For Quick Alerts
For Daily Alerts
Tax Raids: దిగ్గజ రియల్ ఎస్టేట్ గ్రూప్ పైన ఐటీ దాడులు
|
పన్ను ఎగవేత ఆరోపణలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ హిరానందానీ గ్రూప్‌కు చెందిన పలు కార్యాలయాల పైన ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మొత్తం 24 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీకు చెందిన టాప్ అధికారుల ఇళ్లతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
హీరానందానీ డెవలపర్స్ 1978లో నిరంజన్ హిరానందానీ, సురేంద్ర హీరానందానీ సోదరులు స్థాపించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఈ కంపెనీ మహారాష్ట్రలో అనేక ప్రాజెక్టులను చేపట్టింది.

నిరంజన్, సురేంద్రలు వేర్వేరుగా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. మరోవైపు హీరానందానీ కమ్యూనిటీస్ ఫౌండర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు నిరంజన్ హీరానందానీ. హౌస్ ఆఫ్ హీరానందానీ చైర్మన్ అండ్ డైరెక్టర్‌గా ఉన్నారు సురేంద్ర హీరానందానీ.
Comments
English summary
Tax Raids On Real Estate Giant Hiranandani Group In Mumbai, 2 Other Cities
Story first published: Tuesday, March 22, 2022, 12:44 [IST]