For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారుల ముఖాల్లో 'దీపావళి' నవ్వులు, చైనాకు రూ.40వేల కోట్ల భారీ నష్టం!

|

దీపావళి పండుగ సమయంలో అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నట్లు ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) ఆదివారం వెల్లడించింది. సేల్స్ రూ.72,000 కోట్లుగా నమోదయినట్లుగా అంచనా వేసింది. దేశంలోని పట్టణాలైన ప్రధాన మార్కెట్ల నుండి సేకరించిన డేటా ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ టర్నోవర్ జరిగిందని, దీంతో చైనాకు రూ.40వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపింది.

గత కొద్ది నెలలుగా చైనా-భారత్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీస్ ఉత్పత్తులు బహిష్కరించాలని CAIT కోరింది. చైనా వస్తువులను బహిష్కరించాలని వ్యాపార సంస్థలు కూడా ప్రచారం నిర్వహించాయి.

బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 15% వేతన పెంపు: వారానికి 5 డేస్ వర్కింగ్‌పై నిరాశబ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 15% వేతన పెంపు: వారానికి 5 డేస్ వర్కింగ్‌పై నిరాశ

చైనాకు రూ.40వేల కోట్ల నష్టం

చైనాకు రూ.40వేల కోట్ల నష్టం

దేశంలోని 20 ప్రధాన నగరాల నుండి తాము సేకరించిన సమాచారం మేరకు దీపావళి పండుగ సమయంలో దాదాపు రూ.72వేల కోట్ల మేర టర్నోవర్ జరిగింది. తద్వారా చైనా మార్కెట్‌కు రూ.40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్తులోను ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆశిద్దామని CAIT ఓ ప్రకటనలో తెలిపింది. తూర్పు లడక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని CAITతో పాటు వ్యాపార సంస్థలు, సాధారణ ప్రజలు పిలుపునిచ్చారు. దీంతో చైనా నుండి వస్తువుల దిగుమతి క్షీణించింది.

ఈ వస్తువుల సేల్

ఈ వస్తువుల సేల్

దీపావళి పండుగ సమయంలో భారీగా సేల్ అయిన ఉత్పత్తుల్లో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), కన్స్యూమర్ డ్యూరబుల్స్, బొమ్మలు, ఎలక్ట్రికల్ అప్లియెన్సెస్ అండ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, వైట్ గూడ్స్, కిచెన్ వస్తువులు, యాక్సెసరీస్, గిఫ్ట్ ఐటమ్స్, కాన్ఫెక్షనరీ ఐటమ్స్, స్వీట్స్, హోమ్ ఫర్నీషింగ్, స్టీల్ వస్తువులు, గోల్డ్, జ్యువెల్లరీ, ఫుట్‍‌‌వేర్, వాచీలు, ఫర్నీచర్, దుస్తులు, ఫ్యాషన్ అప్పారెల్స్, క్లాత్ అండ్ హోమ్ డెకరేషన్ వస్తువులు ఉన్నాయి.

CIAT ప్రకారం దీపావళి పండుగ సమయంలో బలమైన అమ్మకాలు నమోదు చేశాయని, భవిష్యత్తుపై ఇది మంచి వ్యాపార అవకాశాల దిశగా విశ్వాసం నింపినట్లు తెలిపింది.

వ్యాపారుల ముఖాల్లో దీపావళి చిరునవ్వు

వ్యాపారుల ముఖాల్లో దీపావళి చిరునవ్వు

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగపూర్, రాయపూర్, భువనేశ్వర్, రాంచీ, భోపాల్, లక్నో, కాన్పూర్, నోయిడా, జమ్ము, అహ్మదాబాద్, సూరత్, కొచ్చి, జైపూర్, చండీగఢ్ తదితర పట్టణాల నుండి ఈ డేటా సేకరించారు. దీపావళి సీజన్‌లో అమ్మకాలు వ్యాపారుల ముఖల్లో చిరునవ్వును చిందింప చేశాయని చెబుతున్నారు.

English summary

వ్యాపారుల ముఖాల్లో 'దీపావళి' నవ్వులు, చైనాకు రూ.40వేల కోట్ల భారీ నష్టం! | Traders record Rs 72000 crore sales on Diwali amid boycott of Chinese products

Traders recorded sales of around Rs 72,000 crore this Diwali across major markets in the country, said the Conferderation of All India Traders (CAIT).
Story first published: Monday, November 16, 2020, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X