For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడిసిన్ డెలివరీ సేవల్లోకి ముకేశ్ అంబానీ..? నెట్ మెడ్స్ పై కన్నేసిన అపర కుబేరుడు!

|

రిలయన్స్ జియో తో పూర్తిగా కొత్త వ్యాపార విభాగంలోకి ప్రవేశించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ... టెక్నాలజీ ఆధారిత వ్యాపారాల్లో వేగంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే జియో మార్ట్ ను పూర్తిస్థాయి ఈ కామర్స్ కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న అంబానీ... తాజాగా మెడిసిన్ ఆన్లైన్ డెలివరీ సేవలను కూడా అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఈ రంగంలో కొంత నిలదొక్కుకున్న ఒక కంపెనీని కొనుగోలు చేసి, దానిని జియో తో అనుసంధానించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో కూరగాయలు, పండ్లు, పాల నుంచి ఎలక్ట్రానిక్స్ సహా మెడిసిన్ వరకు వినియోగదారులకు అవసరమైన అన్ని సరుకులు, వస్తువులను ఒకే వేదికగా డెలివరీ చేయాలని సంకల్పిస్తున్నారు. ఎటూ కంపెనీ వద్ద రూ లక్ష కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. కాబట్టి ఒక కంపెనీని కొనుగోలు చేయాలంటే ఒక చిటికె వేస్తే సరిపోతుంది. ముకేశ్ అంబానీ కూడా ప్రస్తుతం ఇప్పుడు అదే చేస్తున్నారు.

రిలయన్స్ 4 నెలల లాభం ఆ దేశాల జీడీపీకి సమానం: 140 దేశాల కంటే ఈ కంపెనీల లాభాలు ఎక్కువ!

చెన్నై కంపెనీ పై కన్ను...

చెన్నై కంపెనీ పై కన్ను...

ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ఒకరు ఐన ముకేశ్ అంబానీ... చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ కంపెనీ నెట్ మెడ్స్ ను కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం రిలయన్స్ సుమారు 120 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 900 కోట్లు) వెచ్చించనుంది. అయితే ఈ డీల్ ను రిలయన్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఇండియన్ ఈ కామర్స్ రంగంలో కేవలం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మాత్రమే నిలదొక్కు కున్నాయి. మిగితా వన్నీ సైడ్ అయిపోయాయి. ఇకపై రిలయన్స్ మెడిసిన్ డెలివరీ విభాగంలోకి అడుగుపెడితే అక్కడ కూడా అదే జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ తో పోటీ ని తట్టుకోవటం సాధ్యం కాదు కాబట్టి, ఈ రంగంలో ఉన్న సంస్థలు ప్రత్యామ్నాయ వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

రూ 20,000 కోట్ల మార్కెట్...

రూ 20,000 కోట్ల మార్కెట్...

భారత్ లో ఔషధాలను ఆన్లైన్ లో కొనుగోలు చేయటం అనేది కాస్త లేటుగానే ప్రారంభమయింది. మామూలు ప్రొడక్టులను కొనుగోలు చేసేప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించే వినియోగదారులు మెడిసిన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. కానీ నగరాల్లో ఇటీవల ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ కి డిమాండ్ ఊపందుకుంది. పైగా ఈ రంగంలోని కంపెనీలు మెడికల్ షాప్స్ తో పోల్చితే అధిక డిస్కౌంట్ అందిస్తుండటంతో రెండు విధాలుగా కలిసొస్తోంది. దీంతో ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో 2023 నాటికి ఈ ఫార్మసీ రంగం 2.7 బిలియన్ డాలర్లు ( రూ 20,250 కోట్ల )మార్కెట్ గా ఆవిర్భవించనుందని అంచనా వేస్తున్నారు. 2019 లో ఈ మార్కెట్ పరిమాణం కేవలం 360 మిలియన్ డాలర్లు మాత్రమే కావటం గమనార్హం. మరో వైపు ప్రస్తుతం కేవలం 43 లక్షల కుటుంబాలు ఆన్లైన్ ఫార్మసీ సేవలు పొందుతుండగా... 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 6 కోట్లకు చేరుకోనుందని అంచనా. ఇంత ఆకర్షణీయంగా ఉంది కాబట్టే... రిలయన్స్ ఈ రంగంపై దృష్టి సారిస్తోందని అంటున్నారు.

కన్సాలిడేషన్ దిశగా...

కన్సాలిడేషన్ దిశగా...

రిలయన్స్ ఇండస్ట్రీస్... నెట్ మెడ్స్ ను కొనుగోలు చేస్తున్న తరుణంలో ఆన్లైన్ ఫార్మసీ రంగం కన్సాలిడేషన్ దిశగా పయనిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముంబై కి చెందిన ఫార్మ్ ఈజీ అనే సంస్థ కూడా బెంగళూరు కు చెందిన తన పోటీ సంస్థను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉందని ఈటీ తన కథనంలో వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 120 మిలియన్ డాలర్ల నుంచి 150 మిలియన్ డాలర్లు గా ఉంటుందని భావిస్తున్నారు. వెస్ట్రన్ ఇండియా లో ఫార్మ్ ఈజీ మెరుగైన మార్కెట్ వాటాను దక్కించుకుంది. అలాగే బెంగళూరులో మెడ్ లైఫ్ కూడా తన స్థానాన్ని పటిష్ట పరచుకొందని తెలిసింది. అందుకే వీటి కలయిక సరైన నిర్ణయమే అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ ఫార్మసీ విభాగంలో 1 ఎంజీ కూడా చాలా పటిష్టంగా ఉంది. మెడ్ ప్లస్ గ్రూప్ కూడా ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ రంగంలో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. మరో రెండు మూడేళ్ళలో ఈ రంగంలో కూడా 2-3 మాత్రమే బలమైన కంపెనీలు మనుగడ సాగిస్తాయని అంచనా వేస్తున్నారు.

English summary

With Reliance eyeing Netmeds deal, ePharmacy in for consolidation

India's online pharmacy space is expected to see a wave of consolidation, triggered by Reliance Industries' reported acquisition of Chennai-based Netmeds, with global investors also lining up to back the winners in the fast-growing sector.
Story first published: Tuesday, August 4, 2020, 13:05 [IST]
Company Search