For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిబిల్ క్రెడిట్ స్కోరు తెలుసుకోండి? (ఫోటోలు)

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ప్రస్తుత రోజుల్లో రుణం తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోరు, చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉండటం తప్పని సరిగా మారింది. క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ రిపోర్టునే నివేదికగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.

క్రెడిట్ రిపోర్టు, క్రెడిట్ స్కోరు లాంటి వాటి గురించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్)పై ఆధారపడున్నాయి. ఈ సంస్ధ నిర్వహించే రికార్డుల్లో డిఫాల్టర్లని తేలితే... రుణం పొందాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా కష్టతరం. ఈ నేపథ్యంలో సిబిల్ రికార్డుల్లో డిఫాల్టర్ అవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

సిబిల్ సంస్ధ చేసే పనేంటి?
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే సమాచారాన్ని బట్టి వ్యక్తుల క్రెడిట్ రికార్డును రూపొందిస్తుంది. సాధారణంగా క్రెడిట్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేని వారిని బ్యాంకులు డిఫాల్టర్లుగా పరిగణిస్తారు. అంతేకానీ, సిబిల్ దగ్గర ప్రత్యేకంగా డిఫాల్టర్ల జాబితా అంటూ ఉండదు. నిజం చెప్పాలంటే సిబిల్ ఇలాంటి ప్రత్యేక జాబితా అంటూ ఏమీ తయారు చేయదు.

 బ్యాంకులకు వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లిస్తున్నప్పుడు?

బ్యాంకులకు వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లిస్తున్నప్పుడు?

బ్యాంకులకు భారీ మొత్తం బకాయిపడినప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ మంచింది. వన్ టైమ్ సెటిల్ చేసుకున్న తర్వాత ఎలాంటి బకాయిలు లేవని బ్యాంకు ఒక లెటరు ఇచ్చినంత మాత్రాన అకౌంట్ క్లోజ్ అయినట్లు కాదు. ఈ ఓటీఎస్ విషయం మీ క్రెడిట్ రిపోర్టులో సెటిల్డ్ అనో ‘పోస్ట్ (డబ్ల్యూఓ) సెటిల్డ్' అని కనిపిస్తుంది. ఇది మీ క్రెడిట్ హిస్టరికి ఒక మచ్చ. కనుక, సెటిల్ చేసుకోవడం కన్నా పూర్తి స్థాయి క్లోజర్ కోసం ప్రయత్నించండి.

ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశం

ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశం

కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కొన్నిసార్లు రీషెడ్యూలింగ్‌కి వెళ్తుంటారు. దీనికి బ్యాంకులు అంగీకరిస్తాయి. బ్యాంకులు ఈ రుణాన్ని ‘రీస్ట్రక్చర్డ్' పేరిట సిబిల్‌కి సమాచారాన్ని పంపిస్తుంది. ఇలాంటివి కూడా క్రెడిట్ రికార్డుకు వ్యతిరేకమైన అంశాలు. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడే తక్కువ ఈఎంఐలు ఉండేలా కాస్త దీర్ఘకాలానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది.

 మొత్తం డబ్బు కట్టి క్లియర్ అయ్యేలా చూడండి

మొత్తం డబ్బు కట్టి క్లియర్ అయ్యేలా చూడండి

సాధారణంగా మనం కట్టాల్సిన రుణం ఎంత తక్కువ కట్టామనేది అసలు విషయం కాదు, మొత్తం రుణం కట్టామా లేదా అనేదే ముఖ్యం. మొత్తం బకాయి ఎంత ఉందన్నది తెలుసుకుని, సాధ్యమైనంత వరకూ అసలు మొత్తాన్ని చెల్లించాలి. లేకపోతే ఇది కూడా క్రెడిట్ రిపోర్టులో మీ ఖాతాకే వర్తిస్తుంది.

క్రెడిట్ కార్డు అకౌంట్ రద్దు చేయడం వల్ల?

క్రెడిట్ కార్డు అకౌంట్ రద్దు చేయడం వల్ల?

సిబిల్ రిపోర్టుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో క్రెడిట్ కార్డు అకౌంట్‌ను క్లోజ్ చేయడం. ప్రస్తుతం వాడుకలో ఉన్న క్రెడిట్ కార్డు అకౌంటును మూసేయడం అంటే.. బకాయిలు చెల్లించేసి, కార్డును క్లోజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు చాలా మంది. కానీ ఇది సరైన పద్దతి కాదు.

క్రెడిట్ కార్డు అకౌంట్ రద్దు చేయడం వల్ల?

క్రెడిట్ కార్డు అకౌంట్ రద్దు చేయడం వల్ల?

నిజంగా క్రెడిట్ కార్డు అకౌంట్ రద్దు చేయడం అనేది మీ వద్ద లెటర్ రూపంలో ఉండాలి. కాబట్టి మొత్తం చెల్లింపులు చేసిన తర్వాత అకౌంట్‌ను క్లోజ్ చేయదల్చుకుంటే బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీకి తెలియజేయాలి. ఖాతా మూసివేసినట్లు వాటి దగ్గర్నుంచి అధికారికంగా నో డ్యూస్ లెటర్ తీసుకోవాలి.

English summary

సిబిల్ క్రెడిట్ స్కోరు తెలుసుకోండి? (ఫోటోలు) | Simple Ways to Improve Your Credit Score in India

It is a common practice these days to go for a complete health check up quarterly or half yearly. But have you ever considered checking up your credit health? Being physically and mentally sound is no wonder a prerequisite for a happy life.
Story first published: Monday, February 16, 2015, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X