For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

By Nageswara Rao
|

సొంతిటి సాకారం అనేది ప్రతి సామాన్యుడి కల. ఇందులో భాగంగా సొంతిల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే మరికొందరు ఈ రెండింటినీ బేరీజు వేసి ఏదైతే తమకు అధిక ప్రయోజనం కలిగిస్తుందో విశ్లేషించుకుని నిర్ణయం తీసుకుంటారు.

ఈ సమయంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం. సాధారణంగా ఎవరైనా ఇంటి కోసం తీసుకున్న రుణంపై చెల్లించే నెలసరి వాయిదా, తాము చెల్లిస్తున్న అద్దె రెండింటినీ సరిపోల్చుకుంటూ ఉంటారు.

వారు చెల్లిస్తున్న ఈఎంఐ కన్నా చెల్లిస్తున్న నెలవారీ అద్దె తక్కువ స్థాయిలో ఉంటే ఎక్కువ మంది అద్దె ఇంటికే ప్రధాన్యం ఇస్తారు. అయితే సుదీర్ఘ కాలం అద్దె ఇంట్లో నివాసం ఉండటం ఇష్టం లేని వారు మాత్రం సొంతిల్లుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకోసం ఐదేళ్లు కాలపరిమితిని అనుకుంటే, ఐదేళ్ళ లోపు మారే అవకాశం ఉంటే ఇల్లు కొనడం కన్నా అద్దెకు ఉండడమే మంచిది.

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇంటి కొనుగోలు విషయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఉద్యోగ స్థిరత్వం. మీరు పని చేస్తున్న సంస్థ ఎంత స్థిరమైనది, ఎలాంటి ఆటుపోట్లను తట్టుకుని మనుగడ సాగించగల స్థితి ఉన్నదా పరిశీలించాలి. ఈ ప్రశ్నలన్నింటికీ అవును అని సమాధానం వస్తే మీరు దీర్ఘకాలిక పెట్టుబడిగా ఇల్లు నిస్సందేహంగా కొనుగోలు చేయవచ్చు. ప్రతికూలమైన సమాధానం వస్తే మాత్రం సొంతింటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

సాధారణంగా పట్టణాల్లో ఈ రోజుల్లో సొంతిల్లు కొనాలంటే రుణం తీసుకోక తప్పదు. రుణానికి వెళ్లాలంటే ఎంతో కొంత మార్జిన్‌ మనీ చేతిలో పెట్టుకోవాలి. ఇల్లు కొనే ముందు నిర్మాణ నాణ్యత ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం ఇస్తాయి. అంటే 10 నుంచి 20 శాతం మీరు మార్జిన్‌ మనీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్జిన్‌ మనీ కూడా ఎక్కడో అక్కడ అప్పు తెచ్చే పరిస్థితి ఉంటే ఇల్లు కొనకపోవడమే మంచిది.

 ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇంటి రుణానికి మార్జిన్‌ మనీ కట్టిన తర్వాత కూడా మీ చేతిలో ఎంత నిల్వ ఉందన్నది కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. ఎంత కొత్తిల్లు అయినా ఒక్కోసారి అనుకోని మరమ్మతులు రావచ్చు. అపార్ట్‌మెంట్ల వంటివైతే కామన్‌గా ఉండే వసతులపై ఎప్పటికప్పుడు అదనంగా ఎంతో కొంత ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఆ భారం భవనంలో నివశిస్తున్న వారందరి పైనా సమానంగా పడుతుంది.

 ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా?

ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము నుంచి మార్జిన్‌ మనీ చెల్లిస్తే అంతవరకు ఆ సొమ్ముపై మీకు వస్తున్న వడ్డీ ఆదాయం నిలిచిపోతుంది. ఒకపక్క వడ్డీ ఆదాయం ఆగిపోగా, మరోపక్క ఇంటి రుణానికి ఈఎంఐల భారం మీద పడడం వల్ల ఇలాంటి పనులకు అదనపు వనరులు సమకూర్చుకోవడం కష్టం అవుతుంది. ఇల్లు కొనాలనుకునే ముందు ఇలాంటి లెక్కలు ఒకటికి రెండు సార్లు వేసుకుని సొంతిల్లు కొనుగోలు చేయడం మంచిది.

English summary

ఇల్లు: కొనడమా లేక అద్దెకు ఉండటం మంచిదా? | Is Buying a Home a Good Investment?

Is Buying a home a good investment.? We’ve always heard from the our parents and older relatives, and, of course, real estate professionals that buying a home is a good investment that always helps to secure your future.
Story first published: Monday, January 4, 2016, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X