For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan పొందేందుకు అర్హతలేంటి: తక్కువ వడ్డీలో పర్సనల్‌ లోన్‌‌ పొందడం ఎలా..? మార్గాలేంటి

|

ఉద్యోగస్తులు చాలా వరకు బ్యాంకు రుణాలపైనే ఆధారపడతారు. ఆ విషయానికొస్తే బిజినెస్ చేసే వ్యక్తులు కూడా లోన్‌ లేనిదే వారి వ్యాపారం ప్రారంభించే సాహసం చేయరు. మరి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు బ్యాంకులు రుణాలు అంత తొందరగా ఎలా మంజూరు చేస్తున్నాయి. అసలు బ్యాంకుల నుంచి లేదా ఇతర ఆర్థిక వ్యవస్థల నుంచి రుణాలు పొందాలంటే ఉండాల్సిన అర్హతలేంటి అనేది ఒకసారి తెలుసుకుందాం.

లోన్ పొందేందుకు అర్హతలు

లోన్ పొందేందుకు అర్హతలు

బ్యాంకుల నుంచి ముందుగా రుణాలు పొందాలనుకుంటే బ్యాంకర్లు చెక్ చేసేది కస్టమర్ యొక్క సిబిల్ స్కోర్. సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటేనే రుణాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా మంజూరు చేస్తారు. ఆ తర్వాత డెబ్డ్ సర్వీస్ రేషియోను చూస్తారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి జీతం రూ.లక్ష ఉందనుకుంటే... అప్పటికే ఆ వ్యక్తి ఏమైనా రుణాలు తీసుకున్నాడా.. ఒకవేళ తీసుకుని ఉంటే అది సక్రమంగా సరైన సమయంలో ఈఎంఐలు చెల్లిస్తున్నాడా లేదా అనేది చెక్ చేస్తారు.

సిబిల్ స్కోరు బాగున్నా సరే... ఈ డెబ్ట్‌ సర్వీస్ రేషియో సరిగ్గా లేకుంటే లోన్ మంజూరు చేయరు. ముందుగా లోన్‌ కోసం వెళ్లే ముందు మనం ఒకసారి సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే అసలు లోన్ అవసరమా.. లోన్ తీసుకుంటే సకాలంలో ఈఎంఐలు కట్టే పరిస్థితి ఉందా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతున్నారు.

లోన్ నిజంగా అవసరం అనుకుంటే...

లోన్ నిజంగా అవసరం అనుకుంటే...

ముందుగా మన నెల ఖర్చులు అన్నీ పోను ఎంత మిగులుతుంది.. అది తీసుకున్న లోన్‌కు చెల్లించాల్సిన ఈఎంఐలు కట్టేంతలా సరిపోతుందా అనేది విశ్లేషించుకుని అంతా బాగుంటేనే లోన్‌ తీసుకునేందుకు ముందడుగు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకర్లు అయితే సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ మరియు డెబ్ట్ సర్వీస్ రేషియోను చూస్తారు.

దీంతో పాటు ఉద్యోగస్తుని చరిత్ర కూడా చూస్తారు. అంటే తరచూ ఎన్నిసార్లు ఎన్ని కంపెనీలు మారాడు, తన నివాసంను ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి మార్చారు అనేది కూడా బ్యాంకర్లు చూస్తారు. ఇవి కూడా ఎక్కువగా ఉంటే లోన్ తిరస్కరించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 LAS అంటే ఏంటి..?

LAS అంటే ఏంటి..?

లోన్లు పలు రకాలుగా ఉన్నాయి. పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హౌజ్‌లోన్ లాంటివి ఉన్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇక్కడ పర్సనల్ లోన్ గురించి చెప్పాలంటే వ్యక్తిగత అవసరాల కోసం అయితే పర్సనల్ లోన్‌ మాత్రమే ఉంది. ఇలా కాకుండా మరో మార్గం కూడా ఉంది. ఎప్పుడైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అందులో కొంత మొత్తం అంటే ఉదాహరణకు రూ.20 లక్షలు కనుక ఫండ్ ఉంటే దానిపై రుణం పొందే అవకాశం ఉంటుంది. దీన్నే మనం LAS (లోన్ అగనెస్ట్ సెక్యూరిటీ) అంటున్నాం.

 LAS పై గరిష్టంగా ఎంత లోన్ మంజూరు చేయొచ్చు

LAS పై గరిష్టంగా ఎంత లోన్ మంజూరు చేయొచ్చు

సెక్యూరిటీ అనేది మ్యూచవల్ ఫండ్స్ రూపంలో అయినా ఉండొచ్చు లేదా స్టాక్స్ రూపంలో అయినా ఉండొచ్చు. LAS పై బ్యాంకులు గరిష్టంగా రూ.20 లక్షలు రుణం మంజూరు చేయొచ్చు. ఇది ఆర్బీఐ నిబంధనల మేరకు ఉంటుంది. ఇప్పుడు స్టాక్స్ లేదా మ్యూచవల్ ఫండ్స్‌పై లోన్ రావాలంటే అక్కడ ఫండ్ రూ.40 లక్షలు ఉంటేనే బ్యాంకులు రూ.20 లక్షలు గరిష్టంగా రుణం మంజూరు చేస్తుంది. అంటే 50 శాతం మేర రుణం మంజూరు చేస్తుంది. ఇక స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి రూ.5 లక్షలు అవసరం అనుకుంటే... తన ఫండ్ రూ.10 లక్షలు ఉంటేనే రూ. 5లక్షలు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు కొన్ని నిబంధనలు పాటిస్తాయి.

స్టాక్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌ను సంతకం చేసి కస్టమర్ బ్యాంకు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఇక ఆ స్టాక్స్‌ కస్టమర్ పేరుపైనే ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సర్వాధికారాలు బ్యాంకు చేతిలోకి వెళ్లిపోతాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే బంగారం బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణం ఎలాగయితే పొందుతామో... ఇక్కడ కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నాం.

LAS ఎలా పనిచేస్తుంది...

LAS ఎలా పనిచేస్తుంది...

ఇక బ్యాంకుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయ్యాక కస్టమర్‌కు బ్యాంకు అధికారులు ఒక ఓడీ అకౌంట్‌ను తెరుస్తారు. అందులో రూ.5 లక్షలు జమ చేసి ఇస్తారు. మనకు ఎంత డబ్బులు అవసరమో అంతే వాడుకుంటే దానిపైన మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఐదురోజులకు రూ. 1 లక్ష తీసుకున్నామంటే ఆ ఐదు రోజులకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే అందులోని డబ్బు అవసరాలకు వినియోగిస్తేనే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ కూడా బ్యాంకు నుంచి మరో బ్యాంకు పై ఆధారపడి ఉంటుంది. స్టాక్స్ లేదా మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి వ్యక్తిగత లోన్ కావాలంటే ఆ స్టాక్స్‌ను అమ్మకానికి పెట్టకుండా.. బ్యాంక్ నుంచి లోన్ పొందండ ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాదు ఆ ఫండ్ అలానే ఉంచితే ఈరోజు రూ.10 లక్షలుగా ఉంటే మరో రెండేళ్ల తర్వాత అది పెరిగి రూ. 12 లక్షలో లేక రూ.13 లక్షలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని అమ్మకపోవడం చాలా బెటర్ అని చెబుతున్నారు. బ్యాంకు నుంచి పొందిన రుణంను తిరిగి చెల్లించాక బ్యాంకు అధీనంలో ఉన్న స్టాక్స్ డాక్యుమెంట్స్ మీకు తిరిగి ఇస్తారు.

English summary

What is the eligibility for attaining bank loan,what is LAS: Check here

CIBIL score and Debt service Ratio are the main components that the banks look in for a person who require loan.Based on these components loan will be disbursed.
Story first published: Thursday, July 15, 2021, 13:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X