For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందుకే అటు వెళుతున్నాం: స్విగ్గి ఫౌండర్ శ్రీ హర్ష

|

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్న స్విగ్గి... ఇప్పుడు సరికొత్త ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఫుడ్ డెలివరీ లో నెలకొన్న తీవ్ర పోటీకి తోడు నష్టాల నుంచి లాభాల వైపు మళ్లాలంటే తప్పనిసరిగా కొత్త వనరులపై కన్నేయాల్సిందేనని గుర్తించింది. అందుకే, ఇకపై తమ మొత్తం ఆదాయంలో కనీసం 30% మేరకు ఇతరత్రా మార్గాల నుంచి సంపాదించాలని లక్ష్యంగా నిర్దేశించుకోంది. ఈ విషయాన్నీ స్విగ్గి ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీ హర్ష మాజేటి వెల్లడించారు. ది ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2019 గాను ఇంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకొన్న ఆయన... ఆ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ తెలిపారు. భారీ డిస్కౌంట్స్ ఇస్తే గానీ నడవని ఫుడ్ డెలివరీ లోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి దారుల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. అయితే, తాము ఇకపై కూడా ప్రయోగాలు కొనగిస్తామని శ్రీ హర్ష చెప్పారు.

నిరుద్యోగులకు స్విగ్గీ 'లక్షల' శుభవార్త: కానీ ఈ బెనిఫిట్ ఉండదు!

తగ్గిన నష్టాలు...

తగ్గిన నష్టాలు...

ఫుడ్ డెలివరీ విభాగంలో దేశంలో కేవలం రెండే రెండు కంపెనీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ రేసులో మిగిలాయి. ఒకటి జొమాటో కాగా, రెండోది స్విగ్గి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎంత భారీ డిస్కౌంట్స్ ఇచ్చేందుకైనా ఇవి వెనుకాడటం లేదు. అందుకే ఈ రెండు కంపెనీలు సగటున నెలకు 30 - 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ 210 కోట్ల నుంచి రూ 280 కోట్ల వరకు) డిస్కౌంట్స్ పై ఖర్చు చేస్తున్నాయి. అంటే ఒక్కో కంపెనీ సగటున నెలకు రూ 250 కోట్ల మేరకు చేతి చమురును వదిలించుకుంటున్నాయి. అయితే, ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని, తాము కొంత మేరకు నష్టాలు తగ్గించుకోగలిగామని స్విగ్గి సీఈఓ శ్రీ హర్ష తెలిపారు. అయితే, ఏ విధంగా నష్టాలను తగ్గించుకొన్నారో వెల్లడించలేదు. అలాగే ఎంత మొత్తం నష్టాలు తగ్గింది కూడా తెలుపలేదు. కాగా, జొమాటో మాత్రం నెలకు డిస్కౌంట్స్ కోసం వెచ్చించే మొత్తాన్ని 20 మిలియన్ డాలర్ల కు (సుమారు రూ 140 కోట్లు) తగ్గించుకున్నామని ప్రకటించింది.

రెండేళ్లలో లాభాలు...

రెండేళ్లలో లాభాలు...

ఇప్పటి వరకు తీవ్ర నష్టాలను చవి చూసిన స్విగ్గి ... ఇకపై మాత్రం లాభాల ఆర్జనపై ఫోకస్ పెంచింది. తమకు ఒకటి - రెండేళ్లలోనే లాభాలు రాగలవని స్విగ్గి ఫౌండర్ శ్రీ హర్ష ఆశాభావం వ్యక్తం చేసారు. ఫుడ్ డెలివరీ విభాగంలో తాము చాలా అనుభవాన్ని గడించామని, త్వరలోనే దాని ఫలితాలు రాగలవని చెప్పారు. ఇన్వెస్టర్ల వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ ఫుడ్ డెలివరీ రంగం చాలా ఆకర్షణీయం అని అయన అన్నారు. రెస్టారెంట్ల నుంచి ప్రకటనల రూపంలో సరికొత్త ఆదయ వనరు లభించగలదని చెప్పారు. డెలివరీ సేవల విస్తరణ ద్వారా కూడా ఇది లభించగలదన్నారు.

అన్నీ డెలివరీ చేస్తాం...

అన్నీ డెలివరీ చేస్తాం...

ఇకపై కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా గ్రోసరీస్, మిల్క్ సహా అన్ని రకాల డెలివరీ చేస్తామని శ్రీ హర్ష వెల్లడించారు. ఈ కొత్త మార్గాల ద్వారా మొత్తం ఆదాయంలో సుమారు 30% రాబడిని ఆశిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రకటనల ద్వారా, అలాగే టెక్నాలజీ వినియోగం ద్వారా చాలా వరకు ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఆరు నెలల క్రితమే మిల్క్ డెలివరీ చేసే సూపర్ డైలీ ని కొనుగోలు చేయటం ద్వారా సుమారు 2 లక్షల మంది వినియోగదారులను సంపాదించింది. అలాగే బెంగళూరు లో డాంజోకు పోటీగా స్విగ్గి స్టోర్స్ నెలకొల్పింది. వీటి ద్వారా రకరకాల సరుకుల డెలివరీ చేపడుతోంది. నెలకొల్పిన ఐదేళ్ల లోనే కంపెనీని యునికార్న్ స్థాయికి చేర్చటంలో శ్రీ హర్ష కృషి అమోఘం. అందుకే, ది ఎకనామిక్ టైమ్స్ ఆయనకు అవార్డును అందజేసింది.

రూ 23,000 కోట్ల కంపెనీ ...

రూ 23,000 కోట్ల కంపెనీ ...

బెంగళూరు కేంద్రంగా 2015 లో ఏర్పాటు చేసిన స్విగ్గి... ప్రస్తుతం మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ వాల్యుయేషన్ 3.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ 23,000 కోట్లు) గా ఉంది. ఇప్పటి వరకు అత్యధికంగా స్విగ్గి 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ 9,100 కోట్లు ) సమీకరించింది. ఇన్వెస్టర్లు ఈ కంపెనీ పై పెట్టిన విశ్వాసాన్ని ... ఫౌండర్లు వమ్ము చేయలేదు. ఏర్పాటు చేసిన ఐదేళ్ళలో స్విగ్గి ని కేవలం ఫుడ్ డెలివరీ కంపనీగానే కాకుండా ఇతర రంగాలకు విస్తరించగలిగారు. నష్టాల నుంచి లాభాల దిశగా కంపెనీని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. స్విగ్గి భావిస్తున్నట్లు కొత్త విభాగాలు కంపెనీకి త్వరలోనే లాభాలు తెచ్చి పెడుతాయో లేదో చూడాలి మరి.

English summary

Want 30% pie beyond food delivery, says Swiggy

Swiggy is targeting to generate 30% of its overall revenue from beyond food delivery in a couple of years, as it diversifies into grocery delivery, concierge services and cloud kitchens, among a slew of new initiatives.These businesses, which contribute a small share to its current revenue, will help leverage the existing user base from Swiggy's food delivery platform to provide customers convenience in more forms than just food, said CEO Sriharsha Majety.
Story first published: Friday, November 22, 2019, 11:46 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more