For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార‌త పౌరుల‌కు విశేష సేవ‌లందించ‌గ‌ల‌ 11 ప్ర‌భుత్వ యాప్‌లివే

ప్ర‌భుత్వ సంబంధిత లావాదేవీల‌ను సుల‌భంగా స్మార్ట్‌ఫోన్ల‌లో జ‌రుపుకునేందుకు వీలుగా 11 అత్యుత్త‌మ ప్ర‌భుత్వ యాప్‌ల‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. మ‌రి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి.

|

నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో నిదానంగా ఉంటాయ‌ని, ప‌నుల్లో జాప్యం చేస్తాయ‌నే అప‌వాదు ప్ర‌భుత్వ సంస్థ‌లకుంది. ప్ర‌తి సేవ‌లోనూ పార‌ద‌ర్శ‌కత్వం కోసం పౌరుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో టెక్నాల‌జీని వాడ‌డం ప్ర‌భుత్వానికి త‌ప్ప‌లేదు.
పౌరుల నుంచి ఈ ల‌క్ష్యాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం త‌న సొంత మొబైల్ యాప్‌ల‌తో ముందుకు వ‌స్తోంది. ప్ర‌భుత్వం ద్వారా అయ్యే ప‌నుల‌ను యాప్‌ల స‌హాయంతో నెర‌వేర్చుకునేలా చేస్తోంది.
ప్ర‌భుత్వ సంబంధిత లావాదేవీల‌ను సుల‌భంగా స్మార్ట్‌ఫోన్ల‌లో జ‌రుపుకునేందుకు వీలుగా 11 అత్యుత్త‌మ ప్ర‌భుత్వ యాప్‌ల‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. మ‌రి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి.

1. మై గ‌వ్ యాప్‌

1. మై గ‌వ్ యాప్‌

భార‌త ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో పౌరులను స‌మాజంలో నేరుగా భాగ‌స్వామ్యం చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. సుపరిపాల‌న దిశ‌గా, పౌరుల నుంచి ఐడియాలు, వారి అభిప్రాయాలు, సూచ‌న‌ల‌ను నేరుగా కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల‌కు, వాటి సంబంధిత ఉప శాఖ‌ల‌కు పంపించ‌వ‌చ్చు. విధాన రూప‌క‌ల్ప‌న‌లోనూ, కార్య‌క్ర‌మాల నిర్మాణంలోనూ ప్ర‌జ‌లు నేరుగా పాల్గొనే అవ‌కాశాన్ని ఈ యాప్ క‌ల్పించ‌డం విశేషం.

2. న‌రేంద్ర మోడీ యాప్‌

2. న‌రేంద్ర మోడీ యాప్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధికారిక యాప్ ఇది. తాజా స‌మాచారం, త‌క్ష‌ణ అప్‌డేట్‌లను అందిస్తుంది. ప్ర‌ధాన మంత్రి నుంచి నేరుగా సందేశాలు, మెయిళ్ల‌ను అందుకునే సౌల‌భ్యం ఉంది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఎక్క‌డైనా, ఎప్పుడైనా తాజా స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు.

ఈ యాప్ హైలైట్స్ః వార్త‌లు, అప్‌డేట్‌లు అందుకోవ‌చ్చు. ప్ర‌ధాని నుంచి నేరుగా సందేశాలు, ఈ-మెయిల్స్ వ‌స్తాయి. ప్ర‌ధాని మ‌న్ కీ బాత్ ప్ర‌సంగాల‌ను వినొచ్చు, ఉప‌యోగ‌క‌ర‌మైన చిన్న ప‌నులు చేసి బ్యాడ్జీలు పొందొచ్చు, ప్ర‌ధాని మోదీ ఆలోచ‌న‌ల‌ను, ఆయ‌న బ్లాగుల‌ను చ‌ద‌వొచ్చు, ప్ర‌భుత్వ హ‌యంలో న‌డిచే సుప‌రిపాల‌న కార్య‌క్ర‌మాల గురించి తెలుసుకోవ‌చ్చు, భార‌త్‌ను ప్ర‌పంచ శిఖ‌రంపై ఉంచేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న కృషి గురించి చ‌దవొచ్చు.. ఇంకా మ‌రెన్నో విశేషాల క‌దంబం న‌రేంద్ర మోడీ యాప్

3. ఐఆర్‌సీటీసీ క‌నెక్ట్‌

3. ఐఆర్‌సీటీసీ క‌నెక్ట్‌

రైల్వే టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌డం చాలా సుల‌భ‌మైపోయింది. సీట్ల‌ను సెలెక్ట్ చేసి బుక్ చేసుకోవ‌డ‌మే త‌రువాయి. ఐఆర్‌సీటీసీ యాండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొని రైల్వేటికెట్ల‌ను సుల‌భంగా బుక్ చేసుకోవ‌చ్చు.

ఫీచ‌ర్లు

ఒక్క క్లిక్‌తో లాగిన్ అవ్వొచ్చు.

రైళ్ల స‌మాచారాన్ని వెతికి బుక్ చేసుకోవ‌చ్చు.

టికెట్ల‌ను ర‌ద్దు చేసుకునే వెసులుబాటు

ఇటీవ‌ల చేర్చుకున్న ప్ర‌యాణికుల వివ‌రాలు ఆటోమెటిక్‌గా వ‌చ్చేస్తాయి.

కొత్త యూజ‌ర్లు నేరుగా యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకునే సౌల‌భ్యం

ప్ర‌యాణ అల‌ర్డ్‌లు పెట్టుకునే సౌక‌ర్యం.

4. ఎంఈఏ ఇండియా

4. ఎంఈఏ ఇండియా

విదేశాంగ మంత్రిత్వ‌శాఖ అందించే ఈ యాప్‌లో ఈ శాఖ‌కు సంబంధించిన అన్ని వివ‌రాలు ఒకే చోట ల‌భ్య‌మ‌వుతాయి. పౌరుల సేవ‌లే కేంద్రీకృతంగా, వారికి ఉప‌యోగ‌ప‌డే విధంగా యాప్‌ను రూపుదిద్దారు. యూజ‌ర్ ఓరియెంటెడ్‌గా, చాలా స‌హ‌జంగా, గ్రాఫుల‌తో ఇంట‌రాక్టివ్‌గా ఉండ‌డం విశేషం.

5. ఎం పాస్ పోర్ట్ సేవా

5. ఎం పాస్ పోర్ట్ సేవా

విదేశాంగ మంత్రిత్వ శాఖ‌లోని కాన్సుల‌ర్‌, పాస్పోర్ట్ అండ్ వీసా(సీపీవీ) విభాగం వారు ఈ యాప్ కార్య‌క‌లాపాల‌ను చూస్తారు. భార‌త పౌరుల‌కు పాస్‌పోర్టుకు సంబంధించి అన్ని ర‌కాల సేవ‌ల‌ను వేగంగా, సుల‌భంగా, పార‌ద‌ర్శ‌కంగా అందించే ప్ర‌య‌త్నాలతో వ‌చ్చిందే ఈ యాప్‌. ఇ-గ‌వ‌ర్నెన్స్ లో భాగంగా అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇదీ ఒక‌టి.

ప్ర‌జల‌కు మొబైల్ ఫోన్ల ద్వారా సేవ‌ల‌ను అందించేందుకు విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ఎం పాస్‌పోర్ట్ సేవా యాప్‌ను ప్రారంభించింది. పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు స్టేట‌స్ ట్రాక్ చేయ‌డంతో పాటు స‌మీపంలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని తెలుసుకునే వెసులుబాటు దీంట్లో ఉంటుంది. దీంతో పాటు పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలాగో స‌వివ‌రంగా ఉంటుంది.

6. ఆర్టీఐ ఇండియా

6. ఆర్టీఐ ఇండియా

స‌మాచార హ‌క్కు చ‌ట్టంలో భాగంగా క్రియాశీల‌కంగా పాల్గొనాల‌ని ఉందా? ఐతే ఈ యాప్ మీ కోస‌మే. యాండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని నేరుగా ఆర్‌టీఐ ఇండియా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చు. సుమారు 4ల‌క్ష‌ల స‌.హ‌. కార్య‌క‌ర్త‌ల్లో మీరు ఒకర‌వ్వండి. దీంట్లో ఉన్న ఫీచ‌ర్లు...

* మొబైల్ నుంచే నేరుగా స‌మాచారాన్ని కోర‌వ‌చ్చు.

* మొబైల్ కెమెరా ద్వారా ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసి పంప‌వ‌చ్చు.

* ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల‌కు నేరుగా సందేశాల‌ను పంపించి, అందుకోవ‌చ్చు.

* తాజా చ‌ర్చ‌ల్లో పాల్గొన‌వ‌చ్చు

* స‌.హ‌.చ‌ట్టానికి సంబంధించి ఎలాంటి స‌హాయ‌మైనా పొందొచ్చు.

* బ్లాగులు, క‌థ‌నాలు చ‌ద‌వ‌చ్చు.

* ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల ప్రొఫైళ్ల‌ను తిర‌గేయొచ్చు.

7. ఇన్‌క్రెడిబుల్ ఇండియా(టూరిజం యాప్‌)

7. ఇన్‌క్రెడిబుల్ ఇండియా(టూరిజం యాప్‌)

అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అద‌ర‌గొట్టే ఈ యాప్ కేవ‌లం భార‌త పౌరుల‌కే కాదు విదేశీయుల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. యూజ‌ర్ ఉన్న ప్ర‌దేశాన్ని బ‌ట్టి అక్క‌డ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్ర‌భుత్వ టూర్ ఆప‌రేట‌ర్లు, స్థానిక టూరిస్ట్ గైడ్‌ల స‌మాచారాన్ని పొందొచ్చు. అంతే కాకుండా ద‌గ్గ‌ర‌లో ఉన్న క్లాస్ హోట‌ళ్ల స‌మాచారాన్ని పొందొచ్చు. ప్ర‌స్తుతమున్న ప్ర‌దేశంలో ప్ర‌ముఖ సంద‌ర్శ‌న ప్రాంతాల వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

8. ర‌క్ష‌క్ యాప్‌

8. ర‌క్ష‌క్ యాప్‌

ఈ యాప్‌ను ముఖ్యంగా మ‌హిళ‌లు, వ‌యోవృద్ధుల సంక్షేమార్థం రూపొందించ‌డ‌మైన‌ది. అత్య‌వ‌స‌ర సంద‌ర్భం ఏర్ప‌డిన‌ప్పుడు కేవ‌లం ఒక్క క్లిక్‌తో స‌మీపంలో ఉన్న న‌లుగురు స్నేహితుల‌కు లేదా కావాల్సిన‌వారికి క్ష‌ణాల్లో స‌మాచారాన్ని అందించొచ్చు. ఏదైనా ఎమ‌ర్జెన్సీ నెంబ‌రుకు వాయిస్ కాల్ కూడా వెళుతుంది. ఏయే స్నేహితుల‌కు కాల్ వెళ్లాల్లో ముందే నిర్దేశించుకోవ‌చ్చు.

9. ఓట‌రు స‌మాచారం

9. ఓట‌రు స‌మాచారం

ఓట‌ర్ల జాబితాలో త‌మ పేరు న‌మోదైందో లేదో తెలుసుకునేందుకు ఈ యాప్‌ను వినియోగించ‌వ‌చ్చు. స‌మీపంలోని పోలింగ్ కేంద్రాన్ని గుర్తించ‌వ‌చ్చు. సంక్షిప్త సందేశాల ద్వారా కావాల్సిన స‌మాచారం పొందొచ్చు. ఐతే ఎంఎస్ఎస్ కు చార్జీలు వ‌ర్తిస్తాయి.

10. ఇ-హాస్పిట‌ల్ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌

10. ఇ-హాస్పిట‌ల్ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌

ఆధార్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు, ఆసుప‌త్రిలో వైద్యుల అపాయింట్‌మెంట్ పొందేందుకు ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్‌(హెచ్ఎంఐఎస్‌) ద్వారా ఔట్ పేషెంట్ రిజిస్ట్రేష‌న్ మ‌రియు అపాయింట్‌మెంట్‌ను డిజిట‌లైజ్ చేసే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఈ పోర్ట‌ల్ ఆధార్‌లో ఉన్న ఇ-కేవైసీ వివ‌రాల‌తో మొబైల్ నెంబ‌రు తీసుకొని ఔట్ పేషెంట్ వివ‌రాల‌ను రిజిస్ట‌ర్ చేస్తుంది. ఒక వేళ మొబైల్ నెంబ‌రు లేక‌పోతే కేవ‌లం పేరుతో రిజిస్ట‌ర్ చేస్తుంది. ఇది వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ పూర్త‌యితే అపాయింట్‌మెంట్ నెంబ‌ర్ కేటాయిస్తుంది.

11. డీజీఎఫ్‌టీ యాప్‌

11. డీజీఎఫ్‌టీ యాప్‌

ఎగుమ‌తిదారులు, దిగుమ‌తిదారుల‌కు విదేశీ ట్రేడ్ పాల‌సీని నిర్వ‌హించుకునేలా, ఇత‌ర సంబంధిత డాక్యుమెంట్ల‌ను సుల‌భంగా శోధించే ఫార్మ‌ట్‌లో అందుబాటులో ఈ యాప్ ఉంచుతుంది. వ‌ర్త‌కులు త‌మ ద‌ర‌ఖాస్తు స్టేట‌స్‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఎగుమ‌తి, దిగుమ‌తి ధ‌ర‌ల‌ను, సుంకం ఛార్జీల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఎక్కువ స‌మాచారాన్ని ఎల‌క్ట్రానిక్ ఫార్మ‌ట్‌లో వ‌ర్త‌కుల‌కు అందుబాటులో ఉండే విధంగా డీజీఎఫ్‌టీ యాప్‌ను రూపొందించారు. దీన్ని ఇండియ‌న్ ట్రేడ్ స‌ర్వీస్ 2011 బ్యాచ్‌కు చెందిన అసిస్టెంట్ డీజీఎఫ్‌టీ అధికారి అయిన గ‌గ‌న్ దీప్ రూపొందించారు.

Read more about: government apps mobile
English summary

భార‌త పౌరుల‌కు విశేష సేవ‌లందించ‌గ‌ల‌ 11 ప్ర‌భుత్వ యాప్‌లివే | 11 major apps by Indian government that bring citizen services on your smartphone

telugu goodretturns chalks out 11 best Indian government apps that have now made it possible for citizens to deal with government-related transactions with just a click on their smartphones.
Story first published: Thursday, December 28, 2017, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X