For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త రికార్డుకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, రూ.1.95 లక్షల కోట్లు

|

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం (జనవరి 7) సరికొత్త రికార్డును తాకింది. గురువారం మార్కెట్ ముగింపు సమయానికి రూ.1,93,18,126.74 కోట్లుగా ఉన్న ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ.1.95.21 లక్షల కోట్లు దాటింది. ఇటీవలి కాలంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ వేగంగా పెరుగుతోంది. సెన్సెక్స్ గత రెండు నెలలుగా 42 వేల మార్క్ నుండి వేగంగా 48వేల మార్క్‌కు వచ్చింది. ఇప్పుడు 49,000 దిశగా సాగుతోంది.

ఉద్యోగులకు హోండా వీఆర్ఎస్ ఆఫర్: వారికి రూ.5 లక్షలు అదనంఉద్యోగులకు హోండా వీఆర్ఎస్ ఆఫర్: వారికి రూ.5 లక్షలు అదనం

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ జంప్

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ జంప్

నేటి మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభమై, లాభాల్లోనే ఉంది. నేడు 300 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, దాదాపు 100 పాయింట్ల లాభంతో నిఫ్టీ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి గంట అంతకంతకూ పెరిగింది. ఓ సమయంలో 48,800 మార్కును దాటి, 49,000 దిశగా కనిపించింది. ఆటో, ఐటీ స్టాక్స్ భారీగా ఎగిసిపడటంతో మార్కెట్లు జంప్ చేశాయి. రిలయన్స్, ఐటీ స్టాక్స్ మంచి లాభాలు నమోదు చేయడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ పెరిగింది.

మార్కెట్ క్యాప్ జంప్

మార్కెట్ క్యాప్ జంప్

మార్కెట్లు జంప్ చేయడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.195 లక్షల కోట్లను (2.6 ట్రిలియన్ డాలర్లు) దాటింది. సెన్సెక్స్ 471 పాయింట్లు దాటినప్పుటు ఈ మార్కు దాటింది. అయితే ఆ తర్వాత సెన్సెక్స్ 700 పాయింట్లు కూడా దాటింది. ఆ తర్వాత 2020లో సెన్సెక్స్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరకి దాదాపు 15.7 శాతం మేర లాభపడింది. గత ఏడాది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద రూ.32.49 లక్షల కోట్లు పెరిగింది.

మార్కెట్ క్యాప్ ఎంతంటే

మార్కెట్ క్యాప్ ఎంతంటే

నిన్నటి వరకు రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.1211467.12 కోట్లు, టీసీఎస్ రూ.1137985.71 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.780104.53 కోట్లు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ రూ.556727.35 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.537538.69 కోట్లుగా ఉంది. నేడు ఈ కంపనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.

English summary

సరికొత్త రికార్డుకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, రూ.1.95 లక్షల కోట్లు | The market capitalisation of BSE-listed companies zoomed

The market capitalisation of BSE-listed companies zoomed to a fresh lifetime high of over Rs 195.21 lakh crore in morning trade on Friday as markets returned to winning ways after two days of decline.
Story first published: Friday, January 8, 2021, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X