For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017లో మ‌ధ్య‌త‌ర‌గ‌తికి 5 మంచి క్రెడిట్ కార్డులు

క్రెడిట్ కార్డు లేని ఉద్యోగులు ఏ కార్డయితే మంచిద‌ని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోస‌మే ముఖ్య‌మైన క్రెడిట్ వెబ్‌సైట్లు ప్ర‌క‌టించిన 5 టాప్ క్రెడిట్ కార్డుల గురించి ఇక్క‌డ తెలుసుకోండి.

|

క్రెడిట్ కార్డును వాడినా, వాడ‌క‌పోయినా అలా ప‌ర్సులో పెట్టుకుని ఉంటే అదొక ఆనందం. అత్య‌వ‌స‌రాల్లో అదొక భ‌రోసా. ఒక్కోసారి హ‌ఠాత్తుగా డ‌బ్బు కావాల‌న్న‌ప్పుడు ఎవ‌రినీ అడ‌గలేం. అందుకే ఒక్కోసారి దాన్నుంచి బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బు బ‌దిలీ చేసుకుంటాం. త‌ర్వాత నెమ్మ‌దిగా బిల్లు క‌ట్టే లోపు డ‌బ్బు స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. ఇదివ‌ర‌కే ఏదో క్రెడిట్ కార్డుంటే స‌రే. ఇప్ప‌టికీ క్రెడిట్ కార్డు లేని ఉద్యోగులు ఏ కార్డయితే మంచిద‌ని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోస‌మే ముఖ్య‌మైన క్రెడిట్ వెబ్‌సైట్లు ప్ర‌క‌టించిన 5 టాప్ క్రెడిట్ కార్డుల గురించి ఇక్క‌డ తెలుసుకోండి.

1. హెచ్ఎస్‌బీసీ వీసా ప్లాటిన‌మ్ కార్డు

1. హెచ్ఎస్‌బీసీ వీసా ప్లాటిన‌మ్ కార్డు

త‌క్కువ వార్షిక రుసుముతో, రెస్టారెంట్ల‌, లాంజ్‌ల వద్ద 20% రాయితీ అందించే కార్డు హెచ్ఎస్‌బీసీ వీసా ప్లాటినం కార్డు. అంతే కాకుండా అన్ని దేశీయ విమాన ప్ర‌యాణాల‌పై క్లియ‌ర్‌ట్రిప్‌లో చేసుకునే బుకింగ్‌ల‌పై రూ.1200 వ‌ర‌కూ ఆదా చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

2. ఎస్‌బీఐ సింప్లీ సేవ్ కార్డు

2. ఎస్‌బీఐ సింప్లీ సేవ్ కార్డు

ఈ కార్డు మీ రెస్టారెంట్లు, మూవీ టిక్కెట్ల‌, కిరాణా స‌రుకుల కొనుగోలుకు ప‌నికొస్తుంది.

  1. మొద‌టి ఏడాది వార్షిక రుసుము రూ.499.

  2. అయితే షాపింగ్ ద్వారా వ‌చ్చే 2000 బోన‌స్ పాయింట్ల వ‌ల్ల రూ.500 విలువ చేసే క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.
  3. ఏడాది క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం రూ.75 వేల‌కు మించితే మ‌రుస‌టి ఏడాది నుంచి వార్షిక రుసుముండ‌దు.
  4. దేశ‌వ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకుల్లో ఫ్యూయ‌ల్ స‌ర్‌చార్జీ ఉండ‌దు.

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా ప‌నికొచ్చే కార్డుకు ప్లెక్సీపే సాయంతో ఈజీ ఈఎంఐ ఆప్ష‌న్ ఉంది.ద‌ర‌ఖాస్తు కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

3. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు

3. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు

సిటీ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు

ప్ర‌తి రూ.125 కొనుగోలు లేదా ఖ‌ర్చుపై 10 రివార్డు పాయింట్లు వ‌స్తాయి.

డైనింగ్‌(ఆహారం), షాపింగ్, మూవీ టిక్కెట్ల కొనుగోలుపై 3600 ఆఫ‌ర్లు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తు కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

సిటీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కార్డు

మూవీ టిక్కెట్ల కొనుగోలుపై 5% క్యాష్ బ్యాక్‌

టెలిఫోన్ బిల్లు పేమెంట్‌పై 5% క్యాష్ బ్యాక్

యుటిలిటీ బిల్లు చెల్లింపుల‌పై 5% క్యాష్ బ్యాక్

మిగిలిన అన్ని కొనుగోళ్ల‌పై 0.5% క్యాష్ బ్యాక్‌

4. ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డు

4. ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డు

  • జాయినింగ్ రుసుము: రూ. 499
  • ఒక సంవ‌త్స‌రం క్రెడిట్ కార్డు రూ.1ల‌క్ష బిల్లు చేస్తే మ‌రుస‌టి ఏడాది రూ.499 చార్జీ ఉండ‌దు.
  • రూ.1 ల‌క్ష కంటే త‌క్కువ ఏడాది మొత్తం క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ కార్డు వార్షిక రుసుము ఉంటుంది.
  • రూ.500 నుంచి రూ.3000 మ‌ధ్య చేసే ఇంధ‌న కొనుగోలు విష‌యంలో 2.5% ఫ్యూయ‌ల్ స‌ర్‌చార్జీ ఉండ‌దు.
  • ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే ప్ర‌తి రూ.100పై 5 రివార్డు పాయింట్లు

    మిగిలిన కొనుగోళ్ల‌పై రూ.100 మీద ఒక్కో రివార్డు పాయింటు

  • ద‌ర‌ఖాస్తు కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

5. ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ కోర‌ల్ క్రెడిట్ కార్డు

5. ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ కోర‌ల్ క్రెడిట్ కార్డు

మొద‌టి సారు కార్డు తీసుకున్న‌ప్పుడు జాయినింగ్ రుసుము కింద రూ.199తో పాటు జీఎస్టీ చెల్లించాలి. ద‌ర‌ఖాస్తు కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

మొద‌టి ఏడాది కార్డు వార్షిక రుసుము ఉండ‌దు.

2.5% క్యాష్ బ్యాక్ వ‌ల్ల ఇంధ‌న రుసుముల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

డైనింగ్(రెస్టారెంట్) బిల్లుల‌పై 15% ఆదా చేసుకోవ‌చ్చు.

2 సినిమా టిక్కెట్ల‌పై ప్ర‌తి నెలా రూ.100 రాయితీ పొంద‌వ‌చ్చు.

Read more about: credit cards card
English summary

2017లో మ‌ధ్య‌త‌ర‌గ‌తికి 5 మంచి క్రెడిట్ కార్డులు | best credit cards for Normal shopping needs in 2017

We’ve picked the TOP reward Credit Cards of 2017 that will encourage to you shop for daily needs. these are depends on reward points, joining fee and Annual fee.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X