For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'కస్టమర్ల మొబైల్ ఖర్చు రూ.300కు పెరగాలి': ఇది సాధ్యమేనా, కారణాలేమిటి?

|

టెలికం రంగంలో కస్టమర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం మరింత పెరగాలని, ఇది రూ.300కు చేరుకోవాలని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల అన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) ఈ మేరకు చేరితేనే ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న టెలికం రంగం పునరుత్తేజానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మిట్టల్ ఆమెను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రూ.699తో బజాజ్ ఫిన్ అదిరిపోయే హనీమూన్ హాలీడే కవరేజ్

తక్కువ ధరకే సేవలు పొందుతున్నారు..

తక్కువ ధరకే సేవలు పొందుతున్నారు..

ఇప్పటికే దేశానికి చెందిన మొబైల్ కస్టమర్లు తక్కువ ధరకే సేవలు పొందుతున్నారని, భవిష్యత్తులోని ఇదే తరహా సేవలు పొందేందుకు ఆసక్తి కనబరుస్తారని సునీల్ మిట్టల్ అన్నారు. ఓ వైపు కస్టమర్ల ప్రయోజనాలు, మరోవైపు పెట్టుబడులు సమకూర్చుకోవడం కంపెనీలకు సమ ప్రాధాన్య అంశాలని చెప్పారు.

సగటు రూ.300కు చేరాలి

సగటు రూ.300కు చేరాలి

ప్రస్తుతం కొందరు వినియోగదారులు రూ.100 వినియోగిస్తుండగా, మరికొందరు రూ.450 నుంచి రూ.500 చెల్లిస్తున్నారన్నారు. ఈ సగటు కనీసం రూ.300కు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాలని కోరారు. వాయిస్ కాల్స్, డేటా విషయంలో ఫ్లోర్ ప్రైస్ (కనీస ధర)ను నిర్ణయించాలని ఇదివరకు ఆయన ట్రాయ్‌ని కోరారు.

రూ.200 ఆర్పు చేరేనా?

రూ.200 ఆర్పు చేరేనా?

పెట్టుబడులు, కస్టమర్ల మధ్య సమతౌల్యత అవసరమని సునీల్ మిట్టల్ చెప్పారని, కానీ వచ్చే నాలుగేళ్లలో కూడా ఎయిర్‌టెల్ ఆర్పు రూ.200 కూడా సాధించలేదని నిపుణులు అంటున్నారు. 2022-23 నాటికి ఎయిర్ టెల్ ఆర్పు రూ.191 నుంచి రూ.196 వరకు ఉంటుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, 6వ తేదీ నుంచి జియో తమ టారిఫ్స్ పెంచాయి. ప్రీపెయిట్ టారిఫ్స్‌ను 15-50 శాతం మధ్య పెంచాయి. సుప్రీం కోర్టులో AGR దెబ్బ అనంతరం టారిఫ్స్ పెంచాయి. AGRలో దాదాపు 75 శాతంగా ఉన్న వడ్డీ, జరిమానాలపై పునఃసమీక్షించాలని టెల్కోలు సుప్రీం కోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఆర్పు రూ.200 చేరుకోవడానికి ఎన్నో అవరోధాలు ఉన్నాయని అంటున్నారు.

భారతీయ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు...

భారతీయ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు...

ముఖ్యంగా భారత్‌లో అధిక ధర విషయంలో సున్నితమైన మార్కెట్, ప్రపంచంలోనే చౌక టారిఫ్స్ ఉన్నప్పటికీ భారతీయ కస్టమర్లు ఇప్పటికే ప్రపంచ సగటు కంటే టెలికం సేవలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఓ రీసెర్చ్‌లో తేలింది. ఆర్థిక సంవల సంస్థ జెఫిరీస్ ప్రకారం భారత్‌లో ఆర్పు పర్ క్యాపిటా 1.1 శాతం కాగా, ప్రపంచవ్యాప్తంగా 0.9 శాతంగా ఉంది. అంటే ప్రపంచ సగటు కంటే మన వద్ద ఎక్కువగా ఉంది.

డేటా వాయిస్ సెగ్మెంట్స్‌కు డిమాండ్

డేటా వాయిస్ సెగ్మెంట్స్‌కు డిమాండ్

భారత్‌లో డేటా, వాయిస్ సెగ్మెంట్స్‌కు డిమాండ్ ఉంది. మరింత టారిఫ్ పెరిగితే కస్టమర్లు తమ వినియోగాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఏ టెలికం సంస్థ అయినా మరింత టారిఫ్ పెంచే పరిస్థితుల్లో కస్టమర్లు తమ ప్లాన్స్ మార్చుకుంటారని భావిస్తున్నారు.

English summary

Why Sunil Mittal's target to earn Rs 300 monthly from each customer seems like a tall order?

Recently when Sunil Mittal, the chairman of third-largest telecom company Bharti Airtel, met with the Finance Minister Nirmala Sitharaman for pre-budget consultation, he was sounding fairly optimistic.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more