For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌నం నివ‌సిస్తున్న ఇంటికి బీమా అవ‌స‌ర‌మా?

చాలా మందికి సొంత ఇంటి కొనుగోలు అనేది జీవిత స్వ‌ప్నం. ఎందుకంటే ఇది ఆర్థికపరమైన దిలాసాతో పాటు మానసికంగానూ కాస్త ఉప‌శ‌మ‌నాన్ని క‌ల్పించే చోటు. అందుకే ఎలాంటి ఉప

|

చాలా మందికి సొంత ఇంటి కొనుగోలు అనేది జీవిత స్వ‌ప్నం. ఎందుకంటే ఇది ఆర్థికపరమైన దిలాసాతో పాటు మానసికంగానూ కాస్త ఉప‌శ‌మ‌నాన్ని క‌ల్పించే చోటు. అందుకే ఎలాంటి ఉపద్రవాలొచ్చినా.. హాని కలగకుండా దీన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం.. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు మొదలైన వాటి నుంచి ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు హై సెక్యూరిటీ తాళాలు, అగ్నిమాపక సాధనాలు లాంటివి ఉన్నప్పటికీ .. ఇవి నష్టాల నుంచి పూర్తి ర‌క్ష‌ణ ఇస్తాయ‌ని చెప్ప‌లేం. ఈ నేప‌థ్యంలో ఇంటిని కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

సంపూర్ణ ర‌క్ష‌ణ‌ కోసం

సంపూర్ణ ర‌క్ష‌ణ‌ కోసం

ఇంటితో పాటు ఇంట్లోని ఇత‌ర విలువైన వస్తువులకు కూడా వర్తించేలా గృహ బీమా పాలసీ తీసుకోవడం మంచిదని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తున్నారు. సమగ్రమైన గృహ బీమా పాలసీ తీసుకుంటే సాధ్యమైనంత మేర న‌ష్టాల‌ను తగ్గించుకోవచ్చు. ప్ర‌మాదానికి జ‌రిగిన ఆర్థిక న‌ష్టాన్ని కొంత‌మేర‌కైనా బీమా కంపెనీ చెల్లిస్తుంది. సాధారణంగా గృహ బీమా పాలసీలతో ఈ కింది అనూహ్య వైపరీత్యాల నుంచి ఇంటికి బీమా రక్షణ పొందవచ్చు.

ఈ త‌ర‌హా ప్రకృతి వైపరీత్యాలకు కవరేజీ ల‌భిస్తుంది

ఈ త‌ర‌హా ప్రకృతి వైపరీత్యాలకు కవరేజీ ల‌భిస్తుంది

ఆయా ప్రాంతాలను బట్టి.. వరదలు, భూకంపాలు, తుపానుల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇంటికి తీవ్ర నష్టాన్ని కలగజేయొచ్చు. వాతావరణం పెను మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో ఇలాంటి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయి. ఉత్త‌రాది రాష్ట్రాల్లో వ‌రదలు, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు లాంటివి ఇందుకు ఉదాహరణలు. ద‌క్షిణాదిలో సైతం ఇటీవ‌ల చెన్నై న‌గ‌రంలో భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా పెద్ద స్థాయిలో జ‌రిగిన ఆస్తి న‌ష్టాన్ని మ‌నం చూశాం. కాబట్టి ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించేదిగా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజీ ఉండాలి.

అగ్నిప్రమాదాలు..

అగ్నిప్రమాదాలు..

చిన్న నిప్పు రవ్వ సైతం భారీ అగ్నిప్రమాదానికి దారి తీస్తుంది. ఫలితంగా భ‌ర్తీ చేయ‌లేని నష్టాలకు గురికావ‌చ్చు. గృహ బీమా పాలసీ ఉంటే ఇంటితో పాటు ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా అగ్నిప్రమాదాల నుంచి ఆర్థిక‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ లభిస్తుంది.

అల్లర్లు.. టైజం..

అల్లర్లు.. టైజం..

ప్రకృతి వైపరీత్యాలను పక్కన పెడితే కొన్నాళ్ల క్రితం దాకా టైజం లాంటి విపత్తుల ఉదంతాలు కొంత తక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో అల్లర్లు, టైజం, దోపిడీలు, దొంగతనాల ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి నుంచి కూడా ఇంటికి రక్షణ కల్పించగలదు గృహ బీమా పాలసీ. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉంటున్న పక్షంలో గృహానికి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా.. ఇంట్లోని ఇతరత్రా విలువైన వస్తువుల కోసం బీమా పాలసీ తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఆభరణాలు లాంటివన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి.

నివాసం ఎక్క‌డైనా...

నివాసం ఎక్క‌డైనా...

ప్రస్తుతానికైతే.. ఈ ర‌క‌మైన పాల‌సీల‌న్నీ ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అయితే, నివాసం ఉంటున్నది నగరంలోనైనా వేరే ఎక్కడైనా కూడా ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగితే న‌ష్టాన్ని తప్పని పరిస్థితి. అందువ‌ల్ల గృహ బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఈ పాలసీలకు కట్టాల్సిన ప్రీమియంలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఉదాహరణకు ఇల్లు, ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా దాదాపు రూ. 5,00,000 బీమా హామీ మొత్తం క‌లిగి ఉండే పాలసీ.. అత్యంత తక్కువగా రూ. 1,500 స్థాయి ప్రీమియంకు కూడా లభ్యమవుతుంది. ఇంత తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీ లభిస్తున్నప్పటికీ .. హోమ్ ఇన్సూరెన్స్‌కి ఇంకా సరైనంత ప్రాచుర్యం లభించడం లేదు. చాలా మంది వేసుకునే ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగినంత చోటు దక్కడం లేదు.

పాలసీ ఎంచుకోవడమెలా?

పాలసీ ఎంచుకోవడమెలా?

గృహ బీమా పాలసీ తీసుకోవడానికి ముందుగా కొన్ని అంశాలు సరిచూసుకోవాలి. మీ నివాసానికి ఎంత బీమా, ఏ రకమైన కవరేజీ అవసరమన్నది ఒకసారి లెక్కవేసుకోవాలి. దీర్ఘకాలానికి కవరేజీ ఎంచుకుంటే కట్టాల్సిన ప్రీమియంలలో ఒకోసారి 50 శాతం దాకా కూడా రాయితీ లభించవచ్చు. అలాగే ప్రతి సారీ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సిన సమస్యా తప్పుతుంది.

బీమా ఉంటే భ‌రోసా

బీమా ఉంటే భ‌రోసా

చెన్నైలో వచ్చిన వరదలు గుర్తున్నాయి కదా! అందరికీ గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాఠాలు నేర్పాయవి. ప్రాణాలు పోవడమే కాకుండా.. అంచనాలకు అందని ఆస్తి నష్టం సంభవించింది. కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు మన దేశంలో అధికంగానే సంభవిస్తున్నాయి. వరదలు కావచ్చు... భూకంపాలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కొనాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు నష్టాలను నివారించేందుకు ముందే తగిన విధంగా సిద్ధం అవ్వాలి. ఇంటినీ, ఇంట్లో ఉన్న వస్తువులనూ బీమా చేయించి, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి.

Read more about: home insurance insurance
English summary

మ‌నం నివ‌సిస్తున్న ఇంటికి బీమా అవ‌స‌ర‌మా? | What is the need of insurance for a Home

What are the requirements to purchase a property insurance policy?The proposer of the policy should first and foremost have an interest in the assets being proposed for insurance, i.e. he/she should stand to lose financially in the event of loss or damage to such assets.
Story first published: Tuesday, November 15, 2016, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X