For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా కంపెనీలకు అమెరికా భారీ షాక్, డ్రాగన్ కంట్రీయే కారణం

|

అమెరికా-చైనా మధ్య మరోసారి ట్రేడ్ వార్ ప్రారంభమైంది. తమ స్టాక్ మార్కెట్లో నమోదైన చైనా కంపెనీలకు అమెరికా భారీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యూఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్(SEC) గురువారం కీలక నిబంధనకు ఆమోదం తెలిపింది. దీంతో చైనా కంపెనీల తనిఖీలకు సంబంధించి వివరాలను బహిర్గతపరచడంతో ఇరు దేశాల మధ్య సంధిగ్దత నెలకొంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్, యూఎస్ పబ్లిక్ కంపెనీస్ అకౌంటింగ్ ఓవర్ సైట్ బోర్డు (PCAOB) పర్యవేక్షణ, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే ఆ కంపెనీల షేర్లు అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అయ్యేందుకు అనుమతించేది లేదని తెలిపింది. దీనికి తోడు ఆ కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో ఆ కంపెనీలు ప్రభుత్వ కంపెనీయా లేక ప్రభుత్వానికి ఏమైనా కంట్రోలింగ్ వాటా ఉందా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని తెలిపింది.

అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ SEC ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమెరికా నుండి చైనా కంపెనీలు నిధులు సేకరించడం ఇక అంత సులభం కాదని చెబుతున్నారు. తాజా వార్తల నేపథ్యంలో చైనా రైడ్ హెయిలింగ్ సర్వీస్ కంపెనీ దీదీ గ్లోబల్ ఇంక్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. త్వరలో షేర్లను హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ చేయబోతున్నట్లు తెలిపింది.

చైనా కంపెనీలకు అమెరికా భారీ షాక్, డ్రాగన్ కంట్రీయే కారణం

అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు తమ ఆడిట్‌కు సంబంధించి అదనపు సమాచారాన్ని వార్షిక నివేదికల్లో బహిర్గతం చేయాలని, అలాగే ఆయా కంపెనీలను తనిఖీ చేసిన ఆడిటర్లు లేదా ఆడిట్ సంస్థలను సమీక్షించేందుకు PCAOBని అనుమతించాలని నిర్ణయించడం, అలాగే కంపెనీలలో చైనా ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయా తెలియజేయాలని సూచించడం, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు వెల్లడించడం వంటి అంశాలు చైనా కంపెనీలకు షాకిచ్చేవిగా మారాయి. ఇప్పటికే చైనాలో అధికార కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని అమెరికా నిషేధించింది.

ఆర్థికంగా బలంగా ఉన్న అమెరికా నుండి నిధులు సేకరించి చైనా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. చైనా టెక్నాలజీ రంగంలో వస్తోన్న గణనీయ వృద్ధిని అమెరికా ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెండు వర్గాలకు అమెరికా తాజా నిర్ణయం షాకింగ్ వంటిది. అయితే ఇందుకు చైనాయే కారణమని అంటున్నారు. పబ్లిక్ కంపెనీలను ఆడిట్ చేసిన సంస్థల పనితీరును సమీక్షించాలని అమెరికా చట్టం చెబుతుండగా, చైనా ఇందుకు అంగీకరించడం లేదు.

అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదవుతున్న చైనా కంపెనీల షేర్ల వ్యాల్యూ 2 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. మన కరెన్సీలో 1.50 కోట్ల కోట్లు. గత పదేళ్లలో అమెరికాలో చైనా కంపెనీలు 76 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. ఈ ఏడాది 37 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. అమెరికా ఎక్స్చేంజీల్లో 270 కంపెనీలు నమోదు కాగా, కేవలం 14 మాత్రమే ఆడిట్ వివరాలు సమర్పించాయి.

English summary

US-listed Chinese firms must disclose ownership, audits

Chinese companies will have to disclose more information about audits and whether they are controlled by a government or else leave U.S. stock markets under a rule approved by securities regulators.
Story first published: Sunday, December 5, 2021, 20:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X