For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయులకు ట్రంప్ మరో షాక్? H1B వీసా లాటరీ పద్ధతిపై కీలక నిర్ణయం!

|

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాల జారీలో ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిపాదన తీసుకు వచ్చింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ పెట్టింది. ఈ నోటిఫికేషన్ పైన 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(DHS) వెల్లడించింది.

భారత్‌పై అందులో పట్టుకోసం అమెజాన్ జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ సై! అందుకే ఈ టగ్ ఆఫ్ వార్

లాటరీ స్థానంలో వేతనస్థాయి ఆధారితం

లాటరీ స్థానంలో వేతనస్థాయి ఆధారితం

హెచ్ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతికి గుడ్‌బై చెప్పి, దీని స్థానంలో వేతనస్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అమెరికా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రతిపాదన ఉంది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులకు షాక్ అని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో అమెరికన్లకే అధిక ప్రాధాన్యత అంటూ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నది ట్రంప్ సర్కార్. ఇప్పుడు లాటరీ పద్ధతికి బదులు గరిష్టవేతనస్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలు అందించేలా ఈ నిబంధన తీసుకు వస్తోంది.

భారత్‌తో పాటు పలు దేశాలకు షాక్

భారత్‌తో పాటు పలు దేశాలకు షాక్

భారత్‌తో పాటు పలు దేశాల నుండి ప్రతి సంవత్సరం హెచ్1బీ వీసా కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి. వీటిలో కంప్యూటర్ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తారు. ఈ పద్దతిలో అమెరికాయేతర దేశాలకు చెందిన అభ్యర్ధులు తక్కువ వేతనానికి దొరుకుతుండటంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్1బీ వీసాను జారీ చేసేలా చర్యలు చేపట్టనుంది. లాటరీ పద్ధతిని రద్దుచేస్తూ ట్రంప్ పాలకవర్గం తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ గరిష్టవేతనస్థాయి ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు.

ఎన్నికలకు ముందు..

ఎన్నికలకు ముందు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఎన్నికల్లో ఓటేసేందుకు లక్షల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా సిద్ధమయ్యారు. వీరిలో కొందరు ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు ఓటు వేశారు. మరికొందరు వచ్చే నెల జరిగే పోలింగ్‌లో పాల్గొంటారు. వీరి సౌకర్యం కోసం అమెరికా ప్రభుత్వం, ఎన్నికల యంత్రాగం పలు చర్యలు తీసుకుంటోంది. అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్న ట్రంప్‌ను భారతీయులు సహా ఇతర దేశాల వారు ఏమేరకు సమర్థిస్తారనేది ఎన్నికల తర్వాత తెలియనుంది.

English summary

Trump administration proposes to scrap computerised lottery system to select H1B visas

The Donald Trump administration said it would replace the lottery based selection process for H-1B visas with wage-level based selection in a move to “better protect the economic interests of US workers.
Story first published: Thursday, October 29, 2020, 19:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X