట‌ప‌డే పెట్టుబ‌డి సాధ‌నం పీపీఎఫ్‌. పీపీఎఫ్‌ని ఎంచుకోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఒక‌టి వ‌డ్డీ ఆదాయానికి పన్ను ఉండ‌దు. రెండోది 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఇంకో విధంగా ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. పీపీఎఫ్ మార్గంలో పెట్టుబ‌డి పెడితే ప‌దిహేనేళ్ల వ‌ర‌కూ వెన‌క్కు తీసుకోవ‌డానికి ఉండదు. అయితే కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు ఉంటే 7వ ఏట నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తిస్తారు.

 2. రిక‌రింగ్ డిపాజిట్‌(ఆర్‌డీ

2. రిక‌రింగ్ డిపాజిట్‌(ఆర్‌డీ

రిక‌రింగ్ డిపాజిట్ చేయ‌డం మూలంగా నెల‌వారీ క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. రిక‌రింగ్ డిపాజిట్ వ‌డ్డీపై సైతం టీడీఎస్ క‌ట్ చేస్తారు. ఆర్‌డీ సైతం దాదాపు బ్యాంకు డిపాజిట్ లాగే ఉంటుంది. 10 వేల మొత్తాల్లో టీడీఎస్‌ను లెక్కిస్తారు.

పోస్టాఫీసు ఆర్‌డీ ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు 7.1%గా ఉన్న‌ది.

3. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

3. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు మీకు 6.6 నుంచి 7.5 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. సంవ‌త్స‌రం కాలం కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డి పెట్టేట్ల‌యితేనే ఎఫ్‌డీల వైపు చూస్తే మంచి రాబ‌డి వ‌స్తుంది. ప‌న్ను శ్లాబును బ‌ట్టి రూ. 10 వేల కంటే ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చిన‌ప్పుడు ప‌న్ను క‌ట్టాల్సి వ‌స్తుంది. ప‌న్ను ప‌రిధిలోకి రాని వారు ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను స‌మ‌ర్పించాలి.అలా చేస్తే మూలం వ‌ద్ద ప‌న్ను మిన‌హాయించ‌రు.

 4. డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు

4. డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు బ్యాంకు డిపాజిట్ల కంటే మంచి రాబ‌డుల‌నే అందిస్తున్నాయి. ఈక్విటీల్లో సైతం కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెడుతున్నందువ‌ల్ల డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు బాగానే రాణిస్తున్న‌ట్లుగా చెప్పొచ్చు.

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటంటే మామూలు బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబ‌డి పొందుతూ కావాల్సిన స‌మ‌యంలో కొంత డ‌బ్బు వెన‌క్కు తీసుకోవ‌చ్చు.

 5. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్స్‌

5. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్స్‌

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు వివిధ రంగాల్లో ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వ చాలా చ‌ర్య‌లు తీసుకుంటూ ఉంటుంది. అలాంటి వాటిలో ఈ స్కీమ్స్ ఒక‌టి. ప్ర‌తి త్రైమాసికానికి వీటి వ‌డ్డీ రేట్ల‌ను భార‌త ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యిస్తుంది.

ప్ర‌స్తుతం వీటి వ‌డ్డీ రేట్లు 8.4 శాతంగా ఉన్నాయి

 6. సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం

6. సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం

అమ్మాయిల వివాహం, ఉన్న‌త విద్య కోసం డ‌బ్బు కూడ‌బెట్టాలనుకునే వారికి సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం బాగా ఉంటుంది. బేటీ బ‌చావో-బేటీ ప‌డావో అనే నినాదంతో ప్ర‌భుత్వం ప్రారంభించిన ప‌లు చ‌ర్య‌ల్లో ఇది ఒక‌టి. సుక‌న్య స‌మృద్ది ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసు కార్యాల‌యాల్లో తెర‌వొచ్చు. 80 సీ మిన‌హాయింపులు ఉన్నాయి.

7. నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు

7. నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు

పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ప్ర‌తి నెలా ఒక నిర్ణీత మొత్తం కావాల‌నుకునే వారికి బాగా ఉంటుంది. ఈ ప‌థ‌కం పేరిట గ‌రిష్టంగా ఒక ఖాతాలో ఒకేసారి రూ.4.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఉమ్మ‌డి ఖాతాలో అయితే రూ.9 ల‌క్ష‌లు.

ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌క మెచ్యూరిటీ పీరియ‌డ్ 5 ఏళ్లు

గ‌తేడాది జులై 1 నుంచి ఈ ప‌థ‌కం సంబంధించిన వ‌డ్డీ రేటు 7.5%గా ఉంది.

8. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

8. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మూలంగా 80సీ కింద మంచి పన్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు. ఇవి త‌క్కువ లాక్ ఇన్ పీరియ‌డ్‌ను క‌లిగి ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉండే స‌హ‌జ‌సిద్ద‌మైన రిస్క్‌కు సిద్ద‌ప‌డి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబ‌డి కావాల‌నుకునే వారు వీటివైపు చూడొచ్చు.

9. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు

9. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు

ఈ ఫండ్లు మూడేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్‌ను క‌లిగి ఉంటాయి. ఇవి దాదాపు డెట్ ఫండ్ల‌లానే ఉంటాయి కాబ‌ట్టి మీకు స‌రైన పెట్టుబ‌డి ల‌క్ష్యం ఉన్న‌ప్పుడే వీటివైపు మొగ్గుచూప‌డం మంచిది. దాదాపు బ్యాంకు ఎఫ్‌డీల్లానే ప‌నితీరు ఉన్న‌ప్ప‌టికీ, ప‌న్ను ఆదా కోణంలో చూస్తే ఎఫ్‌డీల కంటే ఎక్కువ రాబ‌డుల‌నే ఆశించ‌వ‌చ్చు.

10. జాతీయ పొదుపు ప‌త్రాలు

10. జాతీయ పొదుపు ప‌త్రాలు

చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ పెట్టుబ‌డిని వృద్ది చెందించాల‌నుకునేవారికి పోస్టాఫీసు ప‌థ‌కాలు బాగా ఉంటాయి. అలాంటి వాటిలో చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో భాగంగా కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం జాతీయ పొదుపు ప‌త్రం(నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికెట్స్). ప్ర‌భుత్వ ఉద్యోగులు, వ్యాపార వ‌ర్గాలు, నెల‌వారీ వేత‌నం పొందే ఉద్యోగులు ఆదాయ‌పు ప‌న్ను నుంచి మిన‌హాయింపు పొందేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటికి గ‌రిష్ట పెట్టుబ‌డి ప‌రిమితి ఉండ‌క‌పోగా, మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) కోత ఉండ‌దు. వీటిని హామీగా ఉంచుతూ బ్యాంకుల్లో రుణం సైతం పొంద‌వ‌చ్చు. ఆదాయపు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద మిన‌హాయింపుల‌కు ఇవి అవ‌కాశం క‌ల్పిస్తాయి.

Read more about: investment ppf nsc tax
English summary

అద‌న‌పు సంపాద‌న‌కు 10 ఉత్త‌మ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు | 10 best safe investments for long term in 2018

We have given a list of safe investments in India here below. We wish to state some of these have a higher lock-in periods for example the PPF, while others are taxable. So, you have to take a call on which type of safe investments that you would like to invest. Go for the ones with the highest interest and a more long term perspective.
Story first published: Monday, January 1, 2018, 11:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X