For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? సురక్షిత కొనుగోలు కోసం 10 సూచ‌న‌లు

కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడానికి బదులుగా, చాలామంది అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తిచేయడంపై దృష్టి పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (RERA) వంటి సంస్ధలచే నియమించబడిన నియంత్రణ య

|

మీరు ఇల్లు కొనాలి అనుకుంటే, వడ్డీ రెట్లు తక్కువగా ఉన్నపుడు కొనడం మంచిది, డెవలపర్లతో సంప్ర‌దించిన వెంటనే అందించే జాబితా భారీగా ఉంటుంది, వారు డిస్కౌంట్ తో ఇల్లు విక్రయిస్తారు. దానితోపాటు, కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడానికి బదులుగా, చాలామంది అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తిచేయడంపై దృష్టి పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (RERA) వంటి సంస్ధలచే నియమించబడిన నియంత్రణ యంత్రగానికి ధన్యవాదాలు. కాబట్టి కొనుగోలుదారు తరువాతి మూడు నుండి ఆరు నెలలలోపు పూర్తయ్యే ప్రాజెక్ట్ లను చూడవచ్చు.
ఇవన్నీ కొనుగోలుదారుల మార్కెట్ కి చెందినవి. కాబట్టి ఒక ఆస్తి మీద పెట్టుబడి పెట్టె ముందు ఇంట్లో ఉంది కొనుగోలు చేసే వారు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి? ఇక్కడ పరిశీలనా అంశాల‌ను ఇక్క‌డ తెలుసుకోండి

 డెవ‌ల‌ప‌ర్ చ‌రిత్ర‌

డెవ‌ల‌ప‌ర్ చ‌రిత్ర‌

మొట్టమొదటగా మీరు చేయాల్సింది, మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో ఆ రాష్ట్రంలోని RERA వెబ్ సైట్ లో లాగ్ ఆన్ అవ్వడం. ఒకవేళ త్వరగా పూర్తయిన ప్రాజెక్ట్ విషయంలో, ఆ డెవలపర్ ఆ రాష్ట్రంలోని రెగ్యులేటరీ అధారిటీలో నమోదు చేసుకున్నాడో లేదో పరిశీలించండి. బిల్డర్ గురించి తెలుసుకోండి, ఆ డెవలపర్ ఎన్ని ప్రాజెక్ట్ లు పూర్తిచేసాడు, ఇప్పటి వరకు ఎన్ని డెలివర్ చేసాడు అనే వివరాలను పరిశీలించండి.

RERA సీల్ పరిశీలించండి:

RERA సీల్ పరిశీలించండి:

నిర్మాణంలో ఉన్న ;చాలా ప్రాజెక్ట్ లో RERA కింద నమోదు చేయబడ్డాయి. ఆ సీల్ ని పరిశీలించండి. డెవలపర్లు తప్పనిసరిగా నిబంధనలకు కట్టుబడి ఉండాలని దీనర్ధం. మీరు మంజూరు చేసిన భావనల ప్లాన్లు, ఫ్లోర్ల నంబర్ల వివరాలు, టవర్లు, RERA పోస్ట్ డెవలపర్స్ వెబ్సైట్ లో అంతస్దుల నిర్మాణ ప్రణాళిక లను కూడా కనుగొనవచ్చు. యూనిట్ల సంఖ్య, టవర్ల సంఖ్య, సంబంధిత అధికారులచే మ౦జూరుచేయబడిన అంతస్తుల సంఖ్యా వివరాలను కూడా చూడవచ్చు.

3.భూ వినియోగం/టైటిల్:

3.భూ వినియోగం/టైటిల్:

మీకు ఇంకా RERA భద్రత నెట్ తో లాండ్ టైటిల్ గురించి నమ్మకం లేకపోతే, సంబంధిత రెవెన్యూ డిపార్టమెంట్, డెవలప్మెంట్ అథారిటీ టైటిల్, ల్యాండ్ ఉపయోగాన్ని మీకు ప్రమాణీకరిస్తాయి. కొంతమంది డెవలపర్లు తమ స్వంతం కాని ప్రదేశంలో నివాస ప్రాజెక్ట్ లను నిర్మించి మోసంచేస్తారనే భయంలో తప్పు లేదు. కొన్ని సమయాల్లో, డెవలపర్లు తమ వ్యవసాయ భూములను నివాస భూములుగా మార్చకుండానే ప్రాజెక్ట్ లు ప్రారంభించారు.

4.స్థలం:

4.స్థలం:

సరైన స్ధలాన్ని ఎంచుకోవడం మంచిదని కొనుగోలుదారులకు సూచన. ప్రాజెక్ట్ కి దగ్గరగా రోడ్లు, దైనందిన అవసరాల కోసం తగినన్ని దుకాణాలు, పాఠశాలలు, ఆసుపత్రులు దగ్గరగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అత్యంత ముఖ్యంగా, మీరు పనిచేసే చోట నుండి ఎంత దూరమో, రవాణా సదుపాయం ఉందొ లేదో చూసుకోవాలి.

 5.FAR / కొనుగోలు చేయదగిన FAR:

5.FAR / కొనుగోలు చేయదగిన FAR:

కొన్ని సందర్భాలలో, డెవలపర్లు కట్టుబడి సమయంలో FAR (ఫ్లోర్ ఏరియా రేషియో) అదనంగా కొనుగోలు చేస్తారు, అంటే ఇంతకుముందు అమోదించబడిన స్థలం కంటే ఎక్కువ నిర్మిస్తున్నారని అర్ధం. అదనపు FAR స్ధలంలో, డెవలపర్లు హద్దులు లేని ప్రదేశంలో అదనపు అంతస్తులను నిర్మించవచ్చు, అసలు కొనుగోలు ప్రణాళికలో చేసిన మార్పుల గురించి గృహ కొనుగోలుదారుకు తెలియచేయకుండా ఉండకూడదు.

6. పూర్తిచేసిన సర్టిఫికేట్:

6. పూర్తిచేసిన సర్టిఫికేట్:

మీరు వెంటనే ఇంట్లోకి ప్రవేశించడానికి అనుకూలంగా ఉన్న ఇల్లుని కొనుగోలు చేయాలనుకుంటే లేదా సెకండరీ మార్కెట్ నుండి యూనిట్ కొనుగోలు చేయలన్నా, ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ గురించి సమాచారం సేకరించండి. ఈ స్ధలంపై డేవలపర్ల కి అన్ని అంగీకారాలు ఉన్నాయి అని రుజువు చేసేది కేవలం ఈ డాక్యుమెంట్ మాత్రమే.

 7. అమ్మేందుకు సిద్దంగా ఉన్న ఇంటిని కొనడం మంచిదా, నిర్మాణంలో ఉన్న దాన్ని కొనడం మంచిదా?

7. అమ్మేందుకు సిద్దంగా ఉన్న ఇంటిని కొనడం మంచిదా, నిర్మాణంలో ఉన్న దాన్ని కొనడం మంచిదా?

అయితే, మీరు అద్దె, EMI రెండూ ఒకసారి కట్టలేరు కాబట్టి, ఇంకా నిర్మాణంలో ఉన్న ఆస్తికి సంబంధించిన వాయిదా సమస్యలు తగ్గుతాయి. కానీ అది ఖర్చుతో కూడినది కదా? అక్కడ భారీ జాబితా అందుబాటులో ఉండడం వల్ల మార్కెట్ కంటే ఎక్కువ కాదు, మీరు ఇంటి గురించి మంచిగా విచార‌ణ బాగా చేస్తే స‌రైన ఒప్పందాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, ఎక్కువ డబ్బు మార్కెట్లో పెట్టుబడి పెడితే, ధరలపై పరిశీలనకు సహాయపడుతుంది.

8. రెరా చ‌ట్టం ప్రకారం స‌మ‌యానికి మ‌న‌కు అప్ప‌గించాలి

8. రెరా చ‌ట్టం ప్రకారం స‌మ‌యానికి మ‌న‌కు అప్ప‌గించాలి

నిర్మాణ పద్ధతులను అనుసరించి, RERA అందించే ఒక మంచి సంరక్షణ ఏమిటంటే బిల్డర్లు రేగ్యులారిటీ అధారిటీకి సమర్పించిన సమయపాలన ప్రకారం ప్రాజెక్ట్ లు పూర్తిచేయాలి లేకపోతే జరిమానా విధించబడుతుంది. కొన్ని ప్రాజెక్టుల్లో జాప్యం కార‌ణంగా చాలా మంది త‌మ పెట్టుబ‌డి సొమ్మును న‌ష్ట‌పోయారు. అందుకే రెరా చ‌ట్టంలో స‌మ‌యానికి కొనుగోలుదారుకు అప్ప‌గించ‌క‌పోతే ఎలా ఫైన్ వేయాలో సూచించారు.

9. పునః విక్రయం, ప్రత్యక్ష కొనుగోలు:

9. పునః విక్రయం, ప్రత్యక్ష కొనుగోలు:

పునః విక్రయ ఆస్ధుల విషయంలో తగినన్ని ఎంపికలు లేనపుడు, విక్రేత ఎంత ఒత్తిడిలో ఉన్నాడు అనేదానిపై ఆధారపడి మాటలు ఉంటాయి. కానీ మీరు సరైన ప్రదేశంలోనే చట్టపరమైన పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. విక్రేత సమయంలో EMI చెల్లించాడో లేదో అని, బ్యాంక్ కి ఎమన్నా అప్పులు ఉన్నాయా, బిల్డర్ లేదా నిర్వహణా కార్యాలయానికి ఏమన్నా చెల్లింపులు ఉన్నాయా అన్నవి కూడా నిర్ధారించుకోవాలి.

10.పెట్టుబడిలో వృద్ది:

10.పెట్టుబడిలో వృద్ది:

ఇప్పుడే మీరు కొనాలి అనుకుంటే, మీ వ్యక్తిగత వాడకానికి మాత్రమే కొనాలని గుర్తుంచుకోండి. ఇది ఇన్వెస్టర్ల మార్కెట్ కాదు, ఆస్ది ధరలో వృద్ది రావడానికి రాబోయే 2 సంవత్సరాలలో అవకాశం లేదు. ఇల్లు అనేది దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లో భాగం. చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఇది ఒక జీవిత క‌ల‌. కాబ‌ట్టి ఆచితూచి నిర్ణ‌యం తీసుకుని భ‌విష్య‌త్తులో ఆనందంగా మీ సొంత ఇంటిలో గ‌డ‌పండి.

Read more about: rera home buying house
English summary

ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? సురక్షిత కొనుగోలు కోసం 10 సూచ‌న‌లు | 10 things to know before buying a home for the first time

If you're planning to buy a house, now is perhaps a good time to buy as interest rates are down and there is a huge ready-to-move-in inventory with developers that they may want to offload at a discount
Story first published: Friday, December 15, 2017, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X