For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెక్కులు జారీ చేసేట‌ప్పుడు క‌చ్చితంగా చూసుకోవాల్సిన అంశాలేమిటి?

వివరాలు సమగ్రంగా ఉంటేనే చెక్కుకు సక్రమంగా చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. ఒక్కోసారి మ‌న‌కు తెలిసో తెలియ‌కో చెక్కు బౌన్స్ అవుతుంటుంది. అలా కాకుండా చెక్కు జాగ్ర‌త్త‌గా జారీ చేసేందుకు తెలుసుకోవాల్సిన అ

|

డిజిట‌ల్ చెల్లింపు మార్గాలు నెఫ్ట్‌(ఎన్ఈఎఫ్‌టీ), ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ లాంటివి ఎన్ని వ‌చ్చినా చెక్కు, డీడీ ప్రాముఖ్య‌త త‌గ్గ‌డం లేదు. ముద్రిత పత్రం ద్వారా చెల్లింపులు జరపాల్సిందిగా ఇచ్చే ఆదేశాలనే చెక్కు అంటారు. చెక్కుపై సొమ్మును వ్యక్తి అభ్యర్థన మేరకు చెల్లిస్తారు. వివరంగా చెప్పాలంటే ఒక ఖాతాలోని సొమ్ముపై డబ్బు చెల్లింపుకు మరో మార్గమే చెక్కు. చెక్కు రాసే వ్యక్తులు ఎంత మొత్తం(నగదు) చెల్లించాలి,తేదీ,ఎవరికి చెల్లించాలి అనే వివరాలు రాస్తూ తమ సంతకం చేస్తారు. చెక్కుపై పేరు కలిగి ఉన్న వ్యక్తికి బ్యాంకులో దానిపై ఎంత సొమ్ము రాసి ఉందో అంత చెల్లిస్తారు. వివరాలు సమగ్రంగా ఉంటేనే చెక్కుకు సక్రమంగా చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. ఒక్కోసారి మ‌న‌కు తెలిసో తెలియ‌కో చెక్కు బౌన్స్ అవుతుంటుంది. అలా కాకుండా చెక్కు జాగ్ర‌త్త‌గా జారీ చేసేందుకు తెలుసుకోవాల్సిన అంశాలేమిటో చూద్దాం..

చెక్కులో ఉండాల్సిన అంశాలు:

చెక్కులో ఉండాల్సిన అంశాలు:

1. చెక్కు ఫారం : బ్యాంకులు సాధారణంగా ప్రతి ఖాతాదారుడికీ చెక్కు పుస్తకాన్ని అందిస్తాయి. వీటి ద్వారా చెక్కులు జారీచేయవచ్చు.

2. చెక్కు తేదీ: పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులకయితే చెక్కు తేదీని కచ్చితంగా వేయాలి.

3. చెక్కు గ్రహీత(స్వీకర్త): చెక్కు ఎవరిని ఉద్దేశించి ఇస్తున్నారో వారి పేరు రాయాలి

4. నగదు(అక్షరాల్లో; అంకెల్లో): నగదు అక్షరాల్లోనూ, అంకెల్లోనూ వివరంగా రాయాలి. ఎలాంటి కొట్టివేతలకూ అవకాశమివ్వకూడదు.

5. చెక్కు ఇచ్చే వ్యక్తి సంతకం: బ్యాంకు రికార్డుల్లో ఉన్నట్లే చెక్కుపై చేసే సంతకం ఉండాలి. సంతకం సరిపోలకపోతే చెక్కు చెల్లకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు అధికారి విచక్షణను బట్టి చెల్లింపులు చేస్తూంటారు.

చెక్కుల్లో రకాలు:

చెక్కుల్లో రకాలు:

ఓపెన్‌ చెక్‌: బ్యాంకు ఖాతాలో సొమ్ము చెల్లింపు జరిపేందుకు ఒక వ్యక్తి ఇచ్చే చెక్‌నే ఓపెన్‌ చెక్‌ అంటారు. చెక్‌ వెనుక వైపు మరో వ్యక్తికి ఆపాదిస్తూ ఎండోర్స్‌ చేయొచ్చు.

క్రాస్‌డ్‌ చెక్‌: చెక్‌లో ఎడమ వైపు పైన 2 అడ్డ గీతలు గీస్తూ ఇచ్చిన చెక్‌ను క్రాస్‌డ్‌ చెక్‌ అంటారు. దీనిలో నగదు చెల్లింపు నేరుగా వ్యక్తికి చేయరు. ఖాతాలో మాత్రమే సొమ్ము జమ చేస్తారు.

బేరర్‌ చెక్‌: ఒక వ్యక్తి పేరు మీద అందించే చెక్కును బేరర్‌ చెక్‌ అంటారు. అది ఆ వ్యక్తి మాత్రమే డ్రా చేసుకోగలడు.

పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌: భవిష్యత్తులో తేదీ వేస్తూ ఇచ్చే చెక్కును పోస్ట్‌ డేటెడ్‌ చెక్కు అంటారు. ఇది 3 నెలల వరకూ మాత్రమే చెల్లుబాటవుతుంది.

చెక్కు తిరస్కరణకు కారణాలు:

చెక్కు తిరస్కరణకు కారణాలు:

1. ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడం

2. సంతకం సరిపోలకపోవడం

3. చెల్లించాల్సిన సొమ్ము అంకెల్లోనూ, అక్షరాల్లోనూ వేర్వేరుగా ఉండటం

4. చెక్కుపై కొట్టివేతలు ఉండటం

ఎలక్ట్రానిక్‌ చెక్‌(సీటీఎస్‌-2010):

ఎలక్ట్రానిక్‌ చెక్‌(సీటీఎస్‌-2010):

ఎలక్ట్రానిక్‌ చెక్‌ అంటే పేపర్‌ చెక్‌ యొక్క ఛాయాచిత్రం. పాత రోజుల్లో చెక్కు డ్రా చేసుకునేందుకు రెండు రోజుల కంటే ఎక్కువ పట్టేది. దీన్ని సులభతరం చేసేందుకు 2013 జనవరి 1 నుంచి ఆర్‌బీఐ, సీటీఎస్‌-2010ను ప్రవేశపెట్టింది. దీనిలో చెక్కుల ప్రాసెసింగ్‌ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మనం ఏ బ్యాంకు బ్రాంచి పేరు మీద చెక్కు రాసి ఇస్తామో వారు దానిని ఆన్‌లైన్‌లోనే ఆర్‌బీఐకి పంపుతారు. ఆర్‌బీఐ సంబంధిత బ్యాంకుకు చెక్కు చెల్లింపుల వ్యవహారాన్ని పూర్తిచేస్తుంది. తదుపరి బ్యాంకు చెక్కుదారుడికి నగదును చెల్లిస్తుంది.

కింది వివరాలు ఉన్నప్పుడే చెక్‌ చెల్లింపు జరుగుతుంది:

కింది వివరాలు ఉన్నప్పుడే చెక్‌ చెల్లింపు జరుగుతుంది:

1. చెక్కును ఇస్తున్న బ్యాంకు శాఖ

2. ఎవరైతే ఇస్తున్నారో వారి సంతకం

3. అకౌంట్‌లో తగినంత సొమ్ము

4. బ్యాంకింగ్‌ పని సమయాల్లోనే ఇస్తారు

5. పోస్ట్‌ డేటెడ్‌/స్టేల్‌ చెక్‌ కానప్పుడు

6. నగదు(అక్షరాల్లోనూ, అంకెల్లోనూ) సరిగా ఉండాలి

7. చెక్కులో సంతకం, ఖాతాలో సంతకంతో సరిపోలితేనే చెక్కును చెల్లిస్తారు.

Read more about: cheque చెక్కు
English summary

చెక్కులు జారీ చేసేట‌ప్పుడు క‌చ్చితంగా చూసుకోవాల్సిన అంశాలేమిటి? | What are the important things you have to observe in cheques

Using technology to access banking services, is an easy task and less time consuming unlike earlier where standing in que for most of the transactions was mandatory.An increase in NEFT, RTGS, and other online transactions have reduced the old methods of banking.But, even now some of the financial transactions demand issue of cheque, such as where individuals need to submit post-dated cheque.
Story first published: Tuesday, December 5, 2017, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X