For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబ‌డుల కోసం అందుబాటులో ఉండే వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ల ర‌కాలు

అయితే మ్యూచువ‌ల్ ఫండ్లు అంటే ఎక్కువ రిస్క్‌తో ఉండి, అస‌లు అర్థం కావ‌నే భావ‌న చాలా మందిలో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉండే వివిధ రకాల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

|

ఇటీవ‌ల ఉద్యోగులు పొదుపు, మ‌దుపు చేసేందుకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను సైతం ఆశ్ర‌యించ‌డం ఎక్కువైపోయింది. సాధార‌ణంగా తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా డిపాజిట్ల‌పైనే ఎక్కువ ఆధార‌ప‌డ‌తారు. కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టాలంటే చాలా సార్లు ఆలోచిస్తారు. అయితే మ్యూచువ‌ల్ ఫండ్లు అంటే ఎక్కువ రిస్క్‌తో ఉండి, అస‌లు అర్థం కావ‌నే భావ‌న చాలా మందిలో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉండే వివిధ రకాల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

 ఈక్విటీ ఫండ్స్‌

ఈక్విటీ ఫండ్స్‌

ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకుగాను పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌ అంటారు. ఇవి రిస్కుతో కూడికున్నవనే చెప్పాలి. ఈ ఫండ్స్‌వల్ల పెట్టుబడిదారుడికీ ఎక్కువ నష్టాలు రావొచ్చు. రిస్క్‌తీసుకునేవాళ్లకు ఇవి సూటబుల్‌ ఫండ్స్‌ అనుకోవచ్చు. మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ ర‌కాల్లో అధిక‌మైన రిస్క్ ఉండే ఫండ్స్ ఇవేన‌ని గుర్తుంచుకోవాలి.

 డెట్‌ ఫండ్స్‌

డెట్‌ ఫండ్స్‌

డెట్‌ ఫండ్స్‌ ఓపెన్‌ ఎండెడ్‌ కేటగిరీ ఫండ్స్‌. అంటే ఈ ఫండ్స్‌ ఎప్పుడైనా ఎంతైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అలాగే ఎప్పుడైనా ఈ ఫండ్స్‌ నుంచి పెట్టుబ‌డుల‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్‌ ఫండ్స్‌లో నష్టాలే రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్‌, కార్పోరేట్‌, బ్యాంకులు విడుదల చేసే డెట్‌ స్కీములలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి డెట్‌ ఫండ్స్‌ అంటారు. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటివారికి డెట్‌ ఫండ్స్‌ అనుకూలం.

బ్యాలెన్సెడ్‌ ఫండ్స్‌

బ్యాలెన్సెడ్‌ ఫండ్స్‌

రిస్కు, సామర్థ్యం ఆధారంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరు నెలలు, సంవత్సరం పాటు చిన్నమొత్తంతో బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. ఐదేళ్ల కాలానికైతే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ కంటే 'లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌' అనువైనవి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే. ఇంట్లో ఏదైనా వ‌స్తువుల‌కు కావాల్సిన డ‌బ్బును కూడ‌బెట్టుకుంటూ ఒక్క‌సారిగా ఏదైనా వ‌స్తువులు కొనాల‌నుకుంటే ఈ ఫండ్‌ను ఆశ్ర‌యించ‌వచ్చు.

మనీమార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

మనీమార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మరోపేరు లిక్విడ్‌ ఫండ్స్‌. డిపాజిట్లు ట్రెజరీ పేపర్లద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టే మనీమార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటారు. ఈ మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ తక్కువకాల వ్యవధికి పెట్టుబడి పెడతారు.

 గిల్ట్ ఫండ్స్‌

గిల్ట్ ఫండ్స్‌

గిల్ట్ ఫండ్స్‌ అంటే సెక్యూరిటీ ఎక్కువుగా ఉండే ఫండ్స్‌. గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌లో పెద్దమొత్తంలో డబ్బును మదుపు చేస్తారు. ఈ డబ్బును బ్యాంకింగ్‌ రంగంలో మదుపు చేయడంవల్ల పెట్టుబడిపెట్టిన డబ్బులకు ఎలాంటి ఢోకా ఉండదు

Read more about: mutual funds investments
English summary

పెట్టుబ‌డుల కోసం అందుబాటులో ఉండే వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ల ర‌కాలు | Types of Mutual funds available in India

Types of Mutual funds available based on their risk taking ability in India
Story first published: Saturday, December 2, 2017, 15:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X