For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెటిజెన్లు చేస్తున్న ఉపవాస దీక్ష: అదేమిటో తెలుసా?

|

అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, భవాని దీక్ష లాంటివి మనకు తెలుసు. కానీ ఈ నెటిజన్లు చేస్తున్న కొత్త తరహా దీక్ష ఏమిటా అనే కదా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. కాకపోతే చిన్న వివరణ తరువాత. ఏ దీక్ష అయినా ఎందుకు చేస్తారు? దీక్షలో భక్తి, నమ్మకం, విశ్వాసం ఎంత ఉంటుందో అంతకంటే అధికంగా ఒక వ్యక్తి తనపై తాను నియంత్రణ సాధించే దిశగా నడిపించే శక్తి ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు. అందుకే చాలా మంది తమ దుర్వ్యసనాల నుంచి విముక్తిని పొందేందుకు ఎంచుకొనే మార్గం కూడా దీక్షనే. భగవంతుని ముందు మోకరిల్లి క్రమం తప్పకుండా పరిమిత ఆహారం, క్రమశిక్షణ, సమభావం, ధ్యానం వంటి మంచి లక్షణాలను అలవరచుకొంటారు.

ఏ పనినైనా వరుసగా 21 రోజులు క్రమం తప్పకుండ చేస్తే అది మనకు అలవాటు అవుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకే అన్ని రకాల దీక్షల్లో కనీసం 21 రోజులు, గరిష్టంగా 41 రోజులు ఉపాసన చేయాలన్న నియమం ఉంటుంది. ఏడాది లో ఒకసారి ఇలా చేయటం వల్ల సదరు వ్యక్తి జీవన విధానం పూర్తిగా పరివర్తనం చెందుతుందన్నది శాస్త్రం. అందుకే దీక్షలకు అంత శక్తి. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ యుగం లో పౌరులకు కూడా ఒక దీక్ష అవసరం అవుతోంది. అదేమిటంటే .... నెట్ ఫాస్టింగ్. అంటే కొంత సమయం ఇంటర్నెట్ కు దూరంగా ఉండటం. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

మందగమనం: సాహసోపేత నిర్ణయాలు.. మోడీదే బాధ్యత, ట్యాక్స్ కట్ ఊహాగానాలు

అస్తమానం అదే ధ్యాస...

అస్తమానం అదే ధ్యాస...

టెక్నాలజీ మనిషి పనులను సులభం చేస్తుంది. కానీ అది వ్యసనంలా మారిందంటే మాత్రం వదిలించుకోవటం కష్టం. ప్రస్తుతం మనమంతా మొబైల్, ఇంటర్నెట్ వ్యసనానికి బానిసలుగా మారిపోతున్నాం. పొద్దున్న లేచింది మొదలు, మళ్ళీ పడుకునే వరకు కనీసం 10 గంటల నుంచి 14 గంటలు చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. ప్రతి నిమిషానికోసారి అవసరం ఉన్నా లేకున్నా మొబైల్ చెక్ చేసుకోవాల్సిందే. దీంతో జన జీవనం మొబైల్ వశమైపోయింది. ఇది ఇలాగే కొనసాగితే... జనాలకు రకరకాల రుగ్మతలు రావటం ఖాయమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కంటి జబ్బులు, నాడీ వ్యవస్థ దెబ్బతినటం, వినికిడి లోపం, డిప్రెషన్ కు లోనవడం వంటివి ఇబ్బందికి గురి చేస్తాయని చెబుతున్నారు. ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది కూడా. ఏదైనా మనకు అవసరం అయినంత వరకు మాత్రమే వినియోగించాలి. అధికంగా చేస్తే అది మనకే చేటు చేయటం సహజ సూత్రం.

మొదలైన నెట్ ఫాస్టింగ్...

మొదలైన నెట్ ఫాస్టింగ్...

ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వాడక వ్యసనం నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఇప్పుడిప్పుడే నెట్ ఫాస్టింగ్ మొదలు పెట్టారు కొందరు నెటిజన్లు. ఇందులో భాగంగా వారాంతాల్లో ఫోన్లు పక్కన పెట్టేసి, వేరే ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూడటం కంటే కూడా తమకు నచ్చిన పుస్తకాలూ చదవటం మీద దృష్టిసారిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ అండ్ ఈ కామర్స్ సేవలను అందించే ఇంస్టా మోజో సహా వ్యవస్థాపకుడు ఐన సంపద్ స్వైన్ కు గతంలో రోజుకు 10 గంటలు మొబైల్ చూసే అలవాటు ఉండేది. కానీ అయన ప్రస్తుతం ఇంటర్నెట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో కేవలం ఫోన్ ను రెండు గంటలు మాత్రమే వాడుతున్నారు. మిగిలిన సమయంలో తనకిష్టమైన పుస్తకాలు చదువుతున్నారు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఐటీ ప్రొఫెషనల్ రపుంజీల్ పెరీరా, కంటెంట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ భావన నారాయణ్ వంటి వారు కూడా ఇదే దారిలో పయనిస్తున్నారని ఈటీ తన కథనంలో వెల్లడించింది. భావన అయితే వారాంతంలో పేరెంట్స్ కు సమయం కేటాయిస్తోంది.

రోజుకు 100 నోటిఫికేషన్స్...

రోజుకు 100 నోటిఫికేషన్స్...

ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశం మనది. అలాగే ఇంటర్నెట్ వినియోగంలో కూడా భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలుస్తోంది. దీంతో దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా ఇంటర్నెట్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల రాక, అందుబాటు ధరలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు లభిస్తుండటంతో ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీంతో ఇంటర్నెట్ ఆధారిత ప్రమోషన్లు, ప్రకటనలు ఎక్కువయ్యాయి.

జనాలు అస్తమానం సోషల్ మీడియా లో మునిగి తేలుతున్నారు. అందుకే కంపెనీలు అన్నీ తమ తమ ప్రకటనల నోటిఫికేషన్ల తో జనాలను ఆకర్షిస్తున్నాయి. ఇండియా లో సగటున ఒక్కో ఇంటర్నెట్ వినియోగదారుడికి రోజుకు కనీసం 80 నుంచి 100 నోటిఫికెషన్స్ వస్తున్నాయి. మొబైల్ వినియోగంలో మిగితా వారికంటే యువతే చాలా ముందు ఉంటుందన్నది సహజమైన విషయమే కానీ.... అందులోనూ బీటెక్ చదివే విద్యార్థుల్లో ఇది చాలా అధికమని సర్వేల్లో తేలింది. అందులోనూ హాస్టల్, అద్దె రూముల్లో ఉండే మేల్ బ్యాచిలర్స్ చాలా ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు తేలుతోంది. ఇప్పటికైనా మొబైల్, ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయట పడేందుకు అందరూ నెట్ ఫాస్టింగ్ చేస్తే మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. బదులుగా తమకు ఇష్టమైన వ్యాపకాల వైపు దృష్టిసారించాలని కోరుతున్నారు. ట్రెక్కింగ్, సైక్లింగ్, జిమ్, పర్యాటక ప్రదేశాల పర్యటన, పల్లెటూరు దర్శనం, పుస్తక పఠనం, పేరెంట్స్ కేర్ వంటి అంశాలకు సమయం కేటాయిస్తే తనువూ మనసూ ఆరోగ్యవంతం అవుతాయని పేర్కొంటున్నారు.

English summary

Techies take ‘fast’ lane on net highway

On most weekends, Sampad Swain used to be glued to his smartphone — streaming Netflix and Amazon Prime. The time he spent on the phone was as much as 10 hours a day. But that was then. Since October, the cofounder of payments and ecommerce startup Instamojo has cut down drastically on screen time, using his phone for not more than two hours a day during weekends.
Story first published: Saturday, November 30, 2019, 11:53 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more