భాగస్వామ్యంపై ఊహాగానాలు, టెస్లాపై టాటా మోటార్స్ క్లారిటీ
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. టాటా మోటార్స్-టెస్లా జట్టు కడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. దీనిపై టాటా మోటార్స్ స్పష్టతనిచ్చింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టెస్లాతో భాగస్వామ్యానికి అవకాశాల్లేవని టాటా మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం టెస్లాతో భాగస్వామ్యం కావాలని ఎలాన్ మస్క్ కోరుతున్నారు. అదే సమయంలో టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దీంతో టాటా మోటార్స్ టెస్లాతో భాగస్వామ్యం ప్రచారానికి తెరదింపింది. టెస్లాపై ట్వీట్‌ను కూడా తొలగించింది.

అలానాటి బాలీవుడ్ పాట 'తేరే మేరే ప్యార్ కే చార్చే' పేరడీతో శుక్రవారం పోస్ట్ చేసింది. అయితే భాగస్వామ్యంపై ఊహాగానాలు, మార్కెట్ వేడెక్కడంతో ఆ పోస్టును తొలగించింది. అనంతరం ఎలాంటి భాగస్వామ్యం కోసం నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది.