For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదే జరగకుంటే వొడాఫోన్ ఐడియా మూసివేయడమే: కేఎం బిర్లా

|

ఢిల్లీ: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ భవితవ్యంపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాపోన్ ఐడియాకు ప్రభుత్వం ఊరట కల్పించకుంటే సంస్థను మూసివేయక తప్పదన్నారు. రెండ్రోజుల క్రితం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చు

ప్రభుత్వానికి రూ.53,038 కోట్ల పాతబకాయిలు చెల్లించాల్సి ఉన్న వొడాఫోన్ ఐడియాకు ఉపశమనం లభించని పక్షంలో ఈ సంస్థ భవితవ్యం ఏమిటనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి చేయూత లేకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసిట్టే భావిస్తానన్నారు.

 అదే జరగకుంటే వొడాఫోన్ ఐడియా మూసివేయడమే: కేఎం బిర్లా

మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రంగాలకు ఉపశమనం కల్పిస్తోందని, టెలికం రంగం కూడా ఎంతో కీలకమైందనే వాస్తవం ప్రభుత్వానికి బోధపడిందని, కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా టెలికం రంగంపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్ధీపనలు అవసరమన్నారు.

ఉచిత వాయిస్ కాల్స్, అతితక్కువ ధరకు డాటాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ముఖేశ్‌ అంబానీకి చెందిన జియో దేశీయ టెలికం మార్కెట్లో మొదలుపెట్టిన యుద్ధాన్ని తట్టుకునేందుకు బిర్లా నేతృత్వంలోని ఐడియా సెల్యులార్‌ గత ఏడాది వొడాఫోన్ ఇండియా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీతో కలిసి వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడింది. ఈ విలీన సంస్థ రుణభారం రూ.1.17 లక్షలకోట్లకు పెరిగింది. పైగా దేశంలోని టెలికం సంస్థల నుంచి పాతబకాయిలను వసూలు చేయాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌కు శరాఘాతమైంది.

ఈ తీర్పుతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, ఇతర టెలికం సంస్థలు గత పద్నాలుగేళ్ళకు సంబంధించిన లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినిమయ చార్జీలు, వాటిపై వడ్డీ, జరిమానా కలిపి ప్రభుత్వానికి దాదాపు రూ.1.47 లక్షల కోట్ల పాత బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు వడ్డీని, జరిమానాను రద్దు చేయడం ద్వారా తమ బకాయిలను సగానికి తగ్గించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అలాగే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేశాయి.

ఇదిలా ఉండగా, AGRపై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఎయిర్ టెల్ కంటే వొడాపోన్ ఐడియాకే ఎక్కువ దెబ్బ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే భారీ నష్టాల్లో ఉండటంతో రివ్యూ పిటిషన్‌ కొట్టివేత ఆ సంస్థకు ఇబ్బందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary

Vodafone Idea will shut shop if there is no government relief

Aditya Birla Group chairman Kumar Mangalam Birla on Friday warned that the group's telecom unit, Vodafone Idea Ltd, will have to shut shop if there was no relief from the government following the Supreme Court ruling requiring it to pay statutory dues of ₹40,000 crore to the department of telecommunications (DoT) within three months.
Story first published: Sunday, December 8, 2019, 16:12 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more