For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతికి ఇంటికెళ్తున్నారా? మీ కోసం హోటళ్లలో FASTag!

|

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంటి ముందు రంగవళ్లికలు, గంగిరెద్దుల ఆట, కోళ్ల పందేలకు వంటి ప్రత్యేక సంబరాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో. ఈ పండుగ కోసం దాదాపు అందరూ తమ తమ ఇళ్లకు వెళ్తారు. అప్పుడు రోడ్లపై రద్దీ పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రద్దీని గుర్తించిన జాతీయ రహదారుల సంస్థ అందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.

FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్: ఇలా చేయండి...FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్: ఇలా చేయండి...

ప్రత్యేక FASTag విక్రయ కేంద్రాలు

ప్రత్యేక FASTag విక్రయ కేంద్రాలు

హైదరాబాద్ నుంచి చాలామంది తమ తమ సొంతూళ్లకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు, బెంగళూరుకు, వరంగల్ వంటి వివిధ ప్రాంతాలకు ఎక్కువ మంది వెళ్తారు. కాబట్టి నేషనల్ హైవేలలో వేచి ఉండే అవసరం లేకుండా లేదా వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రత్యేక FASTag విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు

పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు

దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హవైవేలలో టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ వసూలు కోసం FASTag ద్వారా ట్రాన్సాక్షన్ జరిగే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం టోల్ ప్లాజా గేట్‌లలో 25% హైబ్రిడ్ పేరుతో నగదు రూపంలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. జనవరి 15వ తేదీ నుంచి రెండు వైపులా ఒక్కో మార్గాన్ని మాత్రమే నగదు వసూళ్ల కోసం కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ సంక్రాంతి పండుగ సమయంలో రెండు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు ఉంటాయి.

హోటళ్లలో FASTag విక్రయాలు

హోటళ్లలో FASTag విక్రయాలు

ఇలాంటి (సంక్రాంతి) సమయంలో ఒకే మార్గంలో నగదు వసూలు విధానం అమలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడువును మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే సమయంలో టోల్ గేట్స్ వద్ద రద్దీని నియంత్రించేందుకు FASTag వినియోగం పెంచేందుకు నేషనల్ హైవేలలోని హోటల్స్‌లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

సుదూరం ప్రయాణించే వారు హోటల్‌కు వెళ్లి తినడం లేదా సేదతీరడం చేస్తారు. అలాంటి సమయంలో వారికి FASTagపై అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఐదు హోటళ్లు, బెంగళూరుకు, వరంగల్ వెళ్లే మార్గాలలో రెండు హోటళ్ల చొప్పున FASTag విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

English summary

సంక్రాంతికి ఇంటికెళ్తున్నారా? మీ కోసం హోటళ్లలో FASTag! | You can buy FASTags in national highway hotels

FASTags are prepaid rechargeable tags for toll collection that allow automatic payment deduction from the FASTag, they are normally affixed on the windscreen of your vehicle.
Story first published: Thursday, January 2, 2020, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X