For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో ఇంటిపై పెట్టుబడి: ప్రయోజనాలెన్నో (ఫోటోలు)

By Nageswara Rao
|

మనలో చాలామంది చేతిలో నగదు ఉన్నప్పుడు ఎక్కువగా షేర్లపైనో లేక బాండ్లపైనో పెట్టుబడులు పెడుతున్నారే తప్ప రియల్ ఎస్టేట్, బంగారం వైపు పెద్దగా చూడటం లేదు. అయితే దీర్ఘకాలంలో సంపదను పెంచుకునే విషయానికొస్తే, రెండో ఇంటిపై పెట్టుబడి పెడితే మంచిందంటున్నారు ఆర్ధిక నిపుణులు.

ముఖ్యంగా వేతన జీవులకు అందుబాటులో ఉండే మెరుగైన సాధనాల్లో ఇది కూడా ఒకటని అంటున్నారు. గత యాభై ఏళ్లుగా వివిధ నగరాలు, కాల వ్యవధులను బట్టి (కనీసం 10 ఏళ్లు) చూస్తే దేశీయంగా రియల్ ఎస్టేట్ ధరలు వార్షికంగా 15-20 శాతం మేర పెరుగుతూ వస్తున్నాయి.

అధిక మొత్తంలో లాభాలు రియల్టీనే

అధిక మొత్తంలో లాభాలు రియల్టీనే

తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినా, అవసరమైన సందర్భాల్లో కాస్త అధిక మొత్తాన్ని అందించగలిగేది రియల్టీ రంగమే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం ఇలా ఇతరత్రా ఏ సాధనమైనా సరే మన పర్సులో నుంచి పూర్తి మొత్తం పెట్టి కొనుక్కోవాల్సిందే. అదే రెండో గృహం విషయానికొస్తే.. ఇంటి ధరలో సుమారు 20 శాతం మాత్రమే మన జేబు నుంచి కట్టి, మిగతా మొత్తాన్ని హౌసింగ్ లోన్ తీసుకుని కట్టొచ్చు. ఈ రుణానికి సగటున కట్టే వడ్డీ రేటు పదిశాతం మేర ఉంటుంది. అయితే ఆ ఇంటిపై వచ్చే అద్దె, వడ్డీలో దాదాపు 3 శాతందాకా ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు

పన్ను ప్రయోజనాలు

రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టడం వల్ల పలు పన్ను పరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రెండో ఇంటిపై వచ్చే అద్దెను గృహ కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీ భాగాన్ని కట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ కట్టే వడ్డీ కన్నా చేతికొచ్చే అద్దె తక్కువగా ఉన్న పక్షంలో మీ ఆదాయంలో దాన్ని ‘గృహ ఆస్తిపరంగా వచ్చిన నష్టం' కింద చూపించుకుని, పన్నులపరమైన వెసులుబాటు పొందవచ్చు.

స్ధిరాస్తిని మాటిమాటికి అమ్మడం కుదరదు

స్ధిరాస్తిని మాటిమాటికి అమ్మడం కుదరదు

మిగతా వాటితో పోలిస్తే ఇంటి విషయంలో తీసుకునే నిర్ణయం బిన్నంగా ఉంటుంది. ఇంటిని మాటిమాటికి కొనడం, అమ్మేయడం వంటివి జరగదు. సాధ్యమైనంతవరకూ దీని ప్రయోజనాలను దీర్ఘకాలంలో పొందాలనే ఆలోచనే ఉంటుంది. రేట్లు భారీగా పెరిగిపోయాయని అమ్మేసేయాలనే అత్యాశ గానీ లేదా రేట్లు పడిపోయాయని చింతించడం గానీ ఎక్కువగా ఉండదు. కాబట్టి దీన్ని మానసికంగా ఆందోళన కలిగించే పెట్టుబడిగా భావించలేం. నిశ్చింతనిచ్చే పెట్టుబడి సాధనంగా చెబుతాం. ఇంటిని అద్దెకిస్తే మనం కట్టే గృహ రుణం నెలసరి వాయిదాల్లో కొంత మొత్తం అద్దె రూపంలో సమకూరుతుంది కనుక ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.

రెండో ఇంటిని కొనే ముందు ఆలోచించుకోవాల్సిన విషయాలు

రెండో ఇంటిని కొనే ముందు ఆలోచించుకోవాల్సిన విషయాలు

రెండో ఇంటిని కొనుక్కునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలికంగా ఈఎంఐలు కట్టుకుంటూ పోవడం మీకు సాధ్యపడుతుందా? లేదా? అన్నది చూసుకోవాలి. తరచూ బదిలీలను ఎదుర్కునే ఉద్యోగాలు కొంతమేరకు ఇబ్బంది కలగవచ్చు. అంతే కాదు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసేటప్పుడు డెవలపర్ గురించి, ట్రాక్ రికార్డు గురించి, ఇతరత్రా న్యాయపరమైన అంశాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

English summary

రెండో ఇంటిపై పెట్టుబడి: ప్రయోజనాలెన్నో (ఫోటోలు) | Know the tax implications of second house

Are you planning to buy a second house? While you need to happy that you are adding another asset in your portfolio, you also need to do lots of home work.
Story first published: Thursday, January 28, 2016, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X