For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ బీమా ఎందుకు ఉండాలి?: 4 కార‌ణాలు

ఇంటితో పాటు ఇంట్లో ఉండే వ‌స్తువుల‌కు సైతం కొన్ని గృహ బీమా కంపెనీలు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాయి. గృహ బీమా ఉంటే ఏ విధంగా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చో కింద అంశాల ద్వారా తెలుసుకుందాం.

|

సొంత ఇంటిని కలిగి ఉండ‌టం చాలా మందికి జీవిత ఆశ‌యం. చాలా ఏళ్లు సంపాదించి, ఎన్నో ఆలోచించి ఇల్లు సొంత చేసుకుంటారు. అయితే దాన్ని సురక్షితంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం చాలా ముఖ్యం. అయితే దేశంలో ఇళ్ల కొనుగోలు పెరుగుతున్న‌ప్ప‌టికీ గృహ బీమా మాత్రం కావాల్సినంత‌గా వృద్ది చెంద‌డం లేదు. చాలా మందికి దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఇందులో ఏమేమి ఉంటాయో తెలియ‌దు. ఇంటితో పాటు ఇంట్లో ఉండే వ‌స్తువుల‌కు సైతం కొన్ని గృహ బీమా కంపెనీలు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాయి. గృహ బీమా ఉంటే ఏ విధంగా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చో కింద అంశాల ద్వారా తెలుసుకుందాం.

 1. ప్ర‌కృతి, మాన‌వ క‌ల్పిత విప‌త్తులు

1. ప్ర‌కృతి, మాన‌వ క‌ల్పిత విప‌త్తులు

ఉగ్ర‌వాదం, అగ్నిప్ర‌మాదం, స‌హ‌జ విప‌త్తులు జ‌రిగి ఇంటికి న‌ష్టం జ‌రిగితే స‌మ‌గ్ర గృహ బీమా పాల‌సీలో సూచించిన మేర‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఎంతో మంది వినియోగ‌దారుల అస‌వ‌రాల‌ను గుర్తుంచుకుని ఈ గృహ బీమా పాల‌సీని రూపొందించారు. ఒక‌వేళ వినియోగ‌దారులు ఎక్కువ‌గా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకుని ఉంటే అటువంటి న‌ష్టం వ‌ల్ల ఎక్కువ క‌వ‌రేజీ ల‌భించేలా పాల‌సీని ఎంచుకోవ‌చ్చు.

2. వ్య‌క్తిగ‌త ఆస్తులు న‌ష్ట‌పోయిన‌ప్పుడు, ప్ర‌మాదం వాటిల్లిన‌ప్పుడు

2. వ్య‌క్తిగ‌త ఆస్తులు న‌ష్ట‌పోయిన‌ప్పుడు, ప్ర‌మాదం వాటిల్లిన‌ప్పుడు

గృహ బీమా పాల‌సీ కేవ‌లం ఇంటికే కాదు, అందులో ఉండే వివిధ ఆస్తుల‌కు సైతం బీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఈ జాబితాలో బంగారు,వెండి ఆభ‌ర‌ణాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, ఫ‌ర్నిచ‌ర్‌, విలాస వ‌స్తువులు, పురాత‌న వ‌స్తువుల వంటివి సైతం ఉంటాయి. ఈ విధంగా ఉండ‌టం వ‌ల్ల దొంగ‌త‌నం వంటివి జ‌రిగిన‌ప్పుడు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు కొత్త వ‌స్తువుల‌ను మార్చుకునేందుకు, లేదా ఉన్న‌వాటిని మ‌ర‌మ్మ‌త్తులు చేసుకునేందుకు సైతం బీమా ర‌క్ష‌ణ అవ‌కాశం క‌ల్పిస్తుంది.

3. తాత్కాలిక నివాస ఖ‌ర్చులు

3. తాత్కాలిక నివాస ఖ‌ర్చులు

ఇల్లు ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు ఒక్కోసారి దాంట్లో నివ‌సించేందుకు వీలుండ‌దు. పున‌ర్నిర్మాణం లేదా మ‌ర‌మ్మ‌త్తు జ‌రిగేంత వ‌ర‌కూ వేరే అద్దె ఇంట్లో నివాసం ఉండాల్సి రావ‌చ్చు.

అప్పుడు తాత్కాలికంగా అద్దె చేతి నుంచి చెల్లించి ఎక్క‌డైనా ఉండాలి. అలాంట‌ప్పుడు కొంత మేర‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను గృహ బీమా పాల‌సీ భ‌రిస్తుంది.

4. గృహ బీమా ద‌ర‌ఖాస్తు

4. గృహ బీమా ద‌ర‌ఖాస్తు

గృహ రుణ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ చాలా సులువైన‌ది. ఏయే అంశాలు క‌వ‌రయ్యేలా తీసుకోవాలో ముందు నిర్ణ‌యించుకోవాలి. వివిధ కంపెనీలు ఏ విధంగా పాల‌సీ సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నాయో చూడాలి. ద‌ర‌ఖాస్తును నింప‌డం ద్వారా గృహ బీమా ప్ర‌క్రియ మొద‌లవుతుంది. పాల‌సీ కొనుగోలు తుది సంత‌కం చేసే ముందు నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాలి. ముఖ్యంగా పాల‌సీలో క‌వ‌ర‌య్యే అంశాలు, మిన‌హాయింపు అంశాలు ముందే తెలుసుకుంటే మంచిది. అంతే కాకుండా పాల‌సీ కొన్న 3 లేదా 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత పాల‌సీని స‌మీక్షిస్తుండ‌టం అవ‌స‌రం. ఎందుకంటే ఇంటి పున‌ర్నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు క్ర‌మంగా పెరుగుతూ ఉంటుంది క‌నుక‌.

Read more about: home insurance home insurance
English summary

గృహ బీమా ఎందుకు ఉండాలి?: 4 కార‌ణాలు | home insurance what to know before own a policy

While owning a home is an aspiration for many people, it is often the culmination of many years of hard work. Given the money and effort that goes into buying such an asset, it is only fair that it is kept safe and secure
Story first published: Friday, September 8, 2017, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X