For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bonus: ఎంత మంచి బాసో భయ్యా.. లక్షల్లో బోనస్, Free టూర్.. మీరూ తెలుసుకోండి..

|

World's Best Boss: కంపెనీలు అందించే బోనస్ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. మహా అయితే అది వేలల్లోనే ఉంటుందని మనందరికీ తెలుసు. దానికే చాలా మంది మురిసిపోతుంటారు. కంపెనీలో పని చేస్తుంటే.. బాస్ ఎలా ప్రవర్తిస్తారు అనేది చాలా ముఖ్యం. అయితే.. ఉద్యోగులు ఊహించని వాటిని ఇచ్చి ఆశ్చర్యపరిచే కొందరు ఉన్నతాధికారులు ఉంటారు.

బోనస్ ప్రకటన..

బోనస్ ప్రకటన..

అమెరికాలోని Spanx లోదుస్తుల తయారీ కంపెనీ వ్యవస్థాపకురాలు సారా బ్లేక్లీ ఊహించని బోనస్ ప్రకటించి ఉద్యోగులను కళ్లు తేలేసేలా చేసింది. తన సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి రూ.8 లక్షల బోనస్, ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్లను అందించింది.

సోషల్ మీడియాలో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్..

తన ఉద్యోగులను ఊహించిన దానికంటే.. ఎక్కువ సంతోషపెట్టిన బాస్ సారా బ్లేక్లీ కథ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఈ వ్యాపారంలో 21 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ టిక్కెట్లను ఉపయోగించి తన సిబ్బంది చక్కటి విందు, హోటల్, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని ప్రకటించినప్పుడు ఆమె ఉప్పొంగిపోయింది. సారా ఈ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంకితం చేసింది.

ఎంజాయ్ చేసేందుకు..

సారా బ్లేక్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బాస్ అని పిలుస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి 10,000 డాలర్లను బహుమతిగా ఇచ్చింది. దీనికి తోడు రెండు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు ఇవ్వటంతో వారు విహారయాత్ర చేసేందుకు ఆ డబ్బులు సరిపోతాయి. హ్యాపీ వెకేషన్ చేసేందుకు, సెలవులను అద్భుతంగా నినియోగించుకునేందుకు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సారా మనసులో మాట..

సారా మనసులో మాట..

"మీరు సెలవుపై వెళుతున్నట్లయితే, మీరు కూడా మంచి విందు చేయాలనుకుంటున్నారు. దాని కోసం మీరు ఇష్టపడతారు. మంచి హోటల్‌కి వెళ్లాలి. దాని కోసం ఆ రెండు ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు కాకుండా పదివేల డాలర్లు కూడా అందుబాటులో ఉన్నాయి." అని సారా ఉద్యోగులతో అన్నారు.

కన్నీటి పర్యంతం..

కన్నీటి పర్యంతం..

"మీ అందరికీ ఇది చాలా ముఖ్యమైన క్షణం. ఇప్పుడు మాతో ఉన్న మహిళలందరికీ నేను ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాను. ఇది సంతోషకరమైన క్షణం, ఇది మాకు కన్నీళ్లు తెస్తోంది. మేము చాలా కష్టపడి ఇక్కడకు వచ్చామని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఈ ఆనందాన్ని మీ స్వంత మార్గంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇది చిరస్మరణీయ క్షణం." అని ఆమె అన్నారు.

English summary

Bonus: ఎంత మంచి బాసో భయ్యా.. లక్షల్లో బోనస్, Free టూర్.. మీరూ తెలుసుకోండి.. | us under garments Spanx owner Sara tagged as world’s best boss for giving mega bonus and first class flight tickets

us under garments Spanx owner Sara tagged as world’s best boss
Story first published: Friday, July 29, 2022, 15:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X