For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్ పెర‌గ‌క‌పోవడానికి 7 ముఖ్య కార‌ణాలు

చాలా చిన్న కార‌ణాల‌కు క్రెడిట్ స్కోర్ త‌గ్గ‌డం అంటూ ఏమీ ఉండ‌దు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం చూపే 7 ముఖ్య అంశాల‌ను తెలుసుకుందాం.

|

రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ కావాల‌నే విష‌యం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రుణం తీసుకునే వర‌కూ చాలా మంది ఈ క్రెడిట్ స్కోర్ విషయాన్ని అస‌లు ప‌ట్టించుకోరు. క్రెడిట్ కార్డు బిల్లుల‌ను స‌మ‌యానికి క‌ట్ట‌క‌పోయినా, క్రెడిట్ కార్డు ప‌రిమితిని ఎక్కువ‌సార్లు గ‌రిష్టంగా వాడుకున్నా మ‌న క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది. అయితే చాలా చిన్న కార‌ణాల‌కు క్రెడిట్ స్కోర్ త‌గ్గ‌డం అంటూ ఏమీ ఉండ‌దు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం చూపే 7 ముఖ్య అంశాల‌ను తెలుసుకుందాం.

 1. అకౌంట్ స్టేట‌స్ నెగ‌టివ్‌గా ఉండ‌టం

1. అకౌంట్ స్టేట‌స్ నెగ‌టివ్‌గా ఉండ‌టం

మీరు ఎప్పుడైనా రుణం తీసుకొని మొత్తం రుణం క‌ట్టేసి అయిన త‌ర్వాత రుణాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలి. అప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు ఆ రుణాన్ని సెటిల్‌డ్‌, అకౌంట్ సోల్డ్ అనే కేట‌గిరిలో ప‌రిగ‌ణిస్తాయి. ఒక వేళ రుణం కాస్త పెండింగ్ ఉన్నా ఆ ఖాతాకు సంబంధించి నెగ‌టివ్ ముద్ర వేస్తారు. ఇలా ఒక ఖాతా లేదా ఒక‌టి కంటే ఎక్కువ నెగ‌టివ్ ఖాతాలు ఉంటే క్రెడిట్ రిపోర్ట్ దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. అస‌లు నెగ‌టివ్ జాబితాలో ఏ బ్యాంకు ఖాతాలు లేకుండా చూసుకోవ‌డం మంచిది.

 2. రుణ విచార‌ణ‌లు

2. రుణ విచార‌ణ‌లు

బ్యాంకుల్లో రుణాల కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోర్ అందించే సంస్థ‌ల వ‌ద్ద విచారిస్తాయి. కొంత మంది అవ‌స‌రం లేక‌పోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు, వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్ర‌య‌త్నిస్తారు. ఎక్కువ అప్పులు తీసుకుని మంచి లైఫ్ స్టైల్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇలా ఎక్కువ రుణాలు తీసుకుంటే అది క్రెడిట్ స్కోర్‌పై రుణాత్మ‌క ప్ర‌భావం చూపుతుంది. ఎక్కువ రుణ విచారణ‌లు చేసిన వారి విష‌యంలో క్రెడిట్ స్కోర్ మీద ఈ ర‌క‌మైన వ్య‌వ‌హారం 10% ప్ర‌భావం చూపుతుంది.

3. రుణ ద‌ర‌ఖాస్తు తిరస్క‌ర‌ణ‌కు గురైతే :

3. రుణ ద‌ర‌ఖాస్తు తిరస్క‌ర‌ణ‌కు గురైతే :

మీకు అక్క‌ర్లేక‌పోయినా, ఆఫ‌ర్లు, త‌క్కువ వ‌డ్డీ రేట్లు చూసి రుణ ద‌రఖాస్తులు చేశారా? అయితే ఇది మీకు ప్ర‌మాద‌మే. ప్ర‌స్తుతం ఒక క్రెడిట్ కార్డు ఉంటే చాలు కంపెనీలు లేదా ఆర్థిక సంస్థ‌లు మ‌రో క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు లేదా వ్య‌క్తిగ‌త రుణం అందించేందుకు మీ చుట్టూ తిరుగుతాయి. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఏదైనా కార‌ణం వ‌ల్ల క్రెడిట్ కార్డు లేదా రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్ల‌యితే అది క్రెడిట్ స్కోర్ మీద ప్ర‌తికూల ప్రభావం చూపుతుంది.

4. క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో

4. క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో

క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో(సీయూఆర్‌) అంటే మీ కార్డు ప‌రిమితిలో ఎంత వ‌ర‌కూ వాడుతున్నారు అనేది. క్రెడిట్ స్కోర్‌ను ప్ర‌భావితం చేసే వాటిలో ఇది మ‌రో ముఖ్య కార‌కం. దాదాపు 30% క్రెడిట్ స్కోర్ క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీకు క్రెడిట్ కార్డుకు ఇచ్చిన ప‌రిమితి రూ.1 లక్ష అయి ఉండి, చేసే ఖ‌ర్చు నెల‌కు రూ.60 వేలు ఉన్న‌ట్ల‌యితే క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో 60%గా అర్థం చేసుకోవాలి. దీంతో మీరు అప్పును ఎలా మెనేజ్ చేస్తారో, క్రెడిట్ కార్డు వాడ‌కం అలవాటు వంటివి తెలుస్తాయి.

5. రుణాల‌ను చెల్లిస్తున్న తీరు(పేమెంట్ హిస్ట‌రీ)

5. రుణాల‌ను చెల్లిస్తున్న తీరు(పేమెంట్ హిస్ట‌రీ)

మీ క్రెడిట్ రిపోర్ట్ వ‌చ్చిన‌ప్పుడు దానిలో అన్ని అంశాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. ముఖ్యంగా పేమెంట్ హిస్ట‌రీ విష‌యంతో ప్రారంభించి దేన్ని మిస్ చేయ‌కుండా చ‌ద‌వండి. ఎందుకంటే పేమెంట్ హిస్ట‌రీ అనే 30% వ‌ర‌కూ క్రెడిట్ స్కోర్‌ని నిర్ణ‌యించ‌డంలో ప్రాముఖ్య‌త క‌లిగి ఉంటుంది. మీర‌నుకోవ‌చ్చు కొన్ని ఆల‌స్యంగా చేసిన (వాయిదా)చెల్లింపులు ఎటువంటి హాని చేస్తాయిలే అని. అది త‌ప్పు. క్రెడిట్ కార్డు బిల్లులు, చెల్లించ‌ని రుణ వాయిదాలు, క‌ట్ట‌ని అప్పులు వంటివి క్రెడిట్ స్కోర్‌ను దిగ‌జారుస్తాయ‌ని గుర్తుంచుకోవాలి.

6. రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేయ‌క‌పోవ‌డం

6. రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేయ‌క‌పోవ‌డం

ఎక్కువ మంది క్రెడిట్ కార్డు ద‌ర‌ఖాస్తు చేసే ముందు లేదా రుణం కోసం ప్ర‌య‌త్నించే ముందు చేసే త‌ప్పు ఇదే. క్రెడిట్ స్కోర్ అనే మాట‌ గురించి తెలిసినా ప‌ట్టించుకోరు. కొత్త రుణం కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు అందుకోసం బ్యాంకులు క్రెడిట్ స్కోర్ మీద ఎంత‌లా ఆధార‌ప‌డ‌తాయో అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. అందుకే ఒక్కోసారి క్రెడిట్ స్కోర్ చెక్ చేసే విష‌యంలో నిర్ల‌క్ష్యం చేస్తారు.

మామూలుగా 750 పైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారి రుణ ద‌ర‌ఖాస్తులు సులువుగా అంగీక‌రిస్తారు. అప్రూవ్ చేస్తారు. అందుకే రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకూడ‌ద‌నుకుంటే ముందే క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవ‌డం సూచ‌నీయం.

7. అప్పులు కాని చెల్లింపులు(బిల్లులు)

7. అప్పులు కాని చెల్లింపులు(బిల్లులు)

కేవ‌లం క్రెడిట్ కార్డు, రుణం సంబంధించి చెల్లింపులు స‌రిగా జ‌ర‌గ‌క‌పోతే మాత్ర‌మే అది క్రెడిట్ హిస్ట‌రీ(రుణ చ‌రిత్ర‌) మీద ప్ర‌భావం చూపుతుంద‌ని అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్లు వంటివి సైతం స‌కాలంలో చెల్లించ‌క‌పోయినా అది క్రెడిట్ రిపోర్టు లేదా క్రెడిట్ హిస్ట‌రీ మీద ప్ర‌భావం చూపుతుంద‌ని గుర్తుంచుకుంటే మంచిది.

బిట్ కాయిన్ అంటే ఏమిటి? మ‌న‌ దేశంలో ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..?

బిట్ కాయిన్ అంటే ఏమిటి? మ‌న‌ దేశంలో ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..?

బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..? బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..?

క్రెడిట్ కార్డు - వివిధ రుసుముల సంగ‌తిలా...

క్రెడిట్ కార్డు - వివిధ రుసుముల సంగ‌తిలా...

 క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి ఉండే వివిధ రుసుములు, చార్జీలు క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి ఉండే వివిధ రుసుములు, చార్జీలు

 ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లుప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

Read more about: credit score loan credit card credit
English summary

క్రెడిట్ స్కోర్ పెర‌గ‌క‌పోవడానికి 7 ముఖ్య కార‌ణాలు | These factors effect you credit score That you may not know

Knowingly or unknowingly, we are all guilty of killing our credit scores. Not in a single foul swoop, or swipe, of our credit cards, or burying our loan papers alive, but in more unassuming, drawn out ways. Here are the main factors that you may not know which influences your credit score
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X