For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు (ఫోటోలు)

క్రెడిట్ కార్డుతో ఎడాపెడా కొనుగోళ్లు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతారనేది చాలా మంది భయం. అయితే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే క్రెడిట్ కార్డుతో బోలెడు చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.

By Nageshwara Rao
|

క్రెడిట్ కార్డు తీసుకొమంటే చాలా మంది మాకొద్దు బాబోయే అంటుంటారు. క్రెడిట్ కార్డుతో ఎడాపెడా కొనుగోళ్లు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతారనేది చాలా మంది భయం. అయితే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే క్రెడిట్ కార్డుతో బోలెడు చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.

క్రెడిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన వెంటనే రిజిస్టర్ చేసుకున్న మీ ఫోన్ నెంబర్‌కు దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో కొనుగోలు కోసం క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తే, ఆ లావాదేవీ నిర్ధారణ కోసం క్రెడిట్ కార్డు కంపెనీలు ఫోన్ చేసి మరీ అడుగుతున్నాయి. ఇందుకు మీరు అవునని చెబితేనే ఆ లావాదేవీ పూర్తి అవుతుంది.

దీనివల్ల ఎవరైనా కేటుగాడు మీ క్రెడిట్‌ కార్డు కొట్టేసి ఏదైనా భారీ లావాదేవీలు జరిపితే వెంటనే చెల్లింపులు ఆపేసేందుకు అవకాశం ఉంటుంది. అదే లావాదేవీని డెబిట్‌ కార్డు ద్వారా చేస్తే ఈ అవకాశం ఉండదు. ఒకవేళ మీ క్రెడిట్ కార్డు బ్లాక్‌ చేయించేందుకే చాలా సమయం పడుతుంది. ఈ విధంగా డెబిట్‌ కార్డుతో పోలిస్తే క్రెడిట్‌ కార్డులతో చాలా ప్రయోజనాలున్నాయి.

 డెబిట్ కార్డు కంటే బెటర్

డెబిట్ కార్డు కంటే బెటర్

ఒకే ప్రాంతంలో ఉండే వారికి డెబిట్ కార్డు సరిపోతుంది. అదే ఆఫీసు పనిమీద, సొంత పనుల మీద ఎపుడూ ఇతర ప్రాంతాల్లో పర్యటించే వారి దగ్గర మాత్రం క్రెడిట్‌ కార్డు ఉండే మంచిది. క్రెడిట్‌ కార్డు జేబులో ఉంటే హోటల్స్‌ బుకింగ్‌ నుంచి కార్‌ రెంటల్స్‌ వరకు క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లించవచ్చు. విదేశాల్లో ప్రయాణించేటపుడు మాత్రం క్రెడిట్‌ కార్డు మరింత ప్రయోజనకరం. ఎందుకంటే అన్ని చోట్లా క్రెడిట్‌ కార్డు చెల్లుబాటు అయినంత తేలికగా డెబిట్‌ కార్డు చెల్లుబాటు కాదు.

 రివార్డులు, క్యాష్‌ బ్యాక్‌లు

రివార్డులు, క్యాష్‌ బ్యాక్‌లు

క్రెడిట్ కార్డులపై జరిపే లావాదేవీలపై ఇచ్చే రివార్డుల్లో చాలా మార్పులు వచ్చాయి. కాలానికి అనుగుణంగా ఏ క్రెడిట్‌ కార్డు కంపెనీ ఎక్కువ రివార్డుల ఇస్తే ఆ కంపెనీ క్రెడిట్‌ కార్డులను వినియోగదారులు ఎంచుకుంటున్నారు.

 ఎక్కువ విమాన ప్రయాణం

ఎక్కువ విమాన ప్రయాణం

తరచూ విమాన ప్రయాణం చేసే వారికి క్రెడిట్‌ కార్డు ఒక అద్భుతమైన వరం. క్రెడిట్‌ కార్డులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్రెడిట్‌ కార్డులు ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ కార్డుల ద్వారా విమాన టిక్కెట్ల చార్లీలు చెల్లిస్తే.. ప్రతి టిక్కెట్‌పైనా అదనంగా మరికొన్ని మైళ్లదూరం ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని రివార్డులుగా ఇస్తున్నాయి.

 రేటింగ్‌ పెరుగుతుంది

రేటింగ్‌ పెరుగుతుంది

సరైన పరపతి రేటింగ్‌ లేకపోతే ప్రస్తుతం బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు. మీ క్రెడిట్‌ రేటింగ్‌ను బట్టే మీకు లోన్ ఇవ్వొచ్చా? లేదా? నిర్ణయిస్తాయి. మీరు ఏదైనా క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తూ, చెల్లింపులు సక్రమంగా చెల్లిస్తుంటే మీ పరపతి పెరగుుతుంది. ఎపుడైనా రుణం అవసరమై బ్యాంకుకు వెళితే సిబిల్‌ దగ్గర రికార్డు అయిన మీ పరపతి చరిత్ర ఆధారంగానే మీకు లోన్ వస్తుంది.

 జాగ్రత్తలూ అవసరమే..

జాగ్రత్తలూ అవసరమే..

క్రెడిట్‌ కార్డులతో ప్రయోజనాలు పొందాలంటే కొన్ని జాగ్రత్తలూ పాటించాలి. ముఖ్యంగా ఒకేసారి మీరు చెల్లించగల శక్తికి మించి ఖర్చు చేయడం మంచిది కాదు. జేబులో డబ్బులు ఉన్నా ఒకేసారి నగదు పెట్టి ఇంతకు మించి కొనలేను, అనుకునే వారు క్రెడిట్ కార్డు కొనుగోళ్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

 బకాయిల పెండింగ్‌ వద్దు...

బకాయిల పెండింగ్‌ వద్దు...

క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన బిల్లల బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించడం మంచిది. అసలు బకాయిలు ఉంచొద్దు. బకాయిలు పేరుకుపోతే మీరు క్రమంగా ఆర్ధిక మందగమనంలోకి వెళ్లిపోతారు. సిబిల్‌ దగ్గర మీ పరపతి రేటింగ్‌ బాగుండాలంటే క్రెడిట్‌ కార్డు ద్వారా మీకు లభించిన పరపతి మొత్తంలో 30 శాతానికి మించి ఉపయోగించుకోవద్దు.

English summary

క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు (ఫోటోలు) | what are the benefits of credit card

what are the benefits of credit card if you use wisely
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X