For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

By Nageswara Rao
|

ప్రస్తుతం భారత్ స్టాక్ మార్కెట్లు వారంలో ఒకరోజు లాభాల్లో గడిస్తే, మిగిలిన ఆరు రోజులు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో నాణ్యమైన షేర్లు తక్కువ ధరకే లభిస్తాయి. ఈక్విటీల్లో నేరుగా మదపు చేయలేని వారు మ్యూచువల్ ఫండ్స్‌ వైపు దృష్టి సారిస్తే మంచిది.

‘‘అందరూ అమ్మేటప్పుడు కొనండి, అదే విధంగా అందరూ కొనేటప్పుడు అమ్మండి'' అన్నది ఈక్విటీ మార్కెట్ సూత్రం. పెట్టుబడికి విభిన్న మార్గాలను ఎంచుకుని వనరుల విభజనను సరైన క్రమంలో షేర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లలో క్రమశిక్షణ పెంచుతుంది. మ్యూచువల్‌ ఫండ్స్ అనుసరించే ఈ సూత్రం భిన్న విభాగాలకు పెట్టుబడులను విస్తరించడం ద్వారా పెట్టుబడిదారుల రిస్క్‌ను గణనీయంగా తగ్గించుతుంది.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

మ్యూచువల్ ఫండ్స్‌లో ముఖ్యమైనవి బ్యాలెన్స్‌డ్ ఫండ్లు. సాధారణంగా బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు తాము సేకరించిన నిధుల్లో 65 శాతం ఈక్విటీల్లోను, 35 శాతం డెట్‌ ఉపకరణాల్లోను మదుపు చేస్తాయి. ఈ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలో అసెట్‌ అలొకేషన్‌ లేదా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్ కీలకమైనవి.

 రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

మార్కెట్‌లో షేర్లు చౌకగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం, మార్కెట్స్ పెరుగుతున్న సమయంలో అమ్మడం లాంటివి మ్యూచువల్ ఫండ్ల స్కీమ్‌ల నిర్మాణం. దీని వల్ల దీర్ఘకాలిక రాబడులు ఆకర్షణీయంగా ఉంటాయి. విలువ ఆధారంగా ఈక్విటీ, డెట్‌ మధ్య నిష్పత్తి ఆటోమేటిక్‌గా మారే వెసులుబాటు అంతర్గత నిర్మాణంలోనే ఉన్నందు వల్ల మానవ తప్పిదాలకు కూడా ఆస్కారం ఉండదు.

 రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

65 శాతం నిధులు ఈక్విటీల్లో మదుపు చేస్తున్నందు వల్ల ఇవి ఈక్విటీ ఫండ్ల తీరులోనే పన్ను ప్రయోజనాలు అందిస్తాయి. ఈ యూనిట్లను ఏడాదికి పైగా హోల్డ్‌ చేసినట్టయితే పన్ను మినహాయింపు ఉంటుంది. స్వల్పకాలంలో రీడీమ్‌ చేస్తే మాత్రం స్వల్పకాల క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్లకు మాత్రం పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి

భారత స్టాక్‌ మార్కెట్‌ దీర్ఘకాలంలో మెరుగ్గానే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని శ్రేణుల ఇన్వెస్టర్లు అన్ని విభాగాల్లోను కొనుగోళ్లు చేయడం సరైన వ్యూహం. మీ రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఈక్విటీ లేదా ఫిక్స్‌డ్‌ ఆదాయం అందించే సాధనాల్లో ఏది ఎం చుకోవాలన్నా మ్యూచువల్‌ ఫండ్లు చక్కని సాధనంగా నిలుస్తాయి. ఈక్విటీ మార్కెట్లో తొలిసారిగా అడుగు పెట్టాలని భావించే వా రు, ఒక మోస్తరు రిస్క్‌ భరించే వారికి ఇ లాంటి ఫండ్‌లు సర్వత్రా అనుకూలమైనవి.

English summary

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి | Here's how to maximise post-tax returns with mutual funds

Some ideas on how to maximise post-tax returns by investing in mutual funds.
Story first published: Tuesday, September 29, 2015, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X