For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్ నుంచి అటల్ పెన్షన్ యోజన... ప్రత్యేకలు

By Nageswara Rao
|

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5,000 వరకు ఫించను అందుకునే అవకాశం ఉంటుంది.

ఫించను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్ధ పరిధిలో నడిచే జాతీయ ఫించను పథకం కింద పెన్షన్ పొందుతున్న వారితో పాటు ఇతరత్రా చట్టబద్ధ సమాజిక భద్రత పథకాల్లో సభ్యులు కానివారందరి పైనా ఈ పథకం దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

ఈ పథకానికి అర్హులు కావడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ట వయసు 40 ఏళ్లు. లభ్దిదారులు కనీసం 20 సంవత్సరాలు ఏపీవై పథకంలో కొనసాగాల్సి ఉంటుంది. ప్రభుత్వం తన వంతుగా ఏడాదికి లబ్ధిదారులు కట్టిన మొత్తంలో 50 శాతం లేదా రూ. 1000(వీటిలో ఏది తక్కువైతే అది) ఐదేళ్ల పాటు జమ చేస్తుంది.

A Look At The Atal Pension Yojana And What it Means For Pensioners

ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. ఈ పథకంలో కట్టే ప్రీమియాన్ని బట్టి రిస్క్ కవర్ రూ. 2 లక్షలు వరకు ఉంటుంది. పథకం పూర్తైన తర్వాత కూడా కావాలనుకుంటే 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు.

వీటితో పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. వార్షిక ప్రీమియం రూ. 12. ఈ పథకం కింద ప్రమాదాల్లో మరణించినా, పూర్తి అంగవైకల్యం పొందినా లబ్ధిదారులకు రూ. 2 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి రూ. లక్ష పరిహారం అందుతుంది.

అటల్ పెన్షన్ యోజన పథకం కింద ప్రీమియం లెక్కించడం ఎలా?

ప్రస్తుతం స్వావలంబన్ పథకం కింద ఫించను ప్రయోజనాన్ని పొందుతున్న వారంతా ఈ స్కీములోకి మారాల్సి ఉంది. ఏపీవై పథకం కింద నెలకు కనీసం రూ. 1000 నుంచి రూ. 5000 వరకు ఫించను వస్తుంది.

Age on contributing to the Yojana Years an Individual Has Contributed Rough Calculation of Monthly Contribution (in Rs) Monthly Pension That A Subscriber Receives (in Rs) Return To The Family (in Rs )
18 42 210 5000 8.5 lakhs
20 40 248 5000 8.5 lakhs
25 35 376 5000 8.5 lakhs
30 30 577 5000 8.5 lakhs
35 25 902 5000 8.5 lakhs
40 20 1454 5000 8.5 lakhs

English summary

జూన్ నుంచి అటల్ పెన్షన్ యోజన... ప్రత్యేకలు | A Look At The Atal Pension Yojana And What it Means For Pensioners

Keeping in mind the fact that the country does not have a robust social security mechanism in terms of monetary benefits one receives when one is old, the Union Budget 2015-16 has offered an interesting option.
Story first published: Monday, March 2, 2015, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X