అమ్మకానికి అసలైన సమయం.. అమెరికాలో IPOకు ఫ్లిప్‌కార్ట్
వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ అమెరికాలో ఐపీవోకు సిద్ధమవుతోంది. అమెరికాలో ఫ్లిప్‌కార్ట్ యూనిట్ ఇనిషియల్ షేర్ సేల్ కోసం వాల్‌మార్ట్ ఇప్పటికే గోల్డ్‌మన్ శాక్స్‌ను నియమించుకుంది. దీని ద్వారా 10 బిలియన్ డాలర్ల మొత్తాన్ని సమీకరించాలని భావిస్తోంది. భారత అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో 25 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోందని తెలుస్తోంది. గోల్డ్ మన్ శాక్స్ సంస్థ ఈ వ్యవహారాలు చూడనుంది.
రెండేళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు: ఏ నగరంలో ఎంతంటే

ఈ-కామర్స్ బిజినెస్ అదుర్స్
కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలైనప్పటికీ, ఆన్లైన్ ఈ-కామర్స్ వ్యాపారం భారీగా ఎగిసింది. అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, చైనాకు చెందిన అలీబాబా సహా వివిధ ఈ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దీంతో ఈ కంపెనీల స్టాక్స్ కూడా లాభపడ్డాయి. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తులు అయితే రికార్డుస్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా బయటకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ పండుగ సీజన్లోను ఏడాది ప్రాతిపదికన పెరిగాయి.

అమ్మకానికి ఇదే సమయమని...
ప్రస్తుతం ఈ-కామర్స్ రంగాలకు డిమాండ్ బాగుండటం, షేర్లు విక్రయిస్తే మంచి ధర లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా భారీ సంఖ్యలో కస్టమర్లు పెరిగారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఫ్లిప్‌కార్ట్ సంస్థ సింగపూర్‌లో రిజిస్టర్ అయింది. అమెజాన్, జియో మార్ట్లతో పోటీని ఎదుర్కొంటోంది.

ఎవరి వాటా ఎంత అంటే
ఐపీవోపై పని చేస్తున్నామని, మహమ్మారి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసిందని, ఈ-కామర్స్‌కు డిమాండ్ పెరుగుతున్నందున ఇదే సమయమని వాల్‌మార్ట్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలకు, డిపార్టుమెంట్ స్టోర్స్‌కు వెళ్లడం తగ్గించారు.
ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత 40 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ వద్ద 25 శాతంతో 10 బిలియన్ డాలర్లను సమీకరించాలని భావిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా 82.3 శాతం, టెన్సెంట్ వాటా 5.21 శాతం, టైగర్ గ్లోబల్ వాటా 4.72 శాతం, బిన్నీ బన్సాల్ వాటా 3.15 శాతం, క్యూఐఏ వాటా 1.45 శాతం వాటా, ఇతరుల వాటా 3.17 శాతంగా ఉంది.