కేటీఆర్ సహా టెస్లాకు ఆహ్వానం, ఎలాన్ మస్క్ ట్వీట్‌ను పొరపాటు పడ్డారా?
భారత్‌లోకి టెస్లా కార్ల విడుదలపై ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా, అదే సోషల్ మీడియా వేదికగా ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా టెస్లా భారత్ రాక ఆలస్యమవుతోందన్నారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం అప్పుడే ఖండించింది. సోషల్ మీడియా ద్వారా మస్క్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాలు టెస్లాకు ఆహ్వానం పలుకుతున్నాయి.
దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తమ తమ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాల నాయకులు ఆహ్వానించడం ఆశ్చర్యకరంగా ఉందని, అసలు ఎలాన్ మస్క్ ట్వీట్‌ను వారు తప్పుగా అర్థం చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల ఆహ్వానం
టెస్లాకు వివిధ రాష్ట్రాలు ఆహ్వానం పలికాయి. తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన మంత్రులు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించారు. తమ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఆయా రాష్ట్రాల ప్రతినిధులు ఇక్కడే పొరబడ్డారని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో టెస్లాకు వచ్చిన చిక్కు అక్కడేనని, అసలు టెస్లా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేదని, రాజకీయ కోణంలో వివిధ రాష్ట్రాలు స్పందించాయని, కానీ అసలు ఆలస్యమవుతోందే అక్కడ అంటున్నారు.

కేంద్రం.. ఉద్యోగాల సృష్టి కోసం
టెస్లాకు భారత ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. అయితే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. కనీసం అక్కడ తయారీ చేసి, విడిభాగాలు ఇక్కడ అటాచ్ చేయాలని చెబుతోంది. అప్పుడు స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని కేంద్రం చెబుతోంది. టెస్లా రాకతో ఇక్కడ ఉద్యోగాల సృష్టి కూడా జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ఆ దిశగా టెస్లాకు షరతులు విధిస్తోంది.
టెస్లా మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, విడిభాగాలు తీసుకు రావడం కాదు... మొత్తానికి భారత్‌కు కార్లను ఎగుమతి చేస్తామని చెబుతోంది. దానికి 100 శాతం పన్ను మినహాయింపు కావాలని కోరుతోంది.
అయితే పన్ను మినహాయింపుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. కానీ అందుకు ఫలితం ఉండాలని, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలని చెబుతోంది. అయితే టెస్లా మాత్రం అందుకు సిద్ధంగా లేదు.

నేషనల్ పాలసీ
ఇక్కడ మరో అంశం ఉంది. భారత్‌కు సంబంధించిన అంశం అయితే రాష్ట్రాల వరకు పోటీ ఉండవచ్చు. కానీ ఇది దేశానికి సంబంధించిన అంశం. అంటే రాష్ట్రాలు సొంతగా టెస్లాను తీసుకు రావడం కుదరదని అంటున్నారు. టెస్లా రాక నేషనల్ పాలసీ అని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమని గుర్తు చేస్తున్నారు.

టెస్లాకు సవాలే
మరోవైపు భారత్‌లోకి రాక టెస్లాకు కూడా సవాల్ అంటున్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్ వాటా ఒక శాతం కంటే తక్కువే ఉందని గుర్తు చేస్తున్నారు. భారత రహదారులు ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ మోటార్ కంపెనీ, టాటా మోటార్స్ ఇక్కడ లీడింగ్ కంపెనీలు.
ఇటీవల మోడీ ప్రభుత్వం భారత కంపెనీలను ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సహిస్తోంది. అయిప్పటికీ ఇది ప్రస్తుతం తక్కువగానే ఉంది. ఈవీ ధరలు ఎక్కువగా ఉండటం, సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరి రిక్వైర్మెంట్ భయాలతో ఈవీ డిమాండ్ భారత్‌లో అంతగా లేదని చెబుతున్నారు.