For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా సహా అందరికీ సవాల్: చమురు ధరలు షాకయ్యేలా తగ్గనున్నాయా.. కారణాలివే!

|

కరోనా మహమ్మారి విజృంభన, రష్యా - సౌదీ అరేబియా ధరల పోరు నేపథ్యంలో చమురు ధరలు పడిపోతున్నాయి. చమురు ధరలు ఇటీవలి కాలంలో పద్దెనిమిదేళ్ళ కనిష్టానికి పడిపోయాయి. సౌదీ, రష్యా మధ్య చమురు యుద్ధం నేపథ్యంలో ఉత్పత్తి నిలుపుదల చేయలేదు. మరోవైపు, కరోనా కారణంగా ప్రపంచం స్తంభించిపోవడంతో డిమాండ్ తగ్గి, ధరలు పడిపోయాయి. ముడి చమురుకు క్రమంగా డిమాండ్ తగ్గుతోందని న్యూబెర్జర్ బెర్మాన్ ఎనర్జీ ఎనలిస్ట్ జెఫ్ విల్ అన్నారు.

కరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదు

ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గడంతో..

ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గడంతో..

చమురు ఉత్పత్తి పెరగడంతో పాటు డిమాండ్ తగ్గింది. దీంతో ఇప్పటికే నిల్వలు భారీగా ఉన్నాయని, మరింత చమురు ఉత్పత్తి జరిగితే నిల్వ చేసేందుకు స్థలం కూడా లేదని అంటున్నారు. స్టోరేజ్ ఫెసిలిటీ, రిఫైనరీలు, టెర్మినల్స్, షిప్స్, పైప్‌లైన్లు త్వరలో సామర్థ్యాన్ని చేరుకుంటాయని అంటున్నారు. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం 1998 నుండి ఇప్పటి వరకు ఇలా జరగలేదు.

20 డాలర్లకు పడిపోయింది

20 డాలర్లకు పడిపోయింది

చమురు ధరలు ఇటీవల ఏకంగా బ్యారెల్ 20 డాలర్లకు పడిపోయింది. సరఫరాతో పోలిస్తే డిమాండ్ చాలా వేగంగా పడిపోతోందని అంటున్నారు. అసలు చమురు ఉత్పత్తిదారులు ఆపరేటింగ్ లాభాలను కనీసం రాబట్టుకోగలరా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చమురు నిల్వకు కూడా స్థలం త్వరగా తగ్గిపోతోందని అంటున్నారు.

అసంతృప్తితో క్లోజ్..

అసంతృప్తితో క్లోజ్..

చమురు ధరల పతనం నేపథ్యంలో జనవరిలోని గరిష్టస్థాయి ధర నుండి మూడింట రెండు వంతుల దర పడిపోయింది. ప్రస్తుతం అమెరికా ఆయిల్ కంపెనీలు అసంతృప్తితోనే చమురు ఉత్పత్తిని మూసివేసే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవల సౌదీ - రష్యా మధ్య చమురు ఉత్పత్తిపై ఒప్పందం కుదరలేదు. దీంతో ఉత్పత్తిని పెంచాలని, తద్వారా ధరలు తగ్గించాలని సౌదీ నిర్ణయించింది. కరోనా సహా వివిధ కారణాలతో చమురు ధరలు జీరోకు పడిపోయినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యోమింగ్ క్రూడ్ గ్రేడ్ ఇటీవల బ్యారెల్ర‌కు నెగటివ్ 19 సెంట్లకు బిడ్ వేసిందట. ఈ స్థాయికి పడిపోవడం వింతే. నిల్వ సామర్థ్యం తగ్గిపోయిన నేపథ్యంలో తొలుత తమ వద్ద ఉన్న దానిని అమ్మివేయాలి.

బలమైన అమెరికా కంపెనీల ఉత్పత్తి తగ్గింపు

బలమైన అమెరికా కంపెనీల ఉత్పత్తి తగ్గింపు

ఏప్రిల్, మే నెలల్లో పెద్ద ఉత్పత్తి కంపెనీలు క్లోజ్ అవుతాయని కూడా అంటున్నారు. పాత, తక్కువ ఉత్పత్తి చేసే చమురు బావులను తొలుత క్లోజ్ చేస్తారని రిస్టాడ్ ఎనర్జీ వెల్లడించింది. అంతేకాదు, అమెరికాకు చెందిన బలమైన ఆయిల్ కంపెనీలు కూడా ఖర్చులు వెనక్కి తీసుకుంటాయని, ఉత్పత్తిని తగ్గిస్తాయని అంటున్నారు. ఉదాహరణకు చెవ్రోన్ గత వారం 30 శాతం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెర్మియన్ ఇప్పటికే 20 శాతం ఉత్పత్తిని తగ్గించింది. చమురు పరిశ్రమ చివరకు రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోల్పోయే అవకాశముందని గోల్డ్‌మాన్ సాచ్ తెలిపింది.

అప్పుడు ధరలు పెరిగే ఛాన్స్

అప్పుడు ధరలు పెరిగే ఛాన్స్

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. కరోనా వైరస్ భయాందోళనతో ప్రపంచం స్తంభించిపోయి ప్రస్తుతం చమురు ధరలు భారీగా పడిపోయాయి. డిమాండ్ పడిపోయి త్వరలో చమురు నిల్వలకు స్థలం లేకుండా పోయే పరిస్థితి. అయితే విమానయానం తిరిగి ప్రారంభమయ్యాక ఇంధనం కొనుగోలు ప్రారంభమవుతుంది. అమెరికా విమాయాన కంపెనీలు తిరిగి గ్యాసోలైన్‌ను కొనుగోలు చేస్తాయి. కానీ ఆ సమయానికి చమురు పరిశ్రమ ఇదివరకు ఉన్నప్పటిలా ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే చమురు బావులు క్లోజ్ అవుతాయి. అప్పుడు చమురు కొరత ఏర్పడి ధరలు వచ్చే ఏడాది నాటికి 55 డాలర్లకు చేరుకోవచ్చునని గోల్డ్‌మాన్ సాచ్ కమోడిటీస్ హెడ్ జెఫ్రీ క్యూరీ అన్నారు. ఇది చివరకు ద్రవ్యోల్భణ చమురు సరఫరా ఆందోళలను సృష్టిస్తుంది.

English summary

world could soon run out of space to store oil, prices fall more

The world's thirst for oil has evaporated. Highways are empty. Planes are grounded. Factories are dark. The unprecedented collapse in oil demand has sent crude crashing to 18-year lows.
Story first published: Wednesday, April 1, 2020, 21:58 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more