For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST Council: ఏపీ, తెలంగాణ డిమాండ్ల లిస్ట్: నిర్మలమ్మ పట్టించుకుంటారా?

|

న్యూఢిల్లీ: వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారాన్ని మోపింది. గూడ్స్, సేల్స్ ట్యాక్స్ (జీఎస్టీ)లో టెక్స్‌టైల్స్‌ శ్లాబ్‌ను మార్చింది. ఫుట్‌వేర్ ఇండస్ట్రీ, ఆన్‌లైన్ ద్వారా కార్లు, ఆటోల బుకింగ్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకూ దీన్ని వర్తింపజేసింది. దీనివల్ల దుస్తులు, పాదరక్షల ధరలు భారీగా పెరుగుతాయి. దీనిపట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. అయినప్పటికీ- కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. జీఎస్టీని అమలు చేయడానికే మొగ్గు చూపుతోంది.

 జీఎస్టీ కౌన్సిల్..

జీఎస్టీ కౌన్సిల్..

ఈ పరిణామాల మధ్య జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ఈ సమావేశం మొదలవుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దీనికి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు దీనికి హాజరు కానున్నారు. మెజారిటీ రాష్ట్రాలు మాత్రం- టెక్స్‌టైల్ ఇండస్ట్రీపై విధించిన జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తోన్నాయి. ఏపీ, తెలంగాణ సహా బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థికమంత్రులు సంయుక్తంగా ఇదే గళాన్ని ఈ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో వినిపించనున్నాయి.

 హరీష్ రావు, బుగ్గన హాజరు..

హరీష్ రావు, బుగ్గన హాజరు..

ఏపీ, తెలంగాణ ఆర్థిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, తన్నీరు హరీష్ రావు ఈ కౌన్సిల్ భేటీలో పాల్గొననున్నారు. ప్రస్తుతం టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, ఫుట్‌వేర్ ఇండస్ట్రీ.. అయిదు శాతం జీఎస్టీ శ్లాబ్‌లో కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ శ్లాబ్‌ను మార్చింది. అయిదు నుంచి 12 శాతం శ్లాబ్‌లోకి చేర్చింది. జనవరి 1వ తేదీ ఇది అమలు కానుంది. 1000 రూపాయల లోపు బిల్లు చెల్లించేలా దుస్తులను కొనుగోలు చేస్తే అయిదు శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అది దాటితే 12 శాతాన్ని కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది.

 జీఎస్టీ పెంపు వల్ల..

జీఎస్టీ పెంపు వల్ల..

ఫుట్‌వేర్‌పై మాత్రం ఈ పరిమితి కూడా లేదు. వాటిని కొనుగోలు చేసిన ప్రతీసారీ 12 శాతం జీఎస్టీని చెల్లించక తప్పదు. అలాగే- ఆన్‌లైన్ ద్వారా కార్లు, ఆటోలను బుక్ చేసుకున్నా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే- ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా జీఎస్టీ బాదుడు తప్పదు. ఇది సరి కాదనేది రాష్ట్రాల వాదన. ఇదే వాదనను రాష్ట్రాల ఆర్థికమంత్రులు నిర్మల సీతారామన్‌కు వినిపించనున్నారు. జీఎస్టీ పెంపుదలకు ఒక్కరోజు ముందు కౌన్సిల్ సమావేశం అవుతుండటం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

 ఎఫ్ఆర్‌బీఎం పరిమితి

ఎఫ్ఆర్‌బీఎం పరిమితి

ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి ఉద్దేశించి.. కేంద్రం రాష్ట్రాలకు విధించిన రుణాల పరిమితిని పెంచాలని తెలంగాణ కోరుతోంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్ఆర్‌బీఎం) చట్టం కింద ప్రస్తుతం తాము రాష్ట్రం తరఫున రుణాలను తీసుకోవడానికి మూడుశాతం వరకు మాత్రమే అనుమతి ఉందని, దీన్ని అయిదు శాతానికి పొడిగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆర్థికలోటుకు తోడుగా కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిల మొత్తం కూడా అతి తక్కువగా అందుతోందని హరీష్ రావు చెప్పారు.

బకాయిలు రాబట్టుకోవడంపై..

బకాయిలు రాబట్టుకోవడంపై..

దీన్ని పెంచాలని డిమాండ్ చేస్తోంది. పోలవరం బకాయిలు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలనేది ఏపీ ప్రభుత్వం డిమాండ్. ఏపీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ ఈ భేటీకి హాజరు కానున్నారు. బకాయిలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వస్త్ర పరిశ్రమ, ఫుట్‌వేర్ వంటి రోజువారీ అవసరాలకు సంబంధించిన పరిశ్రమలపై అదనపు భారాన్ని మోపడాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

English summary

Telangana govt has urged the Centre to withdraw its proposed plan to increase GST rates on textiles

Telangana Minister KTR has also urged the Centre to withdraw its proposed plan to increase GST rates.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X