For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gowtham Adani: అదానీకి భద్రత పెంపు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు.. 24 గంటలు పహారా..

|

Gowtham Adani Security: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, దేశంలో అగ్ర వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ప్రభుత్వం జెడ్(Z) కేటగిరీ భద్రతను కల్పించింది. గౌతమ్ అదానీకి ఇచ్చిన సెక్యూరిటీ ఖర్చులను ఆయనే భరిస్తారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో థ్రెట్ పర్సెప్షన్ నివేదిక ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఈ రక్షణను అదానీ గ్రూప్ ఛైర్మన్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

33 మంది సెక్యూరిటీ గార్డులు..

33 మంది సెక్యూరిటీ గార్డులు..

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత కింద మొత్తం 33 మంది సెక్యూరిటీ గార్డులను నియమిస్తోంది. అదానీ భద్రత సాయుధ దళాల చేతుల్లో ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. గౌతమ్ అదానీ ఇంటి వద్ద 10 మంది సాయుధ స్టాటిక్ గార్డ్స్ ఉంటారు. దీంతో పాటు 6 రౌండ్ ది క్లాక్ పీఎస్‌ఓలు, 12 మంది సాయుధ స్కాట్ కమాండోలు, మూడు షిఫ్టుల్లో 12 మంది, షిఫ్టులో 2 వాచర్లు, 3 గంటలపాటు శిక్షణ పొందిన డ్రైవర్లు అదానీకి భద్రత కల్పించనున్నారు.

IB నివేదికతో అప్రమత్తం..

IB నివేదికతో అప్రమత్తం..

IB తాజా నివేదిక ప్రకారం MHA గౌతమ్ అదానీకి VIP భద్రతను కల్పించిందని సమాచారం. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యాపారం గత కొన్నేళ్లుగా వేగంగా వృద్ధి చెందడం గమనార్హం. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి ఆయన దూసుకుపోతున్నారు. గౌతమ్ అదానీ సంపద పెరగడానికి కారణం కంపెనీల అద్భుతమైన పనితీరని మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీకి చెందిన మొత్తం 7 కంపెనీలు లిస్టయ్యాయి.

ప్రపంచంలో నాలుగో కుబేరుడిగా..

ప్రపంచంలో నాలుగో కుబేరుడిగా..

అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగానే కాకుండా.. ప్రపంచ కుబేరుల్లో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-10 బిలియనీర్ల జాబితాలో ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ తర్వాత గౌతమ్ అదానీ నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ప్రకారం గౌతమ్ అదానీ నికర విలువ 129.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

ముఖేష్ అంబానీకి కూడా భద్రత..

ముఖేష్ అంబానీకి కూడా భద్రత..

గతంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీకి కూడా కేంద్ర భద్రతను కల్పించింది. వీరికి ప్రతినెలా భద్రత కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సంబంధిత దళానికి చెల్లిస్తారు. ముఖేష్ అంబానీకి పేమెంట్ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం వీఐపీ భద్రతను అందించిన తరహాలోనే గౌతమ్ అదానీకి కూడా ప్రస్తుతం జెడ్ క్యాటగిరీ భద్రతను అందించింది.

Read more about: business news
English summary

union home ministry gave z catagery security to industrialist gowtham adani with ib report

z catagery security to industrialist gowtham adani
Story first published: Thursday, August 11, 2022, 7:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X