For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే రుణం వ‌స్తుంది?

క్రెడిట్ కార్డు మొద‌లుకొని గృహ రుణం వ‌ర‌కూ సిబిల్ క్రెడిట్‌స్కోర్‌కు ముడిపెట్టిన క్ర‌మంలో దీని గురించి తెలుసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం. క్రెడిట్ స్కోర్‌ను ఎవ‌రు జారీ చేస్తారు? క‌్రెడిట్‌స్కోర్ ఎంత ఉండాలి?

|

ప్రస్తుతం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల‌ని అనుకుంటే త‌క్ష‌ణమే గుర్తుకు వ‌చ్చేది సిబిల్ క్రెడిట్‌స్కోర్‌. రుణం పొందాల‌నుకునేవారు తమ క్రెడిట్‌ స్కోర్‌ ఏవిధంగా ఉందో ఒకసారి చూసుకోవడం మంచిది. దీన్ని పట్టించుకోకుండా బ్యాంకుకు వెళితే మ‌న ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గురికావ‌చ్చు. ఇల్లు, కారు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో బ్యాంకు నుంచి ఆశించిన స్థాయిలో రుణం పొందడం అంత సులభమైన వ్యవహారమేమీకాదు. ఇందుకోసం ద‌ర‌ఖాస్తుకు ముందు అన్ని స‌క్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఈ సంద‌ర్బంలో రుణ గ్ర‌హీత‌లంద‌రికీ క్రెడిట్ స్కోర్ ఎంతగానో స‌హ‌క‌రిస్తుంది. దేశంలో ఎక్కువ శాతం రుణ సంస్థ‌లు సిబిల్ క్రెడిట్‌స్కోర్‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నాయి.

క్రెడిట్ కార్డు మొద‌లుకొని గృహ రుణం వ‌ర‌కూ సిబిల్ క్రెడిట్‌స్కోర్‌కు ముడిపెట్టిన క్ర‌మంలో దీని గురించి తెలుసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం. క్రెడిట్ స్కోర్‌ను ఎవ‌రు జారీ చేస్తారు? క‌్రెడిట్‌స్కోర్ ఎంత ఉండాలి? అనే విష‌యాల్లో చాలా మంది తిక‌మ‌కప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలో దాని గురించి ఐదు విష‌యాలు తెలుసుకుందాం.

క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ స్కోర్‌(సీఐఆర్):

క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ స్కోర్‌(సీఐఆర్):

సీఐఆర్ అంటే క్రెడిట్ బ్యూరో జారీ చేసే మూడంకెల సంఖ్య‌. ఇది 300 నుంచి మొద‌లుకొని 700 వర‌కూ ఉంటుంది. ఇది వ్య‌క్తుల రుణ చ‌రిత్ర ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇందులో మీ పొదుపు, పెట్టుబ‌డులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు ఉండ‌వు. ఒక నిర్ణీత కాలానికి సంబంధించి రుణ గ్ర‌హీత చేసిన చెల్లింపుల వివ‌రాలు ఇందులో ఉంటాయి.

2. సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆన్‌లైన్ న‌మోదు

2. సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆన్‌లైన్ న‌మోదు

సిబిల్ వ‌ద్ద వినియోగ‌దారుగా చేరేందుకు ఆన్‌లైన్ మార్గం సులువుగా ఉంటుంది. ఇందుకోసం సిబిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఒక ఆన్‌లైన్ న‌మోదు ప‌త్రాన్ని పూర్తి చేయాలి. ఇందుకోసం ఒక‌సారి స్కోర్ నివేదిక తెచ్చుకునేందుకు రూ. 550 చెల్లించాలి. మీ వివ‌రాల‌ను ఆన్‌లైన్ న‌మోదు ద్వారా ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది. ధ్రువీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత మీ రుణ చ‌రిత్ర‌, క్రెడిట్‌స్కోర్‌లు మెయిల్ ఐడీకి వ‌స్తాయి.

3. సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆఫ్‌లైన్ న‌మోదు

3. సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆఫ్‌లైన్ న‌మోదు

ఆన్‌లైన్ స‌దుపాయం అంత‌గా అందుబాటులో ఉండ‌నివారు, అది ఇష్టం లేనివారు ఆఫ్‌లైన్‌లో న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. మొద‌ట వెబ్‌సైట్ నుంచి న‌మోదు ప‌త్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీఐఆర్ కోసం అభ్య‌ర్థిస్తూ ఒక మెయిల్‌ను పంపాలి. న‌మోదు ప‌త్రంలో వివ‌రాల‌ను నింపాలి. న‌మోదు ప‌త్రానికి, కేవైసీ ప‌త్రాలు, రూ. 550 డీడీ జ‌త‌ప‌రుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్ చేయాలి.

4. వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం స‌మ‌ర్పించాల్సిన డాక్యుమెంట్లు

4. వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం స‌మ‌ర్పించాల్సిన డాక్యుమెంట్లు

(సిబిల్ అంగీకరించే డాక్యుమెంట్ల జాబితా)

1. పాన్‌కార్డు

2. ఓట‌రు గుర్తింపు ప‌త్రం

3. పాస్‌పోర్టు

4. డ్రైవింగ్ లైసెన్సు

పైన తెలిపిన వాటిలో ఏదైనా ఒక దాన్ని ఇస్తే స‌రిపోతుంది.

 5. చిరునామా గుర్తింపు కోసం అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు

5. చిరునామా గుర్తింపు కోసం అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు

(సిబిల్ అంగీకరించే డాక్యుమెంట్ల జాబితా)

1. బ్యాంక్ స్టేట్‌మెంట్

2. విద్యుత్ బిల్లు

3. టెలిఫోన్ లేదా మొబైల్ బిల్లు

4. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్

5. పాస్‌పోర్ట్‌

6. ఓట‌రు గుర్తింపు ప‌త్రం

Read more about: cibil credit score
English summary

మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే రుణం వ‌స్తుంది? | 5 important points to know about cibil credit score

When you approach a bank for a loan, bank or any financial institution ask for your CIBIL score or credit score which is very essential for disbursement of the loan. Loan eligibility also vastly depends on your credit score or your credit history
Story first published: Saturday, December 23, 2017, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X