For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి ధరను పెరగాలంటే ఏం చేయాలి?

By Nageswara Rao
|

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అలాంటి ఇల్లు కొనేటప్పుడు కాస్త తక్కువకు రావాలి. అమ్మేటప్పుడు బాగా ఎక్కువ ధర పలకాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ విలువ తగ్గింది ఉంది కాబట్టి, మనం కోరుకున్న ధర రావడం కష్టమే. అయితే ప్రణాళిక పరంగా ఖర్చుపెడితే ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి విక్రయం పెద్ద కష్టమేమీ కాదు.

ఇంటిని ఆకర్షణీయంగా తయారు చేయటం ఎలానో తెలుసుకుందాం? సాధారణంగా ఇల్లు ఉన్న ప్రాంతం, ఖర్చులు, స్థలం ఇవే ఇంటి ధరను ప్రధానంగా నిర్ణయిస్తాయి. ఇంటి ధరపై అత్యధిక ప్రభావం చూపించేది నిజానికి మార్కెట్ వాల్యూనే. మార్కెట్ ధర ఎక్కువగా ఉంటే మీ ఇల్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది.

 రెట్టింపు విలువ ఇలా?

రెట్టింపు విలువ ఇలా?

గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం కూడా ఉండాలని, అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ఈ మధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులు కూడా ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది.

చిక్కులు ఉండకూడదు

చిక్కులు ఉండకూడదు

మీ ఇంటికి ఎన్ని అనుకూలతలున్నా సరే, చిన్నపాటి తేడా ఉంటే కొనుగోలుదారులు ముందుకురారు. ముఖ్యంగా లీగల్ సమస్యలు. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి.

భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి

భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి

ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిని అమ్మేటప్పుడు దగ్గర్లో షాపింగ్, వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి షాపింగ్ మాల్స్, మార్కెట్ లాంటి వాటిపై ఆసక్తిని కనబరుస్తుంటారు. కాబట్టి ఇల్లు కొనేవారికి ఇవి కీలకమవుతాయి.

ఏ ప్రాంతంలో ఇల్లు

ఏ ప్రాంతంలో ఇల్లు

మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉండాలనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

ఇంట్లో వసతులు చాలా కీలకం

ఇంట్లో వసతులు చాలా కీలకం

ఇంటి విలువను రెండు రకాలుగా నిర్ణయిస్తారు. మొదటిది ప్రస్తుతం నివసించడానికి అన్ని సౌకర్యాలన్నీ ఉన్నాయా? రెండోది ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? లేదా అని చూస్తారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందని మాత్రం మరిచిపోవద్దు.

English summary

ఇంటి ధరను పెరగాలంటే ఏం చేయాలి? | How to Increase the Value of Your Home

If you’re planning to renovate your home, you may already be asking yourself these very questions. But when it comes to increasing your home’s appraisal value, the answer to them isn’t always a resounding yes.
Story first published: Monday, November 16, 2015, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X