English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

జీవిత బీమా పాల‌సీ అవ‌స‌ర‌మేంటి? పాల‌సీల ర‌కాలు

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

మీకు సంపాద‌న ఉందా? అయితే పాల‌సీ ఉంటే మంచిది...

మీరు సంపాదించే వారై ఉండి, మీపై ఆధార‌ప‌డే వారు ఉంటే త‌ప్ప‌కుండా జీవిత బీమా తీసుకోవాలి. ఆదాయం లేక‌పోయినా, ఆధార‌ప‌డిన వారు లేకున్నా బీమా అవ‌స‌రం ఉందా? అంటే అంత క‌చ్చితంగా లేదు అని చెప్ప‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు అర‌వింద్ వ‌య‌సు 30 ఏళ్లు. అప్ప‌టికే పెళ్ల‌యి భార్య‌, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా అత‌ని త‌ల్లిదండ్రులు కూడా వారి ద‌గ్గ‌రే ఉంటున్నారు. ఎంతో సంతోషంగా జీవితం గ‌డుపుతున్న వారి కుటుంబంలో ఒక్క‌సారిగా పిడుగు లాంటి వార్త‌. రోడ్డు ప్ర‌మాదంలో అర‌వింద్ దుర్మర‌ణం పాల‌య్యాడు. ఈ దుఃఖాన్ని దిగ‌మింగుకొని అంత్య క్రియ‌లు పూర్త‌యిన వెంట‌నే ఆయ‌న బార్య ఏదో ఉద్యోగానికి ప్ర‌య‌త్నాల‌ను ఆరంభించింది. అయినప్ప‌టికీ కుటుంబాన్ని నెట్టుకురావ‌డం క‌ష్ట‌మ‌యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అర‌వింద్ పేరిట బీమా పాల‌సీ లేదు. దీంతో ఆ కుటుంబం అత‌ని త‌ద‌నంత‌రం చాలా క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది.

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను అత్త‌మామ‌ల వ‌ద్ద ఇంటి ద‌గ్గ‌రే వ‌దిలేసి ఆమె ఉద్యోగానికి వెళ్లాల్సి వ‌చ్చింది. ఒక వైపు అర‌వింద్ లేని లోటు. మ‌రోవైపు చిన్నారుల ఆల‌నాపాల‌న చూడాల్సిన బాధ్య‌త‌. ఇలాంటి బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న ఎవ‌రికీ రాకూడ‌ద‌నుకుంటాం. అలా కాకుండా అత‌ను కుటుంబానికి ఒక ఆర్థిక ర‌క్షణ క‌ల్పించి ఉంటే ఈ రోజు ఆ ప‌రిస్థితి త‌లెత్తి ఉండేదే కాదు. అందుకే జీవిత బీమా అనేది త‌మ‌పై ఆధార‌ప‌డ్డ‌వారు ఉన్న ప్ర‌తి వ్య‌క్తీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందే. ఒంట‌రి జీవితం గ‌డిపేవారికి సాధార‌ణంగా పాల‌సీ అవ‌స‌రం ఉండ‌దు.

1. పాల‌సీల ర‌కాలు

1. పాల‌సీల ర‌కాలు

జీవిత బీమా పాల‌సీల్లో వంద‌ల ర‌కాల పాల‌సీలు మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే పోటీని త‌ట్టుకునేందుకు చాలా కంపెనీలు అనునిత్యం స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో పాల‌సీను ప్ర‌వేశ‌పెడుతూ ఉంటాయి. వీటి నుంచి స‌రైన దానిని ఎంచుకోవ‌డం కాస్త క‌ష్ట‌మైన ప‌నే. అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల పాల‌సీలు, వాటి ప్ర‌యోజ‌నం, ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలుసుకోకుండా మ‌నం ఉత్త‌మ‌మైన దానిని తీసుకోలేం.

మీ అవసరాలను చర్చించుకొని, విశ్లేషించుకుని మీకు తగిన భీమా పధకాన్ని ఎంచుకోవాలి. మీ ప్రాముఖ్యతలు, మీ లక్ష్యాలపై ఆధారపడి ఉండాలి. ఉదాహరణకు, మరణం సంభవించినప్పుడు దొరికే ఆర్ధిక భద్రత, దీర్ఘకాలంలో మీ ధనం పెరగడం, పొదుపు లేక పదవీ విరమణ చేశాక పింఛను సదుపాయం (ఏదైనా కావచ్చు) మీరు ఒక ఆర్ధిక సలహాదారుడిని కూడ సంప్రదించి, అతడి మార్గదర్శకత్వంలో ఒక మంచి జీవిత భీమా పధకాన్ని ఎంచుకొనవచ్చు. దీనికై ఎటువంటి కఠిన నియమ నిబంధనలూ లేవు. సాధారణంగా, ఒక జీవిత భీమా రక్షణ పధకం, మీ వార్షిక ఆదాయానికి 15 నుండి 20 రెట్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

2. ట‌ర్మ్ పాల‌సీ

2. ట‌ర్మ్ పాల‌సీ

జీవితానికి అస‌లైన ఆర్థిక‌ భ‌రోసానిచ్చేవి ట‌ర్మ్ పాల‌సీలే. ఎటువంటి గంద‌ర‌గోళానికి అవ‌కాశ‌మివ్వ‌కుండా పాల‌సీ చివ‌ర్లో ఎంత మొత్తాన్ని చెల్లిస్తార‌నే విష‌యంలో కాస్త స్ప‌ష్ట‌త ఉంటుంది. గ‌డువు తీరిన త‌ర్వాత జీవించి ఉంటే ట‌ర్మ్ పాల‌సీల్లో ఎటువంటి చెల్లింపులు చేయ‌రు. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ముందుగా నిర్ణ‌యించిన ట‌ర్మ్(కాల ప‌రిమితి)కి మాత్ర‌మే పాల‌సీ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. సాధార‌ణంగా 5 ఏళ్ల నుంచి మొద‌లుకొని 35 ఏళ్ల వ‌ర‌కూ ఉండేలా ట‌ర్మ్ పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి.

3. ఎండోమెంట్ పాల‌సీ

3. ఎండోమెంట్ పాల‌సీ

బీమా హామీతో పాటు పెట్టుబ‌డి మార్గంగా ఉప‌యోగ‌ప‌డేదే ఎండోమెంట్ పాల‌సీ. ఈ ర‌క‌మైన పాల‌సీలు 7 ఏళ్ల నుంచి మొద‌లుకొని 30 ఏళ్ల కాల‌ప‌రిమితి వ‌ర‌కూ ఉంటుంటాయి. వీటిలో క‌ట్టిన ప్రీమియం వృథాగా పోకుండా చెప్పుకోద‌గ్గ ప్ర‌తిఫ‌లాన్ని తిరిగి పొంద‌వ‌చ్చు.

4. మ‌నీబ్యాక్ పాల‌సీ

4. మ‌నీబ్యాక్ పాల‌సీ

పాల‌సీదారుడికి క్ర‌మానుగ‌తంగా డ‌బ్బును చెల్లిస్తూ బీమా క‌ల్పించ‌డం మ‌నీబ్యాక్ పాల‌సీ ఉద్దేశం. కుటుంబ అవ‌స‌రాల కోసం నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో డ‌బ్బు కావాల‌నుకునేవారికి ఈ పాల‌సీ త‌గిన‌దిగా చెప్పుకోవ‌చ్చు. సాధార‌ణ వ్య‌క్తులు 13 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారి వ‌ర‌కూ మ‌నీబ్యాక్ పాల‌సీలు తీసుకునే వీలుంది. 7 సంవ‌త్స‌రాలు మొద‌లుకొని 25 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉన్న పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి.

5.యులిప్స్‌:

5.యులిప్స్‌:

జీవితానికి భ‌రోసాతో పాటు పెట్టుబడుల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించేవే యులిప్‌లు. యూనిట్ ఆధారిత బీమా పాల‌సీలు(యులిప్‌)ల ప‌నితీరు మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. యులిప్‌లో పెట్టుబ‌డి ర‌క్ష‌ణ బాధ్య‌త బీమాదారుడిపైనే ఉంటుంది. న‌ష్ట‌భ‌యానికి, ప్రీమియం చెల్లింపు రుసుముల‌ను మిన‌హాయించిన త‌ర్వాత మిగిలే ప్రీమియాన్ని బీమా కంపెనీలు ఒక ఫండ్ యూనిట్‌కు అందిస్తారు. వ్య‌క్తుల పెట్టుబ‌డి ల‌క్ష్యాలు, జీవితానికి ర‌క్ష‌ణ, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిని బ‌ట్టి బీమా కంపెనీలు వివిధ ర‌కాల ఫండ్ల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెడుతూ ఉంటాయి. ఫండ్‌, ఫండ్‌కు మ‌ధ్య రాబ‌డుల విష‌యంలో వ్య‌త్యాసం ఉంటుంది.

6. పింఛ‌ను పాల‌సీలు(పెన్ష‌న్ ప్లాన్స్‌) / యాన్యుటీలు

6. పింఛ‌ను పాల‌సీలు(పెన్ష‌న్ ప్లాన్స్‌) / యాన్యుటీలు

జీవిత బీమా ఆధారంగా పెన్ష‌న్ అందించే పాల‌సీలు అందుబాటులో ఉటాయి. ఈ పాల‌సీల‌ను తీసుకోద‌లిచిన వ్య‌క్తి కొంత సొమ్మును ఒకేసారి లేదా వాయిదా ప‌ద్ద‌తిలో బీమా కంపెనీకి చెల్లించేందుకు అంగీక‌రిస్తారు. తిరిగి ఈ సొమ్మును బీమాదారుడికి కొంత‌కాలం పాటు కొంచెం కొంచెంగా అంద‌జేసేందుకు బీమా కంపెనీ, ఆ వ్య‌క్తి ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. సాధార‌ణంగా ఒక వ్య‌క్తికి అద‌నంగా ఆస్తులు ఉండి దాన్ని ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో వాడుకోవాల‌ని భావిస్తే ఇలాంటి పాల‌సీలు తీసుకోవ‌డం సూచ‌నీయం.

7. యాన్యుటీ రెండు ర‌కాలు

7. యాన్యుటీ రెండు ర‌కాలు

త‌క్ష‌ణ యాన్యుటీ: ఈ ర‌కం యాన్యుటీలో పాల‌సీదారుడు ఏక‌మొత్తాన్ని బీమా కంపెనీలకు ఒక్క‌సారిగా చెల్లించాలి. తిరిగి ఈ సొమ్మును నెల‌ /మూడునెల‌లు / ఆరునెల‌లు / ఏడాదికి ఒక‌సారి చొప్పున కంపెనీలు చెల్లిస్తూ వ‌స్తాయి.

వాయిదాల యాన్యుటీ: ఈ ర‌కం యాన్యుటీలో పాల‌సీదారుడు ఒక ప్రీమియం లేదా వాయిదాల ప‌ద్ద‌తిలో ప్రీమియాన్ని చెల్లిస్తూ ఉంటాడు. కొంత కాల వ్య‌వ‌ధి త‌ర్వాత బీమాదారుడు యాన్యుటీ సొమ్మును వాయిదా ప‌ద్ద‌తిలో అందుకుంటూ ఉంటారు. దీన్ని పిల్ల‌ల చ‌దువులు, వివాహం, పాల‌సీదారు వైద్య ఖ‌ర్చులు వంటి వాటి కోసం వాడుకోవ‌చ్చు.

8. హోల్ లైఫ్ పాల‌సీ(సంపూర్ణ జీవిత బీమా పాల‌సీ)

8. హోల్ లైఫ్ పాల‌సీ(సంపూర్ణ జీవిత బీమా పాల‌సీ)

ఈ ర‌కం జీవిత బీమాలో బీమా సంస్థ‌లు పాల‌సీదారుడి వ‌ద్ద ప్రీమియాన్ని జీవిత‌కాలం పాటు లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కూ తీసుకుంటారు. పాల‌సీదారుడి త‌ద‌నంత‌రం సైతం అత‌డి కుటుంబానికి బీమా సొమ్మును అంద‌జేస్తారు. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించినప్పుడు, హామీ ఇవ్వబడిన మొత్తాన్ని మరియు బోనస్‌‍ని నామినీకి అంద‌జేస్తారు. సంపూర్ణ జీవిత ప్లాన్‌లు ప్రత్యేకించి ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్‌లను అందించవు, ఎందుకంటే పాలసీకి ఎలాంటి నిర్దిష్ట టర్మ్ లేదు. ప్రత్యేకించి, సంపూర్ణ జీవిత పాలసీ యొక్క నగదు విలువ (ప్రీమియంపై ఆర్జించిన వడ్డీ లేదా బోనస్) ప్రాఫిట్ పాలసీతో కూడిన ఎండోమెంట్ కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. అంతకుమించి, సంపూర్ణ జీవిత పాలసీ ప్రీమియం దీర్ఘకాలానికి చెల్లించబడుతుంది (ఎందుకంటే బీమా కవరేజ్ టర్మ్ దీర్ఘకాలం ఉంటుంది). బీమా చేయించుకున్న వ్యక్తికి ప్రీమియం చెల్లింపు టర్మ్‌ని ఎంచుకునే స్వేచ్చ ఉంటుంది.

Read more about: insurance, policy
English summary

What is the need of insurance and what are types of insurance policies

Types of Life Insurance One Must know Having a life insurance will financially cover your family in cases such as death, disability, accident, retirement etc.
Story first published: Tuesday, November 29, 2016, 13:04 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC