ఈ వారం బంగారం ధరలు ఎంత తగ్గాయంటే, వెండి రూ.2000కు పైగా డౌన్
ముంబై: పసిడి ధరలు గతవారం చివరి మూడు రోజుల్లో భారీగా క్షీణించాయి. వెండి ధరలు ఢిల్లీ మార్కెట్లో ఏకంగా రూ.2,000 కంటే పైన పిపోయి రూ.67,419 వద్ద ముగిసింది. బంగారం ధరలు రూ.350 వరకు తగ్గి, రూ.45,600 దిగువన ముగిశాయి. గతవారం ప్రారంభంలో స్వల్పంగా పెరిగినప్పటికీ, చివరి మూడు సెషన్లలో తగ్గాయి. అంతకుముందు రూ.50,000 వద్ద ఉన్న పసిడి ఇప్పుడు కొనుగోలుదారులకు మంచి ఊరట ఇచ్చింది. ఆగస్ట్ 2020 ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి రూ.10,000కు పైగా తక్కువగా ఉంది.

రూ.45,800 దిగువన ముగిసిన పసిడి
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర ఈ వారం చివరి సెషన్లో రూ.46,000 దిగువకు పడిపోయింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.474.00 (1.03%) తగ్గి రూ.45,767.00 వద్ద ముగిసింది. రూ.46,340.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,689.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,611.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,500 తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.492.00 (1.96%) తగ్గి రూ.45,903 వద్ద ముగిసింది. రూ.46,413 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,800 వద్ద గరిష్టాన్ని, రూ.45,780 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1800 తగ్గిన పసిడి
వెండి ధరలు భారీగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,800.00 (-2.60%) తగ్గి రూ.67,475.00 వద్ద ముగిసింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,400.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,505.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.1,697.00 (-2.40%) తగ్గి రూ.68,979.00 వద్ద ముగిసింది. రూ.70,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,388.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,554.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దారుణంగా పడిపోయాయి. ఏకంగా 1800 డాలర్ల దిగువకు పడిపోయాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 42.95 (2.42%) డాలర్లు తగ్గి 1732.45 డాలర్ల వద్ద ముగిసింది. ఈ సెషన్లో 1,715.05 - 1,773.75 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 4.28 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.969 (3.51%) డాలర్లు తగ్గి 26.668 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.180 - 27.570 డాలర్ల మధ్య కదలాడింది.