For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ పనిగంటలు... తక్కువ సంపాదన: మారుతున్న లోకం పోకడ

|

ఈ మధ్య కాలంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఒక వింత పరిస్థితి ఎదురవుతోంది. సాధారణం కంటే అధిక పనిగంటలు పనిచేయాలని కంపెనీలు అడుగుతున్నాయి. అదే సమయంలో వారికి అప్పటికే వస్తున్నవేతనం కంటే తక్కువకే పనిచేయాలని కూడా కోరుతున్నాయి. ఎక్కువ అనుభవం ఉన్న వారికి అసలు ఉద్యోగాలు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నాయి. ఒకప్పుడు రోజుకు 8 గంటలు పనిచేస్తే సరిపోయేది. అందులోనే ఒక గంట లంచ్ బ్రేక్, రెండు టీ బ్రేకులు ఉండేవి. ఇండియన్ టైమింగ్ ప్రకారం కనీసం 30 నిముషాలు ఆలస్యంగా రావటం... మరో 30 నిముషాలు ముందే వెళ్ళిపోవటం సహజంగా జరిగేది. కానీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ నుంచి సాంబారు పొడి తయారు చేసే కంపెనీల వరకు ఎవరూ 9 గంటల కంటే ముందు తమ ఉద్యోగులు వెళ్లిపోతానంటే అంగీకరించటం లేదు. సాక్షాత్తూ ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్ లెటర్ల లోనే అధిక పనిగంటలు పేర్కొంటున్నారు.

12 గంటలు పని చేయాలంటున్న జాక్ మా..

12 గంటలు పని చేయాలంటున్న జాక్ మా..

బయో మెట్రిక్ అటెండన్స్ విధానం వల్ల కచ్చితంగా నిర్దేశిత సమయం వరకు ఉండాల్సిందే. ఇంకా ఏమైనా పని మిగిలిపోతే ... అది పూర్తి చేయకుండా టీం లీడర్ ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వటం లేదు. అంటే సుమారు 10 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ప్రయాణ సమయాన్ని కలుపుకుంటే మొత్తం 12 గంటలు ఉద్యోగ జీవితానికే సరిపోతోంది. ఇలా ఉండగా.. ప్రపంచ ప్రఖ్యాత ఈకామెర్స్ కంపెనీ అలీబాబా ఫౌండర్, చైనా అపర కుబేరుడు జాక్ మా అయితే ఏకంగా '996' పని విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. అంటే రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పనిచేయాలన్నది అయన సిద్ధాంతం. అంటే ప్రస్తుత అధికారిక పనిగంటల కంటే 50% ఎక్కువ పని అవుతుంది.

వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి...

వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి...

ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సేవింగ్స్ అకౌంట్ల లో పొదుపు చేసుకునే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఇవి అమెరికా లో 1.7 శాతం నుంచి 1.8 శాతం ఉండగా, లండన్ లోనూ సుమారు అదే స్థాయి వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక పొతే జపాన్ లో అయితే కేవలం 0.3% మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. జర్మనీ లో ఐతే మరీ ఘోరం... 5,00,000 యూరోల కంటే అధికంగా ఒకే ఖాతాలో పొదుపు చేస్తే 0.5% నుంచి 0.75% వడ్డీని బాదుతున్నారు. అంటే మన డబ్బులను దాచుకున్నందుకు మనమే దానికి వడ్డీ చెల్లించే రోజులు వస్తున్నాయి. ఈ విషయంలో మన భారత దేశం కొంత నయమే అయినా... గత పదేళ్లలో మన దేశంలో కూడా వడ్డీ రేట్లు సగానికి సగం పడిపోయిన విషయాన్నీ గుర్తించి ఉండాలి. 2008-10 సమయంలో పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు దాదాపు 10% నుంచి 12% మధ్యలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం అవి 6% నికి పడిపోయాయి. మరో పదేళ్లలో 3% నికి పరిమితం అవుతాయని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.

పార్ట్ టైం జాబ్స్.. కాంట్రాక్టు జాబ్స్..

పార్ట్ టైం జాబ్స్.. కాంట్రాక్టు జాబ్స్..

జాబ్ మార్కెట్ కూడా చాలా వేగంగా మారిపోతోంది. మన దగ్గర నుంచి ఎవరైనా అమెరికానో మరో దేశమో వెళ్ళినప్పుడు అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటాం అని చెబుతుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే కల్చర్ ఇండియా లో కూడా మొదలైంది. మెట్రో నగరాల్లో ఉండేవారికి ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు అందే ఉంటాయి. సాఫ్ట్ వేర్ లోనూ, ఇతర రంగాల్లోనూ కాంట్రాక్టు కల్చర్ అధికం ఐంది. లేదా పార్ట్ టైం జాబ్స్ ఆఫర్ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. కొందరైతే స్విగ్గి, జొమాటో, ఉబెర్, ఓలా, రాపిడో, ఉబెర్ మోటో వంటి నయా ఆప్ ల్లో నమోదు చేసుకుని, రోజులో 3-4 గంటలు పార్ట్ టైం పని చేస్తున్నారు. యూట్యూబ్ చానెల్స్ లో కూడా పార్ట్ టైం జాబ్స్ లభిస్తున్నాయి. అలా వచ్చిన సొమ్ముని ఖర్చులకు వినియోగించి.. నెల జీతం సేవింగ్స్ కోసం, పెట్టుబడుల కోసం, షాపింగ్ వగైరా లపై వెచ్చిస్తున్నారు. మనం ఊహించని రంగాల్లో కూడా కాంట్రాక్టు జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అందుబాటులు ఉన్నాయి. ఒక ఉద్యోగిని అవసరం ఉన్నంత వరకే వేతనమిచ్చి, తర్వాత గుడ్ బై చెప్పే కల్చర్ కూడా ఎక్కువైంది.

ఏం చేస్తే బెటర్?

ఏం చేస్తే బెటర్?

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే మనం సేఫ్ అనేదే కదా మీ ప్రశ్న? పరుగులు పెడుతున్న లోకంలో మనమూ నిలబడాలంటే ఎక్కువ సంపాదించాలి. అంటే ఒక ఫుల్ టైం జాబ్ చేస్తూనే... మరో రెండు పార్ట్ టైం జాబ్స్ చేయాలి. లేదా 4-5 పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కన్సల్టింగ్ ద్వారా అధికంగా సంపాదించాలి. మనం జాబ్ చేద్దామనుకుంటేనే సరిపోదు. జాబ్ కు తగ్గ స్కిల్ మనకు ఉందా లేదా పరిశీలించుకోవాలి. లేకుంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఎక్కువ సంపాదించాలి. ఎక్కువ పొదుపు చేయాలి. కేవలం సేవింగ్స్ బ్యాంకు ఖాతాలే కాకుండా.. దీర్ఘ కాలంలో అధిక రాబడులు ఇచ్చే పొదుపు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. తగినంత జీవిత బీమా తీసుకోవాలి. కుటుంబానికి సరిపడే మంచి ఆరోగ్య బీమా కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. వయసు ఉన్నప్పుడే సంపాదించాలని మారుతున్న లోకం చెబుతోంది. సో, బీ ప్రిపేర్డ్ ... స్టే హ్యాపీ! ఆల్ ది బెస్ట్!

English summary

The world is changing so is India

The world is changing so is India. At a time when the jobs are becoming part time and contract based, the companies are expecting employees to work for more hours for less pay. Over experienced people are finding it tough to get a suitable job while the freshers are struggling to be hired. Interest rates are shrinking year after year, hence, the people have to think for alternate investment opportunities to safeguard their earned money. In this kind of a scenario, people have to be more cautious and be prepared to accept the changing world and culture. Otherwise, the life will be difficult, warn the experts.
Story first published: Saturday, February 15, 2020, 10:19 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more