For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ సంస్కరణలు: బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకీ పెరిగిపోతున్న బంగారం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు బులియన్ బోర్డును ఏర్పాటు చేయాలని, బంగారం లావాదేవీల కోసం స్టాక్ మార్కెట్ తరహాలో స్పాట్ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది.

ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రి వర్గం సోమవారం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం ప్రతిపాదిత గోల్డ్ రిఫార్మ్స్ అమలు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయమై చర్చించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ప్రతినిధులు, బులియన్ వాటాదారులు, ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ అధికారులు, వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు.

 బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

బంగారం వ్యాపారాన్ని మరింత పారదర్శకంగా, సులభతరంగా రూపొందించడమే లక్ష్యంగా 2016-17 వార్షిక బడ్జెట్‌లో రానున్న కొత్త ప్రతిపాదనలపై అరుణ్ జైట్లీ వీరితో చర్చించనున్నారు. దీంతో పాటు ముడి బంగారం దిగుమతిపై సుంకాలను విధించే అంశాన్ని కూడా పరిశీలించనున్నట్లు బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

వాస్తవానికి గోల్డ్ రిపైనింగ్ కంపెనీలు బంగారానికి ఎటువంటి ఎక్సైజ్ సుంకాలనూ చెల్లించకుండా దిగుమతులు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని మరింత కఠినం చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభఉత్వం ఉంది. దిగుమతి సుంకాన్ని విధించే అంశంలో పలు గోల్డ్ కంపెనీలు, బులియన్ సంస్థలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.

 బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ మోనటైరైజేషన్ పథకంపై ప్రజలకు మరితం అవగాహన కల్పించేందుకు మరికొన్ని రాయితీలను ప్రకటించాలని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర సమీపంలో నిర్మించతలపెట్టిన గిప్ట్ సిటీ (గోల్డ్ సెజ్)పైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బంగారంపై తీసుకోనున్న సంస్కరణల విషయంలో ఐఐఎమ్ అహ్మాదాబాద్ అందించిన నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

English summary

గోల్డ్ సంస్కరణలు: బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్ | Centre finalising gold policy reforms, Budget rollout likely

The Centre has called a meeting on Monday to finalise a proposal to set up a National Bullion Board, an umbrella body to implement gold policies and reforms, as well as a gold spot exchange.
Story first published: Monday, February 22, 2016, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X