For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

adani: నిఫ్టీ ప్రధాన ఇండెక్స్ ల్లోకి కొత్తగా రెండు అదానీ కంపెనీలు.. మరి నిఫ్టీ 50లో మార్పుల మాటేమిటి?

|

adani: హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ గ్రూపు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇది జరిగి 20 రోజులకు పైగా గడిచినా, స్టాక్ మార్కెట్లో విపరీతమైన అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. ఆ కంపెనీల స్టాక్సులో వాలటాలిటీ భారీగా నమోదవుతోంది. అయితే తాజాగా నిఫ్టీకి చెందిన పలు ఇండెక్సుల్లో అదానీ సంస్థల పేర్లు దర్శనమివ్వనున్నాయి.

ఈ సూచీల్లో కూర్పులు

ఈ సూచీల్లో కూర్పులు

ఈ ఏడాది మార్చి 31 నుంచి కొన్ని సూచీల్లో అదానీ విల్మార్, అదానీ పవర్‌లను చేర్చనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన సూచీలను సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది. నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100 ఇండెక్స్‌ లలో అదానీ విల్మార్ భాగం కానుండగా.. నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 150, నిఫ్టీ లార్జ్ మిడ్‌ క్యాప్ 250లో అదానీ పవర్ ను చేర్చనున్నట్లు పేర్కొంది.

 నిఫ్టీ 50లో మాత్రం..

నిఫ్టీ 50లో మాత్రం..

NSE ఇండెక్స్ లిమిటెడ్ కి చెందిన ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్-కమిటీ తన రెగ్యులర్ సమీక్షలో భాగంగా వివిధ సూచీల్లోని స్టాక్‌ లను అప్ డేట్ చేయడానికి నిర్ణయించింది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ‌లో అదానీ విల్‌మార్ తో పాటు ABB ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ కొత్తగా చేర్చబడుతున్నాయి. బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫాసిస్, పేటీఎం లను తొలగించనున్నారు. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 ఇండెక్స్ ‌లో ఈసారి ఎలాంటి మార్పు చేయలేదు.

మే నెలకు వాయిదా

మే నెలకు వాయిదా

రెండు అదానీ గ్రూపు సంస్థలు అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్ల వెయిటేజీల తగ్గింపును.. ఇండెక్స్ ప్రొవైడర్ MSCI గత వారం వాయిదా వేసింది. ధరల పరిమితి మెకానిజమ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఫిబ్రవరిలో అమలు కావాల్సిన ఈ చర్యలు మే నెలకు వాయిదా పడ్డాయి.

English summary

adani: నిఫ్టీ ప్రధాన ఇండెక్స్ ల్లోకి కొత్తగా రెండు అదానీ కంపెనీలు.. మరి నిఫ్టీ 50లో మార్పుల మాటేమిటి? | Two adani companies to listed in nifty next 50 and other indices

Changes in Indices..
Story first published: Sunday, February 19, 2023, 8:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X