For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income Tax: మారనున్న Income Tax రేట్లు..! అంతర్గత సమాచారం ఏమిటంటే..

|

Budget 2023: ఆదాయపు పన్ను రేట్ల విధానంతో కొత్త మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టాక్స్ శ్లాబ్ లు, రేట్ల విధానాన్ని మార్చాలని చాలా మంది ఇప్పటికే దేశంలో ఆశిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు గ్రహించాలని చాలా మంది సామాన్యులు కోరుతున్నారు.

సీక్రెట్ చర్చలు..

సీక్రెట్ చర్చలు..

కొత్త ఆదాయపు పన్ను నిర్మాణంలో ప్రభుత్వ ప్రణాళిక రేటు మార్పులు ఉండనున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. బడ్జెట్ త్వరలో రానున్నందున దీనిపై కీలక ప్రకటన రావటానికి ముదు ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. అయితే దీనిపై చర్చలు ప్రైవేటుగా జరుగుతున్నట్లు రెండు వర్గాల ద్వారా బయటకు వచ్చింది. అయితే వీరు తమ పేరును వెల్లడించవద్దని ప్రముఖ మీడియా సంస్థకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

 రేట్ల తగ్గింపు..

రేట్ల తగ్గింపు..

స్వచ్ఛంద ఆదాయపు పన్ను ఫ్రేమ్‌వర్క్ కింద రేట్లను తగ్గించడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ సమావేశంలో సవరించిన ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రవేశపెట్టవచ్చని రెండు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. దీనిపై రాయిటర్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన ఈ-మెయిల్ కు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

పన్ను సులభతరం..

పన్ను సులభతరం..

కొత్త ఆదాయపు పన్ను విధానం 2020లో ప్రకటించటం జరిగింది. ఇందులో వార్షిక ఆదాయంపై తక్కువ హెడ్‌లైన్ టాక్సేషన్ రేట్లను అందిస్తోంది. నిపుణులు హౌస్ రెంట్, ఇతర విషయాలతో పాటు ఇన్సూరెన్స్ పై మినహాయింపులను అందించకపోవటంతో అది చాలా మందిని ఆకర్షించలేదు. అంటే కొత్త విధానం ద్వారా టాక్స్ పేయర్లకు ఎలాంటి పన్ను మినహాయింపు సెక్షన్లు అందుబాటులో లేవు. అందుకే దీనిని దేశంలోని టాక్స్ పేయర్లు దాదాపుగా వ్యతిరేకించారు.

 గందరగోళం..

గందరగోళం..

కొత్త ఆదాయపుపన్ను విధానంలో మినహాయింపులు, పన్ను రాయితీలు ఇవ్వటం చాలా కష్టతరంగా ఉంటుంది. పైగా ఇది టాక్స్ పేయర్లలో గందరగోళాన్ని కూడా సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలకు చెందిన ఒక వ్యక్తి వెల్లడించారు. ఏడాదికి కనీసం రూ.5 లక్షలు సంపాదించే ప్రతి వ్యక్తిపై పన్ను విధించబడుతోంది. సమాచారం ప్రకారం.. ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల మధ్య సంపాదించే వ్యక్తి పాత పన్ను నిబంధనల ప్రకారం 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా.. కొత్త స్కీమ్ ప్రకారం 10 శాతం మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈ రేట్లలో వచ్చే మార్పులు ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాతే బహిర్గతం కానున్నాయి.

English summary

Income Tax: మారనున్న Income Tax రేట్లు..! అంతర్గత సమాచారం ఏమిటంటే.. | union government planning to change tax slab rates in budget 2023 sources revealed

union government planning to change tax slab rates in budget 2023 sources revealed
Story first published: Tuesday, January 17, 2023, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X