For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానుకూల ధోరణి: ఐటీ స్టాక్స్‌పై ఫండ్స్ వెల్లువ

By Nageswara Rao
|

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై కొత్త ధోరణి ఊపందుకుంది. ఐటీ కంపెనీల స్టాక్స్‌పై మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) సానుకూల ధోరణితో కొనసాగుతున్నాయి. జనవరిలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ. 43,115 కోట్లను సాప్ట్‌వేర్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టారు.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

గత సెప్టెంబరులో ఐటీ కంపెనీల స్టాక్స్ విభాగంలోకి మళ్లించిన రూ.43,053 కోట్లు పెట్టుబడులే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. ఇక డిసెంబరులో రూ.41,998 కోట్లను, గతేడాది జనవరిలో రూ.35,463 కోట్లను మ్యూచువల్ ఫండ్స్ ఈ షేర్ల విభాగంలో పెట్టుబడులు రూపంలో పెట్టారు.

అయితే ఇటీవల రూపాయి క్షీణిస్తుండటం ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశం కావడమే ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు పెట్టుబడికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ కంపెనీల ఆదాయంలో 85 శాతం వాటా ఎగుమతులు ద్వారానే వస్తుందన్న సంగతి తెలిసిందే.

Mutual funds bullish on IT stocks; exposure at record high of Rs 43000 cr

భారత్‌లో ఎక్కువగా ఎగుమతులు అమెరికా, బ్రిటన్‌కే ఎక్కవగా ఉంటాయి. అందువల్ల రూపాయితో పోలిస్తే డాలర్ ఎంతగా బలపడితే ఐటీ కంపెనీల లాభం మరింతగా పెరుగుతుంది. గతేడాదితో పోలిస్తే సాప్ట్‌వేర్ కంపెనీలు స్టాక్స్‌పై ఫండ్ మేనేజర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.

మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?

ఇదిలా ఉంటే బ్యాంకుల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అధికంగా ఐటీ రంగానికే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. జనవరిలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లల్లో రూ.78,644 కోట్లను ఫండ్‌ల రూపంలో మళ్లించారు. ఆ తర్వాత ఔషధ షేర్ల విభాగంలోకి రూ.33,785 కోట్లు, వాహన షేర్ల విభాగంలోకి రూ.26,653 కోట్లు, ఆర్థిక సేవల విభాగంలోకి రూ.23,131 కోట్లను మళ్లించారు.

English summary

సానుకూల ధోరణి: ఐటీ స్టాక్స్‌పై ఫండ్స్ వెల్లువ | Mutual funds bullish on IT stocks; exposure at record high of Rs 43000 cr

Mutual Funds remain bullish on software companies, raising their allocation to all time high of over Rs 43,115 crore last month in view of the weakening rupee, which increases IT exporters’ profitability.
Story first published: Friday, February 19, 2016, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X