For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మరోసారి చెక్ చేసుకోండి!

|

ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం వస్తుంది. పైగా రెస్టారెంట్ కంటే తక్కువ ధరకే ఫుడ్ లభిస్తుంది. ఎందుకంటే ఫుడ్ డెలివరీ చేసే కంపెనీలు ప్రతి ఆర్డర్ పై ఎదో ఒక ఆఫర్ ప్రకటిస్తూనే ఉంటుంది. ఈ రంగంలో ప్రధానంగా స్విగ్గి, జొమాటో ల మధ్యే ఉంది. అందుకే ఒకదానిని మించి మరో కంపెనీ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఊరిస్తుంటాయి. అయితే, ఇకపై అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే స్విగ్గి త్వరలోనే ఫుడ్ డెలివరీ చార్జీలను పెంచబోతోందంట. అలాగే రెస్టారెంట్ల నుంచి వసూలు చేసే కమిషన్ కూడా పెంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే స్విగ్గి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ పైనా కొంత ఎక్కువ మొత్తంలో డెలివరీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

అలాగే హోటల్ నుంచి ఫుడ్ పై డిస్కౌంట్ కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఫుడ్ డెలివరీ రంగంలో సేవలు అందిస్తున్నప్పటికీ స్విగ్గి విపరీతమైన నష్టాలను చవిచూస్తోంది. ప్రతి రూపాయి సంపాదన కోసం దాదాపు మూడు రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ కంపెనీ లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఇప్పుడు స్విగ్గి ని లాభాల బాట పట్టించాలని ఒత్తిడి చేస్తున్నాయి. దాంతో స్విగ్గి అధిక ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తోంది.

60% వాటా...

60% వాటా...

బెంగళూరు కేంద్రంగా సేవలు అందించే స్విగ్గి ... ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. మొత్తం ఈ రంగంలో 60% వాటాను కైవసం చేసుకొని స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా స్విగ్గి ఫౌండర్, సీఈఓ శ్రీ హర్ష మాజేటి వెల్లడించారు. అయితే, ఒకప్పుడు కేవలం హోటల్ టేబుల్ రిజర్వేషన్ కు మాత్రమే పరిమితమైన జొమాటో... తర్వాత ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించింది. దీంతో ఈ రంగంలో పోటీ తీవ్రతరమైంది. అదే సమయంలో ఉబెర్ కూడా ఉబెర్ ఈట్స్ పేరుతొ ఈ రంగంలోకి ప్రవేశించింది. ఫుడ్ పంధాను కొనుగోలు చేసి, ఓలా కూడా తన కూడా ఉన్నానని నిరూపించుకోండి. కానీ మార్కెట్ పోటీ లో తట్టుకోలేక దాదాపు అన్ని కంపెనీలు బిచాణా సర్దేస్తున్నాయి. ఎంత నష్టాలు ఉన్నా... ఇన్వెస్టర్ల దన్ను ఉండటంతో కేవలం స్విగ్గి, జొమాటో మాత్రమే దూసుకుపోతున్నాయి.

అమెరికా చేతిలో ఇరాన్ టాప్ కమాండర్ హతం, పెరిగిన చమురు ధరలు

ఇద్దరికీ బాదుడే...

ఇద్దరికీ బాదుడే...

సాధారణంగా స్విగ్గి రెస్టారెంట్లతో 11 నెలల కాంట్రాక్టు కుదుర్చుకుంటుంది. ఫుడ్ ఆర్డర్ వేల్యూ లో 18-25% కమిషన్ ను వసూలు చేస్తుంది. ఒకప్పుడు కమిషన్ కేవలం 12-18% వరకే ఉండేదని, తాజాగా అది 18- 23% నికి పెరిగినట్లు ఈటీ పేర్కొంది. అయితే ఇది తమ వ్యాపారంలో సహజ పరిణామమేనని స్విగ్గి పేర్కొన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. రెస్టారెంట్లు అధికంగా ఉన్న ప్రదేశంలో కమిషన్ మరింత పెరుగుతుందట. వాటి సంఖ్య తక్కువగా ఉన్న చోట తక్కువ కమిషన్ వసూలు చేస్తుందట. చాలా కాలం పాటు డెలివరీ చార్జీలు వసూలు చేయని స్విగ్గి ... ప్రస్తుతం వినియోగదారుల నుంచి కూడా కొంత ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే ప్రతి డెలివరీపై చార్జీలు వసూలు చేయబోతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రకటనలు...

ప్రకటనలు...

స్విగ్గి ప్లాటుఫామ్ పై నమోదు ఐన హోటల్స్, రెస్టారెంట్ల మధ్య కొత్త పోటీకి స్విగ్గి తెరలేపబోతోంది. తమ వెబ్సైటు, మొబైల్ ఆప్ లో ప్రకటనలు ఇచ్చేలా వాటిని కన్విన్స్ చేస్తోంది. ఎవరైతే ప్రకటనలు ఇస్తారో ... వాటిని వినియోగదారులకు ముందు కనిపించేలా చర్యలు తీసుకొంటోంది. దీంతో అటు కమిషన్ తో పాటు కొత్త రెవిన్యూ మార్గం కూడా ఏర్పడబోతోంది. నెలవారీ ఖర్చులను తగ్గించుకుంటూ, లాభాల దిశగా పయనించేందుకు ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని స్విగ్గి భావిస్తోంది. అయితే, అన్ని రకాలుగా బాదుడు మొదలు పెడితే, రెవిన్యూ ఏమో గానీ ఉన్న ఆర్డర్లు కూడా వస్తాయో లేదో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఆఫర్లుంటేనే వినియోగదారులు ఆర్డర్ చేస్తున్నారు తప్పితే... ఒక బ్రాండ్ నచ్చితే అవసరం ఉన్నా లేకున్నా ఆర్డర్లు ఇవ్వటం లేదని గుర్తించాలని వారు అభిప్రాయపడుతున్నారు.

English summary

Swiggy seeks higher commissions from restaurants in certain regions

Swiggy is progressively raising its commissions from restaurants in regions where its service is nearing maturity, while aggressively pushing partners to advertise on its platform, as the company shifts focus to monetising its core food ordering business, restaurateurs and others with knowledge of the matter said.
Story first published: Saturday, January 4, 2020, 12:46 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more