For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు TCS శుభవార్త, వారికి వేతనాల పెంపు.. కానీ: రూ.3,000 వద్ద షేర్ల బైబ్యాక్

|

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఆదాయం మూడు శాతం పెరిగినా నికర లాభం 7 శాతం క్షీణించింది. ఫలితాల సందర్భంగా ఇన్వెస్టర్లతో పాటు ఉద్యోగులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మెగా బైబ్యాక్ కూడా ప్రకటించింది. బైబ్యాక్ ప్రతిపాదనకు బుధవారం టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఐటీ సంస్థలతో పాటు ఇన్వెస్టర్లు టీసీఎస్ ఫలితాల దిశగా ఆసక్తికరంగా వేచి చూసిన విషయం తెలిసిందే.

TCS Q2 results: నికర లాభంలో 7% క్షీణత, రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్

వేతనాల పెంపు.. పనితీరు ఆధారంగా

వేతనాల పెంపు.. పనితీరు ఆధారంగా

2020 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి కంపెనీలో కొత్తగా చేరిన 16,000 మందితో పాటు టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 4,53,450కు చేరుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుండి పనితీరు ఆధారంగా వేతనాలు పెంచుతున్నట్లు టీసీఎస్ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు, జీతాలకు భారీ కోతలు పడుతున్న సమయంలో టీసీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార భవిష్యత్తు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. 'కష్టకాలంలో అసాధారణ స్థాయిలో పనిచేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వేతనాల పెంపును అమలు చేయబోతున్నామ'ని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ తెలిపారు. కొత్త వారిని తీసుకోవడం ప్రారంభించామని, సెప్టెంబర్ క్వార్టర్‌లో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్‌ పెంచామని తెలిపారు. ఆట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్ టైమ్ కనిష్టం 8.9 శాతానికి చేరుకున్నాయన్నారు.

సీఈవో ఏమన్నారంటే

సీఈవో ఏమన్నారంటే

ఇప్పటికే తమ కంపెనీ చేతిలో ఆర్డర్లు ఉన్నాయని, మరికొన్ని డీల్స్ కోసం చర్చలు జరుగుతున్నాయని, దీంతో కంపెనీ వ్యాపార భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ చెప్పారు. పటిష్టమైన ఆర్డర్ బుక్, మార్కెట్ షేరును పెంచుకుంటూ ఉండటం తదితర అంశాలతో కంపెనీ భవిష్యత్తు అవకాశాలపై ధీమాగా ఉన్నామన్నారు. అలాగే, వాటాదారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

షేర్ల బైబ్యాక్...

షేర్ల బైబ్యాక్...

టీసీఎస్ 2017 తర్వాత మూడో మెగా బైబ్యాక్‌ను ప్రకటించింది. బుధవారం షేర్ల ముగింపు ధర రూ.2,737.4 కంటే 9 శాతంతో రూ.3,000 వద్ద ఒక్కో షేర్‌ను బైబ్యాక్ కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 5,33,33,333 షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.16,000 కోట్లు వెచ్చిస్తుంది. బైబ్యాక్‌కు సంబంధించిన తేదీలు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తారు.

డివిడెండ్.. చెల్లింపు తేదీ

డివిడెండ్.. చెల్లింపు తేదీ

ఒక్కో షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. నవంబర్ 3వ తేదీన డివిడెండ్ చెల్లింపు ఉంటుంది. అక్టోబర్ 15ను రికార్డు తేదీగా ఖరారు చేశారు.ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే రెవెన్యూ స్థిర కరెన్సీలో 4.8 శాతం పెరిగింది. డాలర్ రూపేణ 7.2 శాతం వృద్ధి సాధించింది. విభాగాల వారీగా బీఎఫ్ఎస్ఐ 6.2 శాతం, రిటైల్ 8.8 శాతం, లైఫ్ సైన్సెస్ అండ్ ఆరోగ్య సంరక్షణ 6.9 శాతం, సాంకేతికసేవలు 3.1 శాతం, తయారీలో 1.4 శాతం చొప్పున ఆదాయం పెరిగింది. కమ్యూనికేషన్స్ మీడియా విభాగంలో ఆదాయం 2.4 శాతం తగ్గింది.

ఆదాయం ఉత్తర అమెరికాలో 3.6 శాతం, బ్రిటన్‌లో 3.8 శాతం, ఐరోపాలో 6.1 శాతం, భారత్‌లో 20 శాతం, లాటిన్ అమెరికాలో 5.5 శాతం, ఆసియా పసిఫిక్‌లో 2.9 శాతం, మధ్య ప్రాచ్య దేశాల్లో 7 శాతం పెరిగింది.

English summary

TCS announces salary hike for employees, effective October 1

India's biggest IT company today said that salary hike for its employees will be rolled out effective October 1. TCS consolidated headcount stood at 453,540 as of September 30, 2020.
Story first published: Thursday, October 8, 2020, 9:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X