For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కం మిగ‌తా పింఛ‌ను ప‌థ‌కాలంటే మంచిదేనా?

సంపాదించే వయ‌సు పూర్త‌యిన త‌ర్వాత సైతం అంద‌రికీ డ‌బ్బు అవ‌స‌రం ఉంటుంది. అంద‌రూ దానికి త‌గ్గ‌ట్లుగా ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారుచేసుకుని ఉండ‌క‌పోవ‌చ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాన‌మంత్

|

సంపాదించే వయ‌సు పూర్త‌యిన త‌ర్వాత సైతం అంద‌రికీ డ‌బ్బు అవ‌స‌రం ఉంటుంది. అంద‌రూ దానికి త‌గ్గ‌ట్లుగా ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారుచేసుకుని ఉండ‌క‌పోవ‌చ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాన‌మంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అట‌ల్ పింఛ‌ను యోజ‌న(ఏపీవై) ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కం గురించి పెట్టుబ‌డిదారుల‌కు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ క‌థ‌నం ద్వారా కొన్ని సందేహాల‌ను నివృత్తి చేసుకుందాం.

1. అర్హ‌త‌-అన‌ర్హ‌త‌

1. అర్హ‌త‌-అన‌ర్హ‌త‌

*భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో చేరవచ్చు.

*18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. *60వ ఏట నుంచి పింఛ‌ను్ ప్రారంభం అవుతుంది.

* ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌), పింఛ‌ను్ సౌకర్యం ఉన్నఇతర వర్గాల వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తన వాటాగా రూ.5వేల చందా చెల్లించదు. ఇది తప్ప మిగతా ప్రయోజనాలన్నీ అందరికీ ఒకటే.

2. బ్యాంకు ఖాతా త‌ప్ప‌నిస‌రి

2. బ్యాంకు ఖాతా త‌ప్ప‌నిస‌రి

ముందుగా ఏపీవై ఖాతా ప్రారంభించాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఖాతా లేకపోతే ఏదేనీ బ్యాంకులో ఖాతా ప్రారంభించడం ద్వారా ఇందులో చేరవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నామినీ వివరాలు తప్పనిసరి. స్కీమ్ లో చేరే సమయంలో ఆధార్ నంబర్ లేకపోతే తర్వాత అయినా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులు నెలవారీ చందాను వారి ఖాతా నుంచి నిర్ణీత తేదీన ఉపసంహరించుకుంటాయి. కనుక చెల్లింపు తేదీనాటికి చందా మొత్తాన్ని అందులో ఉంచాలి.

3. రూ.5,000 వేల వరకు పింఛ‌ను్

3. రూ.5,000 వేల వరకు పింఛ‌ను్

చెల్లించే చందాను బట్టి పింఛ‌ను్ 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి 60వ ఏట నుంచి నెలకు 1,000 రూపాయల పింఛ‌ను్ కోరుకుంటే ప్రతి నెలా 42 రూపాయల చొప్పున 42 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 2వేల పింఛ‌ను్ కావాల‌నుకుంటే.. ప్రతి నెలా 84 రూపాయలు, 3వేల పింఛ‌ను్ కోరుకుంటే 126 రూపాయలు, 4వేల పింఛ‌ను్ కోరుకుంటే 168 రూపాయలు, 5వేల పింఛ‌ను్ కోరుకుంటే నెలనెలా 210 రూపాయలు చందా చెల్లించాలి.

4. ప్ర‌తి నెలా ఎంత మొత్తం చెల్లించాలి?

4. ప్ర‌తి నెలా ఎంత మొత్తం చెల్లించాలి?

40 ఏళ్ల వ్యక్తి అయితే వెయ్యి రూపాయల పింఛ‌ను్ కోసం 291 రూపాయలు, 2వేల పింఛ‌ను్ కోసం 582 రూపాయలు, 3వేల పింఛ‌ను్ కోసం 873 రూపాయలు, 4వేల పింఛ‌ను్ కోసం 1,164 రూపాయలు, 5వేల పింఛ‌ను్ కోసం 1,454 రూపాయలు నెల నెలా చెల్లించాలి. ఒకవేళ 2వేల రూపాయల పింఛ‌ను్ కోసం చందా కడుతుంటే... కావాలంటే దాన్ని 5వేల పింఛ‌ను్ ఆప్షన్ కిందకు మార్చుకుని అదనపు చందా చెల్లించే సదుపాయం కూడా ఉంది. అలాగే, పింఛ‌ను్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకు ఏటా ఏప్రిల్ నెలలో అవకాశం ఉంటుంది. అలా మార్చుకున్నప్పుడు నెలవారీ చెల్లించే మొత్తం కూడా మారుతుంది.

స‌మానమైన వాటా ప్ర‌భుత్వం చెల్లిస్తుందా?

స‌మానమైన వాటా ప్ర‌భుత్వం చెల్లిస్తుందా?

ఎటువంటి సామాజిక భద్రతా స్కీముల్లోను సభ్యులు కానివారు, ఈపీఎఫ్ వంటి స్కీముల్లో లేని వారు, అవ్యవస్థీకృత రంగంలోని వారికి వారి వార్షిక చందాలో సగం లేదా వెయ్యి రూపాయలు ఏది తక్కువైతే అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అందిస్తుంది. ఉదాహరణకు... 18 ఏళ్ల వ్యక్తి 5వేల పింఛ‌ను్ కోసం నెల నెలా 210 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లయితే... వార్షికంగా ఇది 2520 రూపాయలు అవుతుంది. ఇందులో సగం అంటే 1260 రూపాయలు. దీనికంటే వెయ్యి రూపాయలే తక్కువ కనుక అంతమేర ప్రభుత్వం ఏటా పింఛ‌ను్ ఖాతాలో జమచేస్తుంది.

ప‌థ‌కం నుంచి వైదొల‌గాలంటే...

ప‌థ‌కం నుంచి వైదొల‌గాలంటే...

సాధారణ సందర్భాల్లో ఈ స్కీమ్ నుంచి వైదొలగడానికి అవకాశం లేదు. చందాదారుడు మరణించిన సందర్భాల్లో.. లేదా మరణానికి దారితీసే వ్యాధికి గురైనప్పుడు మాత్రమే స్కీమ్ నుంచి వైదొలగేందుకు అవకాశం ఇస్తారు.

7.నెలవారీ చెల్లించడంలో విఫలమైతే...

7.నెలవారీ చెల్లించడంలో విఫలమైతే...

100 రూపాయల చందాకు నెలకు ఒక రూపాయి జరిమానా ఉంటుంది. 101 నుంచి 500 రూపాయల్లోపు చందాకు రెండు రూపాయలు, 501 నుంచి 1000 రూపాయల్లోపు చందాకు 5 రూపాయలు, 1000 రూపాయలకు పైబడిన చందా మొత్తానికి నెలకు 10 రూపాయల చొప్పున జరిమానా వసూలు చేస్తారు. వరుసగా ఆరు నెలల పాటు చందా చెల్లించనట్లయితే ఆ పింఛ‌ను్ ఖాతాను స్తంభింపజేస్తారు. 12 నెలలు దాటితే డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత ఖాతా మూసివేయబడుతుంది. ఒక వేళ చందాదారులు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్ష‌న్ పెట్టుకుని ఉంటే ఖాతాలో స‌మ‌యానికి త‌గినంత నిల్వ ఉండేలా చూసుకోవాలి.

8.60 ఏళ్ల వ‌య‌సు రాగానే

8.60 ఏళ్ల వ‌య‌సు రాగానే

ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకారం నెలనెలా పింఛ‌ను్ అందుతుంది. అయితే అప్పటి వరకు సమకూరిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వరు. దానిపై వడ్డీని పింఛ‌ను్ గా అందిస్తారు. చందాదారు లేదా అతడి జీవిత భాగస్వామి బతికి ఉన్నంత వరకూ పింఛ‌ను్ అందుతుంది. 60 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో పింఛ‌ను్ దారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి నెలనెలా పింఛ‌ను్ మొత్తాన్ని అందిస్తారు. దంపతులు ఇద్దరూ మరణించినట్లయితే వారి నామినీకి కార్పస్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. 1,000 రూపాయల పింఛ‌ను్ చందాదారుల కార్పస్ 60 ఏళ్లు వచ్చేసరికి 1.7 లక్షల రూపాయలకు చేరుతుంది. అదే 2,000 రూపాయల పింఛ‌ను్ అందుకునే వారి కార్పస్ 3.4 లక్షల రూపాయలు, 3,000 రూపాయల పింఛ‌ను్ అందుకునే వారి కార్పస్ 5.1 లక్షల రూపాయలు, 4,000 రూపాయల పింఛ‌ను్ అందుకునే వారి కార్పస్ 6.8 లక్షల రూపాయలు, 5,000 రూపాయల పింఛ‌ను్ అందుకునే వారి కార్పస్ 8.5 లక్షల రూపాయలుగా ఉంటుంది. మరణానంతరం నామినీలకు ఈ మొత్తం అందుతుంది. పూర్తి వివరాలకు, ఇతరత్రా ఏవైనా సందేహాలు ఉంటే https://www.npscra.nsdl.co.in/nsdl-faq.php వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు. లేదా అన్ని బ్యాంకు శాఖల్లోనూ సంప్రదించడం ద్వారా వివరాలు పొందవచ్చు.

9. 5వేల రూపాయల పింఛ‌ను్ సరిపోతుందా..?

9. 5వేల రూపాయల పింఛ‌ను్ సరిపోతుందా..?

ప్రభుత్వ హామీ... నెల నెలా 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కచ్చితమైన పింఛ‌ను్ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పింఛ‌ను్ ఓ వ్యక్తి అవసరాలకు సరిపోతుందా? అంటే అవును అని చెప్పడం కష్టమే. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి మరో 20 ఏళ్ల తర్వాత నుంచి నెల నెలా 5వేల పింఛ‌ను్ అందుకుంటాడని అనుకుంటే... అప్పటి జీవన వ్యయం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 5 వేల రూపాయల సొమ్ము స‌రిపోతుందా అని ఆర్థిక నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు.

10. ఎంత కావాలి?

10. ఎంత కావాలి?

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం రోజువారీ ఖ‌ర్చులు100 రూపాయలుగా ఉంటే నెలకు 3వేల రూపాయలు సరిపోతాయి. కానీ, ఇదే వ్యక్తికి 60 ఏళ్ల వయసుకు వస్తే నెలకు 12 వేల రూపాయలకుపైన అవసరం అవుతాయి. అంటే మూడు రెట్లు అదనంగా కావాలి. ఆ విధంగా చూస్తే 5వేల రూపాయల పింఛ‌ను్ చాలదు. ఒకవేళ ఇందులో చేరినప్పటికీ అదనపు పింఛ‌ను్ కోసం వీలుగా తగిన మొత్తాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. ఎప్పుడు ఎంత కంట్రిబ్యూట్ చేస్తే ఎంత పింఛ‌ను వ‌స్తుందో తెలుసుకునేందుకు కింద ప‌ట్టిక చూడండి

11.ఏది ఉత్త‌మం?

11.ఏది ఉత్త‌మం?

ఈ స్కీమ్ లో చందాదారులు చెల్లించే మొత్తంపై 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక క్రమ శిక్షణ కలిగిన వారు ఈ స్కీమ్ కు చెల్లించే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ విధానంలో పెట్టుబడి పెడితే ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుందని నిపుణులు చెబుతున్నమాట. కానీ, అటల్ పింఛ‌ను్ యోజన ఈక్విటీ మార్కెట్లతో సంబంధం లేకుండా రాబడి, పింఛ‌ను్ కు కచ్చితమైన హామీ కలది. మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో రాబడులకు హామీ ఉండదన్న విషయం తెలిసిందే.

12. ఎన్ పీఎస్ లో ఎక్కువ కానీ...?!

12. ఎన్ పీఎస్ లో ఎక్కువ కానీ...?!

ఈ స్కీమ్ లో కంటే నేషనల్ పింఛ‌ను్ స్కీమ్ లో చేరి నెలవారీ పెట్టుబడి పెట్టడం వల్ల అటల్ పింఛ‌ను్ యోజనలో వచ్చినంత రాబడికీ, నిర్వహణ బావుంటే ఇంకా అధిక రాబడికి కూడా అవకాశం ఉంటుందని భావించవచ్చు. పైగా ఎన్ పీఎస్ లో 60 ఏళ్లు వచ్చిన తర్వాత 60 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంతే కాకుండా ఎన్‌పీఎస్‌లో టైర్‌-1, టైర్‌-2 అని రెండు ర‌కాల ఖాతాలు ఉంటాయి. ఇవి మ‌నం సొమ్ము తీసుకునే ప‌ద్ద‌తిని సుల‌భ‌త‌రం చేస్తాయి. కానీ ఏపీవోలో ఒకే ఖాతా ఉంటుంది.

సందేహాల నివృత్తికి

సందేహాల నివృత్తికి

అయితే అటల్ పింఛ‌ను్ యోజనలో 5వేల రూపాయల పింఛ‌నుర్ కార్పస్ 8.5 లక్షలుే ఉంటుంది. 8.5 లక్షలకు 7.1 శాతం నెలవారీ వడ్డీ కింద కేంద్రం 5 వేల పింఛ‌ను్ అందిస్తుంది. ఒకవేళ ఎన్ పీఎస్ స్కీమ్ లో పెట్టుబడితో వారి కార్పస్ 11 లక్షల రూపాయలు అయిందనుకుందాం. కానీ, 20 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతమున్న స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉంటాయని ఆశించలేము కదా. అందుకని ఒక్కసారి ఈ స్కీమ్ మీకు సరిపోతుందా? లేదా? ఆలోచించి ముందడుగు వేయండి. త‌దుప‌రి ఎటువంటి సందేహాలున్నా ఎన్‌పీఎస్ వెబ్‌సైట్ చూసి నివృత్తి చేసుకోవ‌చ్చు.

ఏపీవైకి సంబంధించిన సందేహాల నివృత్తికి 1800 110 069 నంబ‌రులో సంప్ర‌దించండి.

Read more about: apy atal pension yojana pension
English summary

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కం మిగ‌తా పింఛ‌ను ప‌థ‌కాలంటే మంచిదేనా? | 11 Differences Between National Pension Scheme and Atal Pension Yojana

National Pension Scheme (NPS) and Atal Pension Yojana (Atal Pension Yojana) are schemes offered with an aim to provide social security to individuals after retirement. Both will be provided in the form of pension. Atal Pension Yojana, which was announced by Finance Minister Arun Jaitley in the Union Budget. Also, the Finance Minister modified NPS with some super benefits in the Union Budget 2015. Now let us understand basic difference between both the schemes:
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X