EPF Interest Rate: ఈసారి ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరగదా?
రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అత్యున్నత నిర్ణయాత్మక మండలి సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ సమావేశం మార్చి నెలలో జరగనుంది. ఈ భేటీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ మొత్తాలపై చెల్లించాల్సిన వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటారు. అసోం రాజధాని గౌహతిలో ఈ సమావేశం జరగనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది అంతే మొత్తం నిర్ణయించే అవకాశముందా అని కేంద్రమంత్రిని ప్రశ్నించగా, ఆదాయ అంచనాలపై ఆధారపడి నిర్ణయం ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతానికి వడ్డీ రేటు స్థిరంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.సాధారణంగా వడ్డీ రేటుపై సీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుంది. ఆ మేరకు వడ్డీని జమ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే వడ్డీ మొత్తాలు జమ అయ్యాయి.

వివిధ సంవత్సరాల్లో వడ్డీ రేటడు ఇలా ఉంది. 2012-13లో 8.5 శాతం, 2013-14లో 8.75 శాతం, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2018-19లో 8.65 శాతం, 2019-20లో 8.5 శాతం, 2020-21లో 8.5 శాతంగా ఉంది.