2022 టాప్-5 ఐపీఓ: రూ.లక్షకోట్లకు పైగా టార్గెట్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2021వ సంవత్సరం ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కూడా పూర్తవుతుంది. శుక్రవారం నాటితో ఈ థర్డ్ క్వార్టర్ ముగియనుంది. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ మధ్య గడపాల్సి వచ్చింది. దీనికి కొనసాగింపుగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. 2022ను ఈ వేరియంట్ వెంటాడే అవకాశాలు లేకపోలేదు.

63కు పైగా కంపెనీలు..
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నందున.. వచ్చే సంవత్సరం మార్కెట్ ఎలా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. పబ్లిక్ ఇష్యూల మీద నిలిచాయి. క్వాలిఫైడ్, నాన్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్, రిటైల్ ఇన్వెస్టర్ల చూపంతా రాబోయే ఐపీఓల మీద నిలిచాయి. వచ్చే సంవత్సరం మొత్తం 63కు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను జారీ చేసే అవకాశం ఉంది. దాదాపు 1.16 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని వీటి ద్వారా సమీకరించుకుంటాయనే అంచనాలు ఉన్నాయి.

ఎల్ఐసీ..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎల్ఐసీ ఐపీఓ విడుదల కానుంది. అతిపెద్ద ఐపీఓగా రానుంది. ఎల్ఐసీలో ఉన్న తన వాటాను 5 నుంచి 10 శాతం మేర విక్రయించుకోవాలని కేంద్రం లక్ష్యం. దీనిద్వారా 80,000 నుంచి లక్ష కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అదాని విల్మార్
అదాని విల్మార్ కంపెనీ.. 4,500 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి మొబిలైజ్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. టాప్ సెల్లింగ్ వంటనూనె బ్రాండ్ ఫార్చూన్‌ను ఉత్పత్తి చేస్తోంది ఈ కంపెనీయే. అదాని ఎంటర్ప్రైజెస్, ఆసియన్ అగ్రి బిజినెస్ విల్మార్ ఇంటర్నేషనల్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడిందీ కంపెనీ. 2007 నాటికి దేశంలో లార్జెస్ట్ ఫుడ్ కంపెనీగా ఆవిర్భవించాలనేది అదాని విల్మార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన అనంతరం- అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి లిస్టెడ్ అయిన ఏడో కంపెనీగా గుర్తింపు పొందుతుంది.

ఓయో ఐపీఓ..
హాస్పిటాలిటీ సెగ్మెంట్‌కు చెందిన ఓయో ఐపీఓకు రానుంది. 8,430 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. ఫ్రెష్ ఐపీఓను జారీ చేయడం ద్వారా 7,000 కోట్ల రూపాయలను సేకరించనుంది. 1,430 కోట్ల రూపాయల కోసం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)ను ఇష్యూ చేస్తుంది. జనవరిలోనే ఓయో ఐపీఓకు రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

ఓలా ఐపీఓ..
టాప్ రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా కూడా వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. తొలి ప్రథమార్థం అంటే.. జూన్ లోగా ఐపీఓను జారీ చేయాలని ఓలా కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు ఉండొచ్చు. 15,000 కోట్ల రూపాయల భారీ టార్గెట్‌తో ఇది ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబ్, స్టీడ్‌వ్యూ కేపిటల్స్ కంపెనీలు తమ వాటాలను విక్రయించుకోవడం లేదా తగ్గించుకోవడం వల్ల పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తోంది.

ఢెల్లీవరం ఐపీఓ..
ఆన్లైన్ డెలివరీ అండ్ లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్ ఢెల్లీవరి. 2022లో పబ్లిక్ ఇష్యూకు రానుంది. 7,460 కోట్ల రూపాయలను సమీకరించాలని ప్లాన్ వేసుకుంది. నవంబర్లోనే రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డుకు అందజేసిందీ కంపెనీ. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 5,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో 2,460 కోట్ల రూపాయలను సమీకరించుకోనుందీ డెలివరీ ప్లాట్‌ఫామ్. రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది.